విజయశాంతి.. ఓ ఫైర్ బ్రాండ్ ఆమె. సినిమా అయినా, రాజకీయాలైనా తనదైన ముద్ర వేస్తారు. హీరోయిన్ అంటే అందాల ప్రదర్శనే కాదు.. హీరోకు దీటుగా ఇజం చూపించగలదని నిరూపించారు. 2006 వరకు సినిమాలు చేసి, ఆ తర్వాత రాజకీయాల్లో బిజీగా గడిపిన విజయశాంతి.. మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ సందర్భంగా ఈ రోజు ఆ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. అందులో విజయశాంతి ఈజ్ బ్యాక్ అన్నట్లు నటించారు. 13 ఏళ్ల తర్వాత ముఖానికి రంగు వేసుకున్నా.. తనలోని రాజసాన్ని, పౌరుషాన్ని అద్భుతంగా పలికించారామె. కనుల చూపు, ఆమె చెప్పిన డైలాగ్ బాగున్నాయి. గాయం విలువ తెలిసిన వాడే సాయం చేస్తాడని అన్న డైలాగ్ రాములమ్మ అభిమానులకు కిక్ ఇచ్చినట్లైంది.
ఇక, ఈ సినిమాలో క్యారెక్టర్ కోసం దాదాపు 10 కేజీల బరువు తగ్గానని, దాని కోసం జిమ్‌లో రోజుకు రెండు గంటల పాటు కష్టపడ్డానని విజయశాంతి చెప్పిన విషయం తెలిసిందే. కాగా.. షూటింగ్ సందర్భంగా మహేష్‌తో చాలా సరదా అనిపించిందని, ఆయన తనను అమ్మా అని, మేడం అని పిలిచారని చెప్పారు. సూపర్ స్టార్ కృష్ణలాగే మహేష్ తనపని తాను చేసుకుంటారని విజయశాంతి అన్నారు.
Published by:Shravan Kumar Bommakanti
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.