Home /News /movies /

LADY SUPER STAR ANUSHKA SHETTY SHARED A FAMILY PIC IN INSTAGRAM ON HER FATHER BIRTHDAY PK

అనుష్క శెట్టి అమ్మా నాన్న ఎలా ఉంటారో తెలుసా..?

తల్లిదండ్రులతో అనుష్క శెట్టి సెల్ఫీ (anushka parents)

తల్లిదండ్రులతో అనుష్క శెట్టి సెల్ఫీ (anushka parents)

Anushka Shetty: ఎప్రిల్ 20న తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా తల్లిదండ్రులతో తీసుకున్న సెల్ఫీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో పేరెంట్స్‌తో పాటు సంఫ్రదాయ చీరకట్టులో కనిపించింది అనుష్క.

దేశ వ్యాప్తంగానే కాదు ప్రస్తుతం ప్రపంచంలో చాలా దేశాల్లో లాక్ డౌన్ నడుస్తుంది. ఇంటి నుంచి కాలు బయటికి తీసి పెట్టలేని పరిస్థితి వచ్చేసింది. ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటుందో కూడా చెప్పలేం. అందుకే అంతా ఇంటికే పరిమితమైపోయారు. ఇప్పుడు అనుష్క కూడా ఇదే చేస్తుంది. ఈ నేపథ్యంలోనే తన పేరెంట్స్‌ను పరిచయం చేసింది ఈ ముద్దుగుమ్మ. ఎప్రిల్ 20న తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా తల్లిదండ్రులతో తీసుకున్న సెల్ఫీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో పేరెంట్స్‌తో పాటు సంఫ్రదాయ చీరకట్టులో కనిపించింది అనుష్క.

తల్లిదండ్రులతో అనుష్క శెట్టి సెల్ఫీ (anushka parents)
తల్లిదండ్రులతో అనుష్క శెట్టి సెల్ఫీ (anushka parents)


ఇప్పటి వరకు అనుష్క గురించి తెలుసు కానీ వాళ్ల కుటుంబ సభ్యుల గురించి మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు. వాళ్లెప్పుడు బయటికి కూడా రారు. అప్పుడప్పుడూ వాళ్ల అన్నయ్యలతో దిగిన ఫోటోలను పోస్ట్ చేస్తుంటుంది స్వీటీ. కానీ అమ్మానాన్నలను మాత్రం చూపించలేదు. ఇన్నేళ్ళకు తమ పేరెంట్స్ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది అనుష్క.



ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం నిశ్శబ్ధం సినిమాలో నటిస్తుంది అనుష్క. ఈ చిత్ర షూటింగ్ పూర్తైపోయింది.. లాక్ డౌన్ ఎత్తేస్తే సినిమా విడుదలవుతుంది. ఇందులో మాధవన్ హీరోగా నటించగా.. హీరోయిన్లు అంజలి, శాలిని పాండే కీలక పాత్రల్లో నటించారు. హాలీవుడ్ నటుడు మ్యాడిన్సన్ విలన్‌గా నటించాడు. హేమంత్ మధుకర్ దర్శకుడు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Anushka Shetty, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు