ప్రముఖ కోలీవుడ్ (Kollywood) నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బు సుందర్ ఇటీవల చాలా మారిపోయింది. ఆమె తన బరువు తగ్గించుకొని కొత్తగా మారింది. తన ఫిట్‌నెస్‌ను మెరుగుపర్చుకొంటూ యంగ్ లుక్‌లోకి మారిపోయింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఆమె లేటెస్ట్ పనిక్‌ను ఫ్యాన్స్ కోసం పోస్ట్ చేసింది. కుష్బూ (Kushboo) పిక్‌తోపాటు పలు విషయాలు పంచుకొంది. ఆమె 20 కేజీలు తగ్గినట్టు వెల్లడించింది. ప్రపంచంలో అన్నింటికన్నా.. ఆరోగ్యమే పెద్ద సంపద అని పేర్కొంది. చాలా మంది ఫ్యాన్స్ నా ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. వారికి ధన్యవాదాలు ప్రస్తుతం ఎంతో ఆరోగ్యంగా ఉన్నానని ఆమె పేర్కొంది. కుష్బు కొత్త లుక్‌పై చాలా మంది ఖుష్బుని ప్రశంసించారు. ఆమె ప్రయత్నాలకు వ్యాఖ్యలలో ప్రేమను కురిపించారు. ఆమె నవంబర్ 2020 నుంచి శరీరంపై దృష్టి పెట్టింది.
From there to here. 20kgs lighter, I m at my healthiest best. Look after urself,remember, health is wealth. N those who ask if I am sick, thanks for ur concern. I never been so fit ever before. If I inspire even 10 of u out here to lose weight n get fit,I know I have succeeded ❤️ pic.twitter.com/tbho2TRBxE
— KhushbuSundar (@khushsundar) December 5, 2021
సరైన ప్రణాళిక, కఠినమైన సాధనతో ఆరోగ్యాన్ని పెంచుకొంది. అంతే కాకంఉడా 20 కిలోలు బరువు తగ్గింది. 51 సంవత్సరాల వయస్సులో ఆమె ఈ ఘనత సాధించడంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈమె 90లలో ప్రముఖ తెలుగు, తమిళంలో ప్రముఖ నటిగా గుర్తింపు తెచ్చుకొన్నారు. ఇప్పడు సహాయ పాత్రతలతో అందరినీ ఆకట్టుకొంటుంది.
కుష్బూ మూవీ కెరీర్..
తమిళంలో స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పి.. అక్కడ అభిమానులతో గుడి కూడా కట్టించుకున్న హీరోయిన్ ఖుష్బూ. ఈమె తొలి అడుగు మాత్రం తెలుగు సినిమాతోనే పడింది. 1986లో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన తొలి సినిమా కలియుగ పాండవులుతో ఖుష్బూ హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించింది. తెలుగులోనూ అప్పటి లీడింగ్ హీరో అయిన రాజేంద్ర ప్రసాద్‌తో రెండు సినిమాలు చేసింది. దాంతో పాటు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున లాంటి స్టార్ హీరోలతోనూ నటించింది ఖుష్బూ. బాలీవుడ్‌లోనూ సత్తా చూపించింది. ఇక తమిళ ఇండస్ట్రీలో అయితే చెప్పనక్కర్లేదు
OTT Movies: ఈ వారం ఓటీటీలో రాబోతున్న చిత్రాలివే!
ఈమె క్రేజ్ గురించి. అక్కడ ఒకప్పుడు ఖుష్బూ అంటే పడి చచ్చిపోయేవాళ్లు అభిమానులు. తెలుగులో నటించింది తక్కువ సినిమాలే అయినా కూడా ఇక్కడ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ సీనియర్ హీరోయిన్.
చాలా ఏళ్ళ తర్వాత 2006లో చిరంజీవి స్టాలిన్ సినిమాలో అక్కగా నటించింది. మొన్న అజ్ఞాతవాసి సినిమాలో పవన్ అమ్మగా కనిపించింది ఈమె. సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే తమిళ దర్శకుడు సుందర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇటీవల తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన అన్నాతై తెలుగులో పెద్దన్న సినిమాలో కుష్బూ ప్రముఖ పాత్ర పోషించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kollywood, Kushboo, Tamil actress, Telugu Movie, Tollywood