అమ్మవారి కోసం అన్నీ మానేసిన నయనతార..

Nayanthara : ప్రస్తుతం ఓ తమిళ సినిమాను ఒప్పుకున్న నయనతార.. ఓ సంచలన నిర్ణయం తీసుకుందట. ముకుత్తి అమ్మన్ అనే ఆధ్యాత్మిక చిత్రంలో ఆమె నటిస్తోంది.

news18-telugu
Updated: November 20, 2019, 4:19 PM IST
అమ్మవారి కోసం అన్నీ మానేసిన నయనతార..
నయనతార
  • Share this:
సినిమాలో ఒక పాత్ర ఉందంటే.. ఆ పాత్రకు వందకు వెయ్యి శాతం న్యాయం చేయగల నటి నయనతార. అందుకే ఈమె అభినవ లేడీ సూపర్ స్టార్‌గా ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోంది. సినిమాలో ఒక పాత్ర ఇస్తే ఆ పాత్రకు ప్రాణం పోసే స్థాయి నటన ఆమెది. చరిత్ర అయినా, పురాణాలు అయినా.. ఒక పాత్ర ఆమెకు ఇస్తే అలవోకగా చేసేయగల నటి. ప్రతి సినిమాలో నయనతార నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోతూనే ఉన్నారు. బాపు చిత్రం, బాలయ్య సరసన శ్రీరామరాజ్యంలో సీత పాత్ర చేసి.. అచ్చం సీత అంటే ఇలాగే ఉంటుందా? అనేలా యాక్ట్ చేసిందీ బ్యూటీ. బాలయ్య సింహ సినిమాలోనైతే నటన పీక్స్ స్టేజ్‌లో ఉంటుంది. ఈ మధ్యే సైరా సినిమాలో నరసింహారెడ్డి భార్యగా మెప్పించింది. అయితే.. ప్రస్తుతం ఓ తమిళ సినిమాను ఒప్పుకున్న నయనతార.. ఓ సంచలన నిర్ణయం తీసుకుందట. ముకుత్తి అమ్మన్ అనే ఆధ్యాత్మిక చిత్రంలో ఆమె నటిస్తోంది. ఆ సినిమా కోసం నయనతార శాఖాహారిగా మారిందట. అమ్మవారి సినిమా కాబట్టి మాంసాహారం ముట్టుకోవద్దని నిర్ణయించుకుందట. అంతేకాదు.. ఒక పూట ఉపవాసం కూడా ఉండాలని తీర్మానించుకుందట.

కాగా.. శ్రీరామరాజ్యం సినిమాలో సీతగా నటించిన నయన్.. ఆ సినిమా అప్పుడు కూడా మాంసం ముద్ద ముట్టలేదట. ఏదేమైనా సినిమా కోసం కూడా ఆహారపు అలవాట్లు మార్చుకొన్న నయనతార అభిమానుల మనసు మరోసారి గెలుచుకుంది. ఇదిలా ఉండగా.. అన్నమయ్య, నమో వేంకటేశాయ సినిమాలు చేసేప్పుడు నాగార్జున సహా చిత్ర యూనిట్ మొత్తం చెప్పులు వేసుకోలేదట.
Published by: Shravan Kumar Bommakanti
First published: November 20, 2019, 4:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading