చిరంజీవి అయితే నాకేంటి .. ఆ విషయంలో నో చెప్పిన నయనతార..

హీరోయిన్ నయనతార‌ సినిమాల్లో నటించేటపుడే ప్రమోషన్స్‌కు రాననీ ముందే అగ్రిమెంట్ చేసుకొని కానీ సినిమాల్లో నటించదు. అది ఎవరి సినిమా ఐనా.. నయనతార ఇదే ఫాలో అవుతుంది. తాజాగా ‘సైరా’ విషయంలో అదే ఫాలో అవుతోంది.

news18-telugu
Updated: August 28, 2019, 2:48 PM IST
చిరంజీవి అయితే నాకేంటి .. ఆ విషయంలో నో చెప్పిన నయనతార..
చిరంజీవి,నయనతార (ఫైల్ ఫోటో)
  • Share this:
హీరోయిన్ నయనతార‌ సినిమాల్లో నటించేటపుడే ప్రమోషన్స్‌కు రాననీ ముందే అగ్రిమెంట్ చేసుకొని కానీ సినిమాల్లో నటించదు. అది ఎవరి సినిమా ఐనా.. నయనతార ఇదే ఫాలో అవుతుంది. కానీ చిరంజీవితో నటించిన ‘సైరా..నరసింహారెడ్డి’ సినిమా విషయంలో మాత్రం ప్రమోషన్స్‌కు వస్తానని మాట ఇచ్చినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్పాయి. తాజాగా జరిగిన ‘సైరా..నరసింహారెడ్డి’ ప్రమోషన్స్‌లో నయనతార కనబడకపోవడం మరోసారి హాట్ టాపిక్ అయింది. ఈ విషయమై ఒక ఇంటర్వ్యూ లో నయన్ మాట్లాడుతూ .. కెరీర్ మొదట్లో నేను ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలానే ఉన్నాను. ప్రారంభంలో కథల ఎంపిక విషయంలో కొన్ని పొరపాట్లు చేసి ఉండొచ్చు. కానీ నాకు అవగాహన వచ్చిన తరువాత జాగ్రత్తగా ఉంటున్నాను. అది చూసి అందరూ నాకు పొగరు అంటున్నారు. నా పొగరుకి అర్ధం ఏంటో ?  నాకు మాత్రం తెలుసు అంటూ చెప్పుకొచ్చింది. అలానే ప్రమోషన్స్ కు రావడం లేదనే విషయంపై స్పందిస్తూ.. డేట్స్ విషయంలో అయినా, ప్రమోషన్స్ విషయంలో అయినా.. నేను ముందే దర్శకనిర్మాతలకు క్లారిటీ ఇచ్చేస్తానని తెలిపింది.

Lady Super Star Nayanthara insults Megastar Chiranjeevi and She is not coming for Sye Raa Narasimha Reddy promotions pk ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్ల తీరు ఎప్పటికీ మారదు. వాళ్లు ఎన్ని సినిమాలు చేసినా కూడా వర్కింగ్ స్టైల్ మాత్రం మార్చుకోరు. ఇప్పుడు నయనతారను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. sye raa,sye raa movie,sye raa movie teaser,sye raa movie promotions,chiranjeevi sye raa,chiranjeevi nayanthara,chiranjeevi nayanthara sye raa movie,sye raa movie promotions,nayanthara sye raa promotions,telugu cinema,చిరంజీవి,నయనతార,సైరా ప్రమోషన్స్,తెలుగు సినిమా,సైరా నరసింహా రెడ్డి టీజర్
చిరంజీవి,నయనతార (ఫైల్ ఫోటో)


తాజాగా నయనతార చిరంజీవి జోడిగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ ప్రమోషన్ కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఇటీవల ముంబైలో జరిగిన సైరా టీజర్‌ లాంచ్‌ కార్యక్రమంలో ఒక్క నయనతార,బిగ్‌బీ మినహా మిగిలిన అగ్ర నటీనటులంతా పాల్గొన్నారు. దీంతో నయనతార.. 'సైరా' ప్రచార కార్యక్రమాల్లో కనిపించటం కూడా అనుమానమే అన్న టాక్‌ వినిపిస్తోంది.నిజానికి నయనతార సినిమాలో నటించిన తర్వాత ఆ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉంటారు. ఈ పంథానే సైరా నరసింహా రెడ్డికి కూడా ఆమె అనుసరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇతర హీరోల చిత్రాలమాదిరిగానే చిరంజీవి చిత్రాన్ని కూడా ఆమె చూస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
Published by: Kiran Kumar Thanjavur
First published: August 28, 2019, 2:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading