Nayanthara: లేడీ సూపర్‌స్టార్ నయనతారకు కొత్త కష్టాలు.. దాని ఫలితమేనా..

దక్షిణాదిలోని నాలుగు భాషల్లోనూ నటించిన నయనతార...ఇప్పటికీ తమిళ సినిమాల్లో విలక్షణ పాత్రలు పోషిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం తెలుగులో చిరంజీవి హీరోగా నటిస్తోన్న ‘సైరా నరసింహారెడ్డి’తో రజీనీకాంత్, మురుగదాస్ ‘దర్బార్’లో  కథానాయికగా నటిస్తోంది.తాజాగా ఈభామకు కొత్త చిక్కులు మొదలైయ్యాయి.

news18-telugu
Updated: June 20, 2019, 12:22 PM IST
Nayanthara: లేడీ సూపర్‌స్టార్ నయనతారకు కొత్త కష్టాలు.. దాని ఫలితమేనా..
నయనతార (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
దక్షిణాదిలోని నాలుగు భాషల్లోనూ నటించిన నయనతార...ఇప్పటికీ తమిళ సినిమాల్లో విలక్షణ పాత్రలు పోషిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం తెలుగులో చిరంజీవి హీరోగా నటిస్తోన్న ‘సైరా నరసింహారెడ్డి’తో రజీనీకాంత్, మురుగదాస్ ‘దర్బార్’లో  కథానాయికగా నటిస్తోంది. మరోవైపు తమిళంలో లేడీ ఓరియంటెడ్ సినిమాలతో దుమ్ము దులుపుతోంది.పారితోషికంలోనూ తన ఆధిక్యతను చాటుకుంటున్న ఈ స్టార్ హీరోయిన్‌కు ప్రస్తుతం కొత్త తలనొప్పి మొదలయింది. వివరాలలోకి వెళితే.. ఇప్పటివరకు నటిగా అవకాశాలకు ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా...  సక్సెస్ రేటింగ్ పడిపోవడమే ఆమెను ఆందోళనకు గురిచేస్తోంది.  నిజానికి ఈ సంచలన నటి సక్సెస్‌ను చూసి చాలా కాలమే అయింది. ఇటీవలె ‘ఐరా’, శివకార్తికేయన్‌తో నటించిన ‘మిస్టర్ లోకల్’ చిత్రాలు నయనతారను పూర్తిగా నిరాశపరిచాయి. తాజాగా ఈ భామ నటించిన చిత్రం ‘కొలైయుధీర్ కాలం’  చిత్రం షూటింగ్ ఆలస్యం కావడం ఆమెకు శిరోభారంగా మారిందనే చెప్పాలి. ఇప్పటికే   షూటింగ్ పూర్తి చేసుకొని ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం వరకూ వచ్చిన ‘కొలైయుధీర్ కాలం’ ఆడియో  వేడుకలో సీనియర్ నటుడు రాధారవి నయనతారపై అనుచిత వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపింది.

Nayanathara Ex Lover Shibu going to be married Very soon,nayanthara,nayanthara movies,simbu nayanthara,shimbu going to married,nayanthara new movie,nayanthara hot,nayanthara songs,nayanthara simbu,nayanthara love,simbu,nayanthara and simbu,nayanthara (tv actor),nayanthara tatoo,simbu nayanthara relationship,nayanthara (award winner),nayantara,nayanathara love for simbu,nayanathara love scens,nayanthara and simbu hot,nayanthara simbu videos,nayanthara simbu break up,nayanthara hot love scene,kollywood,tamil cinema,silambarasan,actor silambarasan family,silambarasan family photos,simbu,silambarasan movies,silambarasan lifestyle,str,#silambarasan,silambarasan hits,silambarasan movie,actor silambarasan,t r silambarasan str,silambarasan actor,silambarasan net worth,silambarasan childhood,silambarasan movies 2017,silambarasan mass scenes,silambarasan movie scenes,silambarasan super scenes,silambarasan movie trailer,silambarasan acting scenes,సిలంబరసన్,శింబు,శింబు పెళ్లి,నయనతార,త్వరలో పెళ్లి పీఠలు ఎక్కనున్న శింబు,శింబు,
నయనతార


ఇదిలా ఉంటే.. ఈ సినిమా  ‘కొలైయుధీర్ కాలం’ టైటిల్ సమస్యతో ఈ చిత్ర విడుదలపై కోర్టు తాత్కాలిక నిషేధాన్ని విధించింది. ఇదంతా నటి నయనతారకు మనశ్శాంతిని లేకుండా చేస్తున్నాయి. ఐతే ఈ చిత్రాన్ని హిందీలోనూ ‘ఖామోషి’ పేరుతో తెర కెక్కించాడు దర్శకుడు చక్రి తోలేటి. ఈ చిత్రంలో నయనతార పాత్ర హిందిలో తమన్నా చేసింది. ఈ చిత్రం  ఇటీవల విడుదలై బాలీవుడ్‌లో డిజాస్టర్‌గా నిలచింది. ఈ చిత్ర ఫలితాన్ని చూసి నయనతారకు బెంగ పట్టుకుందట. ఐతే నయనతార ఆందోళన మాత్రం చిత్రం ఫ్లాప్ అయినందుకు కాకుండా.. తన మార్కెట్ ఎక్కడ ఎక్కడ దెబ్బ తింటుందో అని ఒకటే దిగాలుగా ఉందట.
Published by: Kiran Kumar Thanjavur
First published: June 20, 2019, 12:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading