నిన్న మొన్నటి వరకు రాజకీయ కార్యక్రమాలతోనే బిజీ బిజీగా ఉన్న లేడీ అమితాబ్ విజయశాంతి సడెన్‌గా మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో నటిగా రీ ఎంట్రీ ఇస్తుంది.
నిన్న మొన్నటి వరకు రాజకీయ కార్యక్రమాలతోనే బిజీ బిజీగా ఉన్న లేడీ అమితాబ్ విజయశాంతి సడెన్‌గా మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో నటిగా రీ ఎంట్రీ ఇస్తుంది. ఇన్నేళ్ల తర్వాత రాములమ్మ తిరిగి కెమెరా ముందుకొస్తోందంటే.. ఖచ్చితంగా తనదైన శైలిలో పాత్ర పరిధి ఉంటుందని ఫిక్సయ్యారు ప్రేక్షకులు. తెలుగు ప్రేక్షకులతో లేడీ సూపర్ స్టార్‌గా పిలుపించుకున్న విజయశాంతి రాజకీయాల్లోకి వెళ్లిన తరవాత సినిమాలకు దూరమైపోయారు. 2006లో వచ్చిన ‘నాయుడమ్మ’ సినిమాలో ఆమె చివరి సారిగా కనిపించారు. ఆ తరవాత మరే సినిమాను ఆమె అంగీకరించలేదు. ఇపుడు మహేష్ బాబు హీరో నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో మహేష్ బాబుతో సరితూగే పాత్రను చేసింది ఒకప్పటి లేడీ సూపర్ స్టార్. ఈ సినిమాలో ఆమె భారతి అనే లెక్చరర్ పాత్రలో నటించారు.
‘సరిలేరు నీకెవ్వరు’లో విజయశాంతి (Twitter/Photo)
సినిమా మొత్తం ఆమె పాత్ర సీరియస్‌గా సాగుతోంది అని చెబుతున్నారు. అంతేకాదు ఈ సినిమాలో విజయశాంతి పాత్రను చూసిన ప్రేక్షకులు ఆ క్యారెక్టర్లో ఆమె తప్ప మరెవరు చేయలేరన్న ఫీలింగ్ కలుగుతుందని చెప్పారు. ఇక ‘నేటి భారతం’, ‘ప్రతిఘటన’, ‘కర్తవ్యం’ ఒసేయ్ రాములమ్మ’ వంటి చిత్రాలతో తన కంటూ ఒక ఐడెంటిటీ ఏర్పరుచుకున్న విజయశాంతి.. గతంలో 30 ఏళ్ల క్రితం మహేష్ బాబు బాలనటుడి ఉన్నపుడు ‘కొడుకు దిద్దిన కాపురం’లో సూపర్ స్టార్‌కు తల్లి పాత్రలో నటించింది. ఇపుడు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో మరోసారి వీళ్లిద్దరు స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
‘సరిలేరు నీకెవ్వరు’లో విజయశాంతి (Twitter/Photo)
‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం సెట్స్ పైకి ఉండగానే పలు బిగ్ బడ్జెట్ చిత్రాల్లో విజయశాంతికి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. ఈ సినిమాను దిల్ రాజు, అనిల్ సుంకరతో కలిసి మహేష్ బాబు హీరోగా నిర్మించాడు. రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఈ నెల 11న వాల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.