నాగార్జునను అనకూడని మాట అనేసిన ఖుష్బూ... షాక్‌లో సెట్ సిబ్బంది..

ఖుష్బూ రాజకీయాల్లో ఉన్నా.. సినిమాలకు మాత్రం దూరం కాకుండా... అడపాదడపా కీలక పాత్రల్లో నటిస్తూనే ఉన్నారు.

news18-telugu
Updated: January 1, 2020, 10:18 PM IST
నాగార్జునను అనకూడని మాట అనేసిన ఖుష్బూ... షాక్‌లో సెట్ సిబ్బంది..
Twitter
  • Share this:
ఖుష్బూ రాజకీయాల్లో ఉన్నా.. సినిమాలకు మాత్రం దూరం కాకుండా... అడపాదడపా కీలక పాత్రల్లో నటిస్తూనే ఉన్నారు. ఇటీవల పవన్‌ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసిలో ఆమె కీలక పాత్రలో మెప్పించారు.. ప్రస్తుతం తమిళ్‌లో పలు రియాలిటీ షోస్‌కు వ్యాఖ్యతగా వ్వవహరించటంతో పాటు సీరియల్స్‌లోనూ నటిస్తున్నారు. సీరియల్స్‌ను నిర్మిస్తున్నారు. ఆమె తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గోన్నారు. ఈ సందర్బంగా ఖుష్బూ మాట్లాడుతూ..  'కెప్టెన్ నాగార్జున' షూటింగు సమయంలో జరిగిన ఒక సరదా సంఘటనను గురించి అభిమానులతో పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. "నాగార్జున హీరోగా 'కెప్టెన్ నాగార్జున' షూటింగ్ చెన్నై, ఏవీఎమ్ స్టూడియోలో జరిగింది. అప్పటికి నాకు తమిళ్ తెలియదు .. తెలుగు తెలియదు. డాన్స్ మాస్టర్ చిన్ని ప్రకాశ్ గారి అసిస్టెంట్ సతీశ్ గారు ఉండేవారు. ఆయన చెన్నైలో షూటింగ్ జరుగుతుంది కనుక, తమిళంలోనే గుడ్ మార్నింగ్ చెప్పాలని కండిషన్ పెట్టారు. అంతేకాకుండా.. తమిళభాషలో గుడ్ మార్నింగ్ ఎలా చెప్పో కూడా నాకు నేర్పించారు. ఆయన నాకు నేర్పించింది ఒక బ్యాడ్ వర్డ్ అని నాకు అప్పటికి తెలియదు. అయితే ఏవీఎమ్ స్టూడియోలో వేసిన బంగ్లా సెట్ పై నేను వున్నాను .. కింద నాగార్జునగారు వున్నారు.

దీంతో ఆయన కనిపించగానే చేయి ఊపుతూ సతీశ్ గారు తమిళంలో నేర్పించిన మాట అనేశాను. అంతే ఇక.. సెట్లో వున్న వాళ్లందరితో పాటు నాగార్జున కూడా షాక్ అయ్యారు. దీంతో  నేను చెప్పింది గుడ్ మార్నింగ్ కాదనే విషయం నాకు అర్థమైంది. అంతేకాకుండా.. ఈలోగా నాగార్జునగారు పరిగెత్తుకుని పైకి రావడం చూసి, నేను కూడా మరో వైపు నుంచి క్రిందికి దిగేసి పరిగెత్తాను" అంటూ అప్పట్లో జరిగిన ఆ సరదా సంఘటనను పంచుకున్నారు నటి ఖుష్బూ..

మంజూష అదిరే పిక్స్..
Published by: Suresh Rachamalla
First published: January 1, 2020, 10:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading