Home /News /movies /

LADY AMITABH VIJAYASHANTHI WELCOMES SUPREME COURT VERDICT ON PERMANENT COMMISSION TO WOMEN OFFICERS IN ARMY TA

Vijayashanti: సుప్రీంకోర్డు తీర్పుతో నెరవేరిన విజయశాంతి 20 ఏళ్ల కల..

‘సరిలేరు నీకెవ్వరు’లో విజయశాంతి (Twitter/Photo)

‘సరిలేరు నీకెవ్వరు’లో విజయశాంతి (Twitter/Photo)

Vijayashanti | సైనిక దళాల్లో మహిళలకు అన్ని రంగాల్లో సమాన హోదా కల్పించే దిశగా సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈ తీర్పును ప్రముఖ నటి రాజకీయ నాయకురాలు విజయశాంతి సామాజిక మాధ్యమంలో స్వాగతించారు.

సైనిక దళాల్లో మహిళలకు అన్ని రంగాల్లో సమాన హోదా కల్పించే దిశగా సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈ తీర్పును ప్రముఖ నటి రాజకీయ నాయకురాలు విజయశాంతి సామాజిక మాధ్యమంలో స్వాగతించారు. సైనిక దళాల్లో మహిళా అధికారులకు కమాండ్ హోదా ఇచ్చేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ తీర్పుపై విజయశాంతి మాట్లాడుతూ.. సినిమాల్లో నేను ఐపీఎస్ అధికారి, లెక్చరర్, ఫ్రొఫెసర్, లాయ్, సీబిఐ అధికారి, ఆటో డ్రైవర్‌గా, ముఖ్యమంత్రిగా, జర్నలిస్టుగా, ఇండస్ట్రీలిస్టుగా, నక్సలైట్‌గా, ఇలా ఎన్నో సినిమాల్లో ప్రేక్షకుల్లో స్పూర్తి నింపే పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించగలిగాను. 1979లో కృష్ణ హీరోగా విజయనిర్మల దర్శకత్వంలో తెరకెక్కిన ‘కిలాడీ కృష్ణుడు’ సినిమాతో ప్రారంభమైన తన సినీ జీవితం.. తాజాగా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా వరకు కొనసాగుతూనే ఉంది.

lady amitabh vijayashanthi welcomes supreme court verdict on permanent commission to women officers in army,Vijayashanti,Vijayashanti supreme court,Vijayashanti welcomes supreme court verdict,vijayashanti on women army officers,Vijayashanti twitter,Vijayashanti movies,Vijayashanti mahesh babu,Vijayashanti sarileru neekevvaru,Vijayashanti mahesh babu sarileru neekevvaru,Vijayashanti anil ravipudi,telugu cinema,విజయశాంతి,విజయశాంతి అనిల్ రావిపూడి,విజయశాంతి మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు,'సుప్రీంకోర్డు స్వాగతించిన విజయశాంతి,సుప్రీంకోర్టు తీర్పును ఆహ్వానించిన విజయశాంతి
విజయశాంతి ఆర్మీ మేజర్ పాత్రలో నటించిన ‘భారతరత్న’ (Youtube/Credit)


ఈ మధ్యలో 20 ఏళ్ల క్రితం కోడిరామకృష్ణ దర్శకత్వంలో చేసిన బహుభాషా చిత్రం ‘భారతరత్న’ సినిమా ప్రత్యేకమైనది. ఈ చిత్రంలో నేను ఆర్మీ అధికారిణి పాత్రలో నటించాను. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం నేను పోషించిన ఆర్మీ ఆఫీసర్ పాత్రను నిజం చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మహిళా సాధికారతకు స్పూర్తి నిచ్చే విధంగా ఉంది. ఈ తీర్పుతో భారతరత్న సినిమాలో నేను చేసిన మహిళా కమాండర్ అధికారిణి పాత్ర ఇపుడు నిజం కాబోతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే ఎన్నో రంగాల్లో రాణిస్తున్న మహిళలు సైన్యాన్ని కూడా ముందుండి నడిపించడంలో తమ వంతు పాత్ర పోషిస్తారనుకుంటున్నాను అంటూ విజయశాంతి చెప్పుకొచ్చింది. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత పూర్తిగా తన సమయాన్ని రాజకీయాలకే కేటాయించబోతున్నట్టు విజయశాంతి చెప్పిన విషయం తెలిసిందే కదా.
Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Sarileru Neekevvaru, Telugu Cinema, Tollywood, Vijayashanti

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు