Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: October 17, 2019, 7:23 PM IST
విఘ్నేశ్ శివన్, నయనతార Instagram
నయనతార ఇప్పటి హీరోయిన్ కాదు.. ఈమెతో పాటు వచ్చిన హీరోయిన్లంతా ఇప్పుడు పెళ్లిళ్లు చేసుకుని హాయిగా కుటుంబాలతో ఉన్నారు. కానీ నయన్ మాత్రం ఇప్పటికీ స్టార్ హీరోయినే. ఇంకా చెప్పాలంటే సౌత్ నెంబర్ వన్ హీరోయిన్. ఒక్కో సినిమా కోసం దాదాపు 5 కోట్లకు పైగానే తీసుకుంటుంది ఈ బ్యూటీ. లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ లైన్‌తో హీరోలతో పనిలేకుండా వరస సినిమాలు చేస్తుంది నయనతార. అయితే ఎంత క్రేజ్ ఉన్నా కూడా వయసు మాత్రం ఆగదు కదా.. ఇప్పుడు నయనతారకు కూడా ఇదే సమస్యగా మారుతుంది. ఈమె ఏజ్ 35 దాటిపోయింది. దాంతో మొహంలో కూడా ఆ ఛాయలు కనిపిస్తున్నాయి.

నయనతార (Twitter.com/Nayanthara)
ఈ మధ్యే విడుదలైన సైరాలో చిరంజీవి సరసన నటించింది నయన్. అందులో ఈమె వయసు కూడా స్పష్టంగా కనిపించిందనే మాటలు వినిపించాయి. దాంతో ఇప్పుడు తన అందంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. పైగా డిసెంబర్లో ప్రియుడు విఘ్నేష్ శివన్‌తో కలిసి ఏడడుగులు నడవడానికి సిద్ధమవుతుంది నయన్. ఈ ప్రచారం మొదలు కావడంతో ఇప్పుడు నయన్ గ్లామర్ పెంచుకోడానికి ఆయుర్వేదం నమ్ముకుంటుందని తెలుస్తుంది.

ప్రియుడు విఘ్నేష్ శివన్‌తో నయనతార (file Photo)
ఇప్పటి వరకు జిమ్స్, యోగాలంటూ గడిపిన నయనతార.. ఇప్పుడు సొంత రాష్ట్రం అయిన కేరళ వైద్యాన్ని నమ్ముకుంటుంది. తనకంటే ఏడాది చిన్నవాడైన విఘ్నేష్ ముందు ఇప్పుడు తాను చిన్నపిల్లలా కనిపించాలని ఫిక్సైపోయింది ఈ బ్యూటీ. దాంతో పాటు వరస సినిమాలు చేస్తుంది నయన్. సీనియర్ హీరోలతోనే కాకుండా కుర్ర హీరోలతోనూ రొమాన్స్ చేస్తుంది కాబట్టి అటు ఇటు వయసు కనిపించకుండా ఉండటానికి ఆయుర్వేదమే నయం అంటుంది ఈ ముద్దుగుమ్మ. మరి చూడాలిక.. నయన్ అందాల పరీక్ష ఎంతవరకు సక్సెస్ అవుతుందో..?
Published by:
Praveen Kumar Vadla
First published:
October 17, 2019, 7:23 PM IST