LADY SUPER STAR VIJAYASHANTI RE ENTRY AFTER 13 YEARS WITH MAHESH MOVIE AND ANIL RAVIPUDI SHARED A LOCATION PIC PK
అదిరిపోయిన విజయశాంతి రీ ఎంట్రీ.. 13 ఏళ్ళ తర్వాత కూడా అదే డైనమిజమ్..
విజయశాంతి ఫైల్ ఫోటో (Source: Twitter)
ఒకటి రెండు కాదు.. 13 ఏళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లోకి వస్తుంది విజయశాంతి. ఆమెను సినిమాల్లో నటింపజేయాలని చాలా మంది దర్శకులు ప్రయత్నించారు కానీ ఎవరి వల్లా కాలేదు. చివరికి అనిల్ రావిపూడి అది సాధించాడు.
ఒకటి రెండు కాదు.. 13 ఏళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లోకి వస్తుంది విజయశాంతి. ఆమెను సినిమాల్లో నటింపజేయాలని చాలా మంది దర్శకులు ప్రయత్నించారు కానీ ఎవరి వల్లా కాలేదు. చివరికి అనిల్ రావిపూడి అది సాధించాడు. మహేష్ బాబు చేస్తున్న కొత్త సినిమా సరిలేరు నీకెవ్వరులో నటిస్తుంది విజయశాంతి. ఈ సినిమాలో పవర్ ఫుల్ రోల్ కోసం ఆమెను తీసుకున్నారు. తాజాగా ఈమె చిత్ర సెట్లో అడుగు పెట్టింది. దాంతో అనిల్ రావిపూడి ఆమెకు ట్విట్టర్ సాక్షిగా స్వాగతం పలికాడు. ‘ఇట్స్ మేకప్ టైమ్ ఫర్ విజయశాంతి గారు’ అంటూ అనిల్ ట్వీట్ చేసాడు.
After 13 years.. It's make up time for Vijayashanthi garu.. Nothing has ever changed in all these 13 years. Same discipline, same attitude and same dynamism. Welcome on-board @vijayashanthi_m garu 😊 #SarileruNeekevvarupic.twitter.com/xM69EgjP9c
ఆమె ఫోటోను ట్వీట్ చేయడమే కాకుండా.. ఈ 13 ఏళ్లలో ఆమె ఏ మాత్రం మారలేదు.. అదే క్రమశిక్షణ.. అదే వైఖరి.. అదే డైనమిజమ్ అంటూ.. విజయశాంతిని పొగిడాడు అనిల్ రావిపూడి. దీనికి విజయశాంతి కూడా రిప్లై ఇచ్చింది. అనిల్ రావిపూడి గారు, మహేష్ బాబు గారు మీ స్వాగతానికి కృతజ్ఞతలు.. వాతావరణం మారుతుందేమో కానీ మనిషి ఆటిట్యూడ్ మారదు.. దానికి మీరే నిదర్శనం అంటూ ట్వీట్ చేసింది. ఇక విజయశాంతి రీ ఎంట్రీకి దేవీ శ్రీ ప్రసాద్ కూడా స్వాగతం పలికాడు. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుంది.
#AnilRavipudi Garu n #MaheshBabu Garu... I duly honour the welcome. Attitude is an altitude of the person. Climate may change but attitude will never. So r u... So am I...
మహేష్ సినిమాలో విజయశాంతి భారీగానే రెమ్యునరేషన్ అందుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. చాలా రోజుల తర్వాత లేడీ సూపర్ స్టార్ నటిస్తున్న సినిమా కావడంతో ఆమె పాత్రపై కూడా చాలా అంచనాలుంటాయి. పైగా అభిమానులు కూడా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఈ చిత్రంలో విజయశాంతి రోల్ కూడా చాలా భిన్నంగా ఉంటుందని తెలుస్తుంది. మహేష్ బాబుతో ఎలాంటి రిలేషన్ ఉండదని.. కానీ రెండు ప్యారెలల్గా వెళ్తుంటాయని ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో చెప్పింది విజయశాంతి. తాను నెగిటివ్ రోల్ చేస్తున్నాననేది అబద్ధమని తేల్చేసింది విజయశాంతి. ఇందులో మహేష్ స్నేహితుడికి తల్లి పాత్రలో ఆమె నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.
విజయశాంతి మహేష్ అనిల్ రావిపూడి
ఇప్పుడే కాదు.. ఎప్పుడూ విజయశాంతి విలన్ రోల్స్ చేయదని క్లారిటీ ఇచ్చింది ఈ సీనియర్ హీరోయిన్. రీ ఎంట్రీ కోసం చాలా రోజులుగా ప్లాన్ చేసుకుంటున్నా కూడా కథ సరైంది రాక ఊరుకున్నానని.. ఇప్పుడు అనిల్ రావిపూడి చెప్పిన కథ నచ్చడంతోనే ఈ చిత్రం చేస్తున్నానని చెప్పింది విజయశాంతి. అన్నింటికి మించి అనిల్ కూడా ప్రత్యేకంగా తను రాసుకున్న కథకు విజయశాంతి అయితేనే పర్ఫెక్ట్ ఛాయిస్ అని ఫిక్సైపోయాడు. దాంతో ఆమె తప్ప మరో నటి ఈ పాత్రకు ఛాయిస్ లేదు కాబట్టి అడిగినంత పారితోషికం ఇస్తున్నారని తెలుస్తుంది.
ఈ సినిమాతో పాటు ఇప్పట్నుంచి కథ నచ్చితే వరస సినిమాలు చేస్తూనే ఉంటానని చెబుతుంది ఈ సీనియర్ హీరోయిన్. అందుకే దర్శకులు కూడా ఈమె కోసం కథలు రాస్తున్నారు. ఒకవేళ ఇదే కానీ నిజమైందంటే 13 ఏళ్లైనా కూడా విజయశాంతి ఇమేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గనట్లే. ఇప్పటికీ లేడీ సూపర్ స్టార్ అంటే విజయశాంతి ఒక్కరే. మరి ఆమె పాత్ర సరిలేరు నీకెవ్వరులో ఎలా ఉండబోతుందో..? అన్నట్లు ఈ చిత్రంలో ఆమె ఇంటి కోసం ప్రత్యేకంగా గచ్చిబౌలిలో 4 కోట్లతో సెట్ వేయించారు నిర్మాతలు. ఈ సెట్లోనే త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.