కొండారెడ్డి బురుజు సాక్షిగా..మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’..

మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం కర్నూలులోని కొండారెడ్డి బురుజును రీ క్రియేట్ చేసారు.

news18-telugu
Updated: September 23, 2019, 8:29 PM IST
కొండారెడ్డి బురుజు సాక్షిగా..మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’..
సరిలేరు నీకెవ్వరు‌లో మహేష్ బాబు (Twitter/Photo)
news18-telugu
Updated: September 23, 2019, 8:29 PM IST
మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో మహేష్ బాబు.. ఫస్ట్ టైమ్ ఒక ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలో మహేష్ బాబు ఉగ్రవాదులను ఏరివేసే  మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్నాడు. మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న  ఈ సినిమాలో ఒకప్పటి లేడీ సూపర్ స్టార్ విజయ్ శాంతి నటిగా రీ ఎంట్రీ ఇస్తుంది. తాజాగా ఈ సినిమా కోసం కర్నూలు జిల్లాలోని కొండా బురుజు సెట్‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో రీ క్రియేట్ చేసారు ఆర్ట్ డైరెక్టర్ ఎ.ఎస్. ప్రకాష్. ఇక్కడ కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలను సోమవారం నుంచి తెరకెక్కిస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు ట్వీట్ చేసారు.
మహేష్ బాబు 16 ఏళ్ల క్రితం ‘ఒక్కడు’ సినిమాలో కొండారెడ్డి బురుజు దగ్గర చేసిన సీన్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎవర్ గ్రీన్‌గా నిలిచిపోయింది. ఇపుడు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా కోసం మరోసారి కొండారెడ్డి బురుజు సెట్‌ను రీ క్రియేట్ చేయడం ఆనందంగా ఉందన్నారు.
First published: September 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...