KUSHI SAMANTHA GAVE GREEN SIGNAL FOR LIP LOCK WITH VIJAY DEVERAKONDA SLB
ఆ యంగ్ హీరోతో సమంత లిప్ లాక్..! విడాకుల తర్వాత డేరింగ్ స్టెప్స్..
Samantha Ruth Prabhu Instagram
Samantha Lip Lock: కెరీర్ పరంగా దూసుకుపోతున్న సమంత అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందడుగేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. కథ డిమాండ్ చేయాలే గానీ రొమాంటిక్ డోస్ దట్టించడానికి కూడా రెడీ అంటోంది.
నాగ చైతన్య (Naga Chaitanya)తో విడాకుల తర్వాత సమంత (Samantha) వెళుతున్న తీరు నిత్యం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతోంది. కెరీర్ పరంగా దూసుకుపోతున్న ఈ బ్యూటీ అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందడుగేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. కథ డిమాండ్ చేయాలే గానీ రొమాంటిక్ డోస్ దట్టించడానికి కూడా రెడీ అంటోంది. ఈ క్రమంలోనే ఆమె చేస్తున్న లేటెస్ట్ మూవీ 'ఖుషి' (Kushi)లో లిప్ లాక్ సీన్ చేయబోతోందట సమంత. విడాకుల అనంతరం కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టిన సమంత.. పలు వైవిద్యభరితమైన రోల్స్ చేసేందుకు మక్కువ చూపుతోంది. అది ఫుల్ లెంగ్త్ రోల్ అయినా, గ్లామర్ రోల్ అయినా లేక ఐటెం సాంగ్ అయినా సినిమాలో తన మార్క్ కనిపించాలని బలంగా ఫిక్స్ అయింది. ఇందులో భాగంగానే రీసెంట్గా 'పుష్ప' (Pushpa) సినిమాలో ఐటెం సాంగ్ చేసి ఓ ఊపు ఊపేసింది. మరోవైపు సోషల్ మీడియాలోనూ అందాల తలపులు తెరుస్తూ ఆన్ లైన్ మాధ్యమాలను షేక్ చేస్తోంది.
ఇదిలాఉండగా తాజాగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో సమంత ముద్దు సీన్ అనే విషయం బయటకురావడంతో సినీ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీంతో ఇందుకు సంబందించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. గతంలో చైతూని పెళ్లాడిన కొత్తలోనే 'రంగస్థలం' మూవీలో రామ్ చరణ్‌తో లిప్ లాక్ సీన్ చేసి వార్తల్లో నిలిచిన సమంత మరోసారి అలాంటి ప్రయోగమే చేయబోతోందట. నటనకే పూర్తి ప్రాధాన్యత ఇస్తూ విజయ్ దేవరకొండతో ముద్దు సీన్లో మునిగిపోనుందట. విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న ఖుషి సినిమాలో ఈ సీన్ చూడబోతున్నామని, ఇది సినిమాలో హైలైట్ కానుందనే టాక్ నడుస్తోంది.
అప్పట్లో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఖుషి మూవీలో భూమిక నడుము సీన్ ఎలా అయితే హైలైట్ అయిందో.. ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న ఖుషి సినిమాలో ఈ ముద్దు సీన్ ఆడియన్స్‌ని స్పెషల్‌గా అట్రాక్ట్ చేయనుందని అంటున్నారు. నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ 'ఖుషి' సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రీసెంట్గా విడుదలై ప్రేక్షకుల నుంచి భారీ స్పందన తెచ్చుకుంది. సిగరెట్ కాల్చుతూ విజయ్ దేవరకొండ మాస్ లుక్‌లో కనిపించగా ఆ పక్కనే సమంత అప్పీయరెన్స్ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయింది.
ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. ఆమె సూపర్ ఫామ్‌లో ఉంది. పలు భాషా చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతోంది. గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం చిత్రాన్ని కంప్లీట్ చేసి ప్రస్తుతం 'యశోద' అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తోంది. దీంతో పాటు మరో ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్ కూడా చేస్తోంది సామ్. ఏదేమైనా విడాకుల తర్వాత సమంత తీసుకుంటున్న డేరింగ్ స్టెప్స్ జనాల్లో మాత్రం హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాయి.
Published by:Sunil Boddula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.