పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ మాయదారి కరోనా వైరస్.. లాక్‌డౌన్ వచ్చి అంతా ఇంటికే పరిమితం అయిపోయారు కానీ లేకపోతే ఈ పాటికి పవన్ సినిమా ముస్తాబయ్యేది.. రీ ఎంట్రీ కూడా జరిగిపోయేది. ప్రస్తుతం ఈయన వకీల్ సాబ్‌తో పాటు క్రిష్ దర్శకత్వంలో రాబిన్ హుడ్ కాన్సెప్ట్‌తో హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోహినూర్ వజ్రం నేపథ్యంలో తెరకెక్కుతుందని హింట్ కూడా ఇచ్చాడు నాగబాబు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో హీరోయిన్‌గా అనుష్కను తీసుకున్నారని తెలుస్తుంది.
కొన్ని రోజుల కింద ఈ సినిమాలో కథానాయికగా బాలీవుడ్ భామ జాక్వలైన్ ఫెర్నాండేజ్‌ను తీసుకున్నారని ప్రచారం జరిగింది.. ఆ భామ ఈ చిత్రం కోసమే హైదరాబాద్ వచ్చి క్రిష్‌ను కూడా కలిసిందనే వార్తలొచ్చాయి. ఈ సినిమాలో ఎవరు హీరోయిన్‌గా నటించినా కూడా 40 రోజుల్లో ఈ సీన్నివేశాలు పూర్తి చేయాలని చూస్తున్నాడు క్రిష్. మరిప్పుడు జాక్వలైన్ స్థానంలోనే అనుష్కను తీసుకున్నారా లేదంటే జాక్వలైన్‌తో పాటు అనుష్కను తీసుకుంటున్నారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.
ఒక్కటి మాత్రం నిజం.. పవన్‌తో అనుష్క నటించడం పక్కా అంటున్నారు టాలీవుడ్ వర్గాలు. ఇప్పటికే మెగా ఫ్యామిలీలో చిరంజీవితో స్టాలిన్ సినిమాలో స్పెషల్ సాంగ్.. సైరాలో స్పెషల్ రోల్ చేసింది అనుష్క. ఇక బన్నీతో కలిసి వేదం, రుద్రమదేవి సినిమాల్లో నటించింది. అయితే ఇప్పటి వరకు మెయిన్ హీరోయిన్‌గా మాత్రం నటించలేదు అనుష్క.
ఒకవేళ ఇప్పుడు కానీ పవన్ జోడీ సెట్ అయితే తొలిసారి మెగా హీరోతో పూర్తి స్థాయి హీరోయిన్ పాత్ర చేసినట్లు అవుతుంది. ప్రస్తుతం నిశ్శబ్ధం సినిమాతో బిజీగా ఉంది అనుష్క. ఈ చిత్ర షూటింగ్ కూడా పూర్తయింది. లాక్‌డౌన్ అయిపోతే విడుదల చేయడమే తరువాయి. రెండేళ్లుగా పెద్దగా అవకాశాలు లేని అనుష్కకు పవన్ సినిమా వస్తే అద్భుతమే ఇంక.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anushka Shetty, Pawan kalyan, Telugu Cinema, Tollywood