LADY SUPERSTAR VIJAYASHANTI SAYS NO TO CHILDREN AND HERE THE REAL REASON BEHIND THIS PK
విజయశాంతి పిల్లల్ని వద్దనుకోడానికి అసలు కారణం అదే..
‘సరిలేరు నీకెవ్వరు’లో విజయశాంతి (Twitter/Photo)
ఎవరైనా కూడా పెళ్లైన తర్వాత పిల్లలెప్పుడు అంటారు.. విశేషం ఉందా అని అడుగుతుంటారు. అమ్మతనం వద్దనుకునే వాళ్లు మాత్రం ఎవరూ ఉండరు. పిల్లల కోసం పూజలు కూడా చేస్తుంటారు.
ఎవరైనా కూడా పెళ్లైన తర్వాత పిల్లలెప్పుడు అంటారు.. విశేషం ఉందా అని అడుగుతుంటారు. అమ్మతనం వద్దనుకునే వాళ్లు మాత్రం ఎవరూ ఉండరు. పిల్లల కోసం పూజలు కూడా చేస్తుంటారు. కానీ విజయశాంతి మాత్రం కావాలనే పిల్లలను కనలేదు. సరిలేరు నీకెవ్వరు సినిమాతో చాలా రోజుల తర్వాత స్క్రీన్ పై కనిపిస్తుంది లేడీ సూపర్ స్టార్. తన మీడియా ముందు ఎక్కువగా కనిపిస్తుంది. తన జీవితంలో జరిగిన ఆసక్తికరమైన విషయాల గురించి.. సాధించిన విజయాల గురించి.. ఎదురైన పరాభవాల గురించి అన్నింటిపై మనసు విప్పి మాట్లాడింది విజయశాంతి. ముఖ్యంగా తాను చిన్నపుడు ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పారు ఈమె.
విజయశాంతి పైల్ ఫోటో
తనకు కేవలం 17 ఏళ్లున్నపుడే తండ్రి చనిపోయారని.. ఆ తర్వాత ఏడాది కాలంలోనే తల్లి కూడా చనిపోయిందని చెప్పింది విజయశాంతి. దేవాలయం సినిమా షూటింగ్ జరుగుతున్నపుడు నాన్న పోతే.. ఆ తర్వాత అమ్మ కూడా చనిపోయిందని ఎమోషనల్ అయింది విజయశాంతి. ఆ సమయంలో తనను తిన్నావా.. ఉన్నావా.. పడుకున్నావా అని అడిగే వాళ్లు కూడా లేరని చెప్పింది ఈ సీనియర్ హీరోయిన్. తను జీవితంలో ఇన్ని కష్టాలు పడుతున్న సమయంలో దేవుడు కరుణించి ఇచ్చిన వరం నిర్మాత, తన భర్త శ్రీనివాస ప్రసాద్ అని చెబుతుంది విజయశాంతి. ఆయన నిర్మాణంలోనే 'కర్తవ్యం' సినిమా చేసింది ఈమె.
విజయశాంతి పైల్ ఫోటో
తన పెళ్లి ఇప్పటికి 32 ఏళ్లయిందని.. 1988, మార్చ్ 29న రిజిష్టర్ మ్యారేజ్ చేసుకున్నామని గుర్తు చేసుకుంది ఈ హీరోయిన్. ఇక అతి ముఖ్యమైన పిల్లల విషయం కూడా ఓపెన్ అయింది విజయశాంతి. తనతో పాటు తన భర్తకు కూడా పిల్లలంటే ఎంతో ఇష్టమని చెప్పిన విజయశాంతి.. ఉద్యమం, పార్టీ లాంటివి మొదలు పెట్టిన తర్వాత పిల్లల్ని కనాలనిపించలేదని చెప్పింది. అప్పట్నుంచి తనకు ప్రజలే పిల్లలని చెప్పింది విజయశాంతి. ఒకవేళ పిల్లలు పుడితే.. తాను వాళ్ల కోసమే ఎక్కువ సమయం ఇవ్వాల్సి వస్తుంది.. స్వార్థం కూడా పెరిగిపోతుందని వద్దనుకున్నామని సంచలన విషయాలు బయట పెట్టింది లేడీ సూపర్ స్టార్.