Home /News /movies /

కడుపు రగిలిపోతోంది...ఆ ఘటనపై రాములమ్మ ఆగ్రహం..

కడుపు రగిలిపోతోంది...ఆ ఘటనపై రాములమ్మ ఆగ్రహం..

విజయశాంతి (Vijayashanti)

విజయశాంతి (Vijayashanti)

Vijaya Shanti | లేడీ అమితాబ్ విజయశాంతి సినిమాల్లో నెంబర్ వన్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగాక.. రాజకీయాల్లో ప్రవేశించిన తనదైన శైలిలో రాణిస్తోంది. తాజాగా ఈమె ఓ ఘటనపై తన ఆవేదన వ్యక్తం చేసింది.

లేడీ అమితాబ్ విజయశాంతి సినిమాల్లో నెంబర్ వన్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగాక.. రాజకీయాల్లో ప్రవేశించిన తనదైన శైలిలో రాణిస్తోంది. పాలిటిక్స్‌లో బిజీగా ఉన్న విజయశాంతి.. చాలా ఏళ్ల తర్వాత ముఖానికి రంగేసుకుంది. మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటిగా రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత మళ్లీ సినిమాల్లో నటించనని చెప్పినా లేడీ అమితాబ్..తాజాగా చిరంజీవి హీరోగా నటించబోతున్న ‘లూసీఫర్’ రీమేక్‌లో నటించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. విజయశాంతి ఈ సినిమాపై అఫీషియల్‌గా ప్రకటన మాత్రం చేయలేదు. ఆ సంగతి పక్కన పెడితే.. ప్రస్తుతం ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో పోరాటం చేస్తూనే ఉంది. తాజాగా కొంత మంది ఆకతాయిలు  తమ సరదా కోసం కేరళలో గర్భంతో ఉన్న ఏనుగును మందు గుండు సామాగ్రి ఉన్న పనస పండు పెట్టి ఆ మూగజీవి ప్రాణాలు ఒదిలేలా చేసారు. ఆ మూగజీవి మరణవేదనను వినోదించిన ఈ మనసులకు ఏ శిక్ష వేసినా తక్కువే అంటూ ఆవేదన వ్యక్తం చేసింది విజయశాంతి. ఈ ఘటనపై పలువురు ప్రముఖలు కూడా స్పందించారు. తన వినోదం కోసం మూగ జీవాల ప్రాణాలు తీసేవారిని అసలు విడిచిపెట్టకూడదంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తన ఆవేదన వెళ్లగక్కుతున్నారు.  ఇంతటి అమానవీయ ఘటన చూసిన తర్వాత ఎవరికైనా కడుపు మండిపోతుంది. ఆ మూగజీవి పడిన బాధ తలుచుకుంటే మనసుకున్న ప్రతి మనిషికి కన్నీళ్లు ఆగవు.


ఈ సంఘటనకు ముందు టిక్‌టాక్ వీడియో కోసం కొంత మంది తమ సరదా వీడియోల కోసం ఎన్నెన్నో ఆకృత్యాలు చేస్తున్నారు. రీసెంట్‌గా కుక్కపిల్ల కాళ్ళూ చేతులు కట్టేసి మురికి కాలువలోకి విసిరేసి ప్రాణాలు తీసిన ఘోరాన్ని చూశాం. అంతకుముందు ఒక వ్యక్తి మేడపై నుంచి కుక్కను దారుణంగా విసిరేశాడు. మూగజీవాలపై ఇలా ఎన్నెన్నో అకృత్యాలు... అసలేం జరుగుతోంది? ఇతర జీవులకు భూమ్మీద బతికే హక్కు లేదా? నేడు మన ప్రపంచం అనుభవిస్తున్న ఈ రోగాలు... దిగజారిన పరిస్థితులు... చూస్తుంటే మనిషి చేసే తప్పులకు ఆ ప్రకృతి విధిస్తున్న శిక్షలే ఇవని అనిపిస్తోందందూ విజయశాంతి ఒకింత ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూనన తప్పు చేసినవారే కాదు... చూస్తూ స్పందించనివారు... అడ్డుకునే శక్తి ఉన్నప్పటికీ ఆ పని చెయ్యనివారు కూడా శిక్షార్హులే. అందుకే ఇకనైనా మనందరం మారదాం... నిండైన మానవత్వమున్న మనుషులుగా బతుకుదాం. ఆ పరమేశ్వరుని దృష్టిలో మనం కృతఘ్నులం కావద్దు అంటూ వేడుకుంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Elephant, Telangana, Telugu Cinema, Tollywood, Vijayashanti

తదుపరి వార్తలు