Home /News /movies /

KUMKUM BHAGYA ACTOR TRIPTI SHANKHDHAR CLAIMS THREAT TO LIFE FROM FATHER BA

కన్నతండ్రిపై నటి సంచలన వీడియో.. తనను చంపేస్తాడంటూ

తృప్తి శంకధార్ (File;Instagram)

తృప్తి శంకధార్ (File;Instagram)

Trupti Shankhdhar | 19 సంవత్సరాల తృప్తి శంకధార్ హిందీలో కుంకుమ భాగ్య సీరియల్‌తో పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమలో కూడా పనిచేసింది.

    టీవీ, సినీ నటి తృప్తి శంకధార్ సంచలన ఆరోపణలు చేసింది. తన తండ్రి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపించింది. హిందీలో ఫేమస్ సీరియల్ ‘కుంకుమ భాగ్య’లో తృప్తి శంకధార్ నటిస్తోంది. ఆమె తన ఇన్‌స్టా గ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. తన తండ్రి రామ్ రతన్ శంకధార్ నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపించింది. తన తండ్రికి నచ్చిన యువకుడిని పెళ్లిచేసుకోనని చెప్పినందుకు, తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని వీడియోలో చెప్పింది. ఉత్తర్ ప్రదేశ్‌లోని బరేలీకి చెందిన ఈ నటి రాయ్‌బరేలీ పోలీసులు తనకు రక్షణ కల్పించాలని వీడియోలో కోరింది. తన తండ్రి తనను చంపుతానని బెదిరించాడన్న తృప్తి ఈ క్రమంలో తన జుట్టు పట్టుకుని లాగి కొట్టాడని కూడా ఆరోపించింది. తన తండ్రికి నచ్చిన వాడితో పెళ్లి చేసుకోవడానికి నిరాకరించినందుకు తనను హింసిస్తున్నాడని, తాను ముంబై వెళ్లి వినోద పరిశ్రమలో ఎదగడానికి సాయం చేసిన డబ్బులు కూడా తిరిగి ఇవ్వాలని అడుగుతున్నాడని ఆమె ఆరోపించింది. మంగళవారం రాత్రి తృప్తి ఈ వీడియోను ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం తృప్తి తన తండ్రి ఇంటి నుంచి వచ్చేసి తల్లితో కలసి ఉంటోంది. ఆమె తండ్రి రామ్ రతన్ శంకధార్ ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి. 19 సంవత్సరాల తృప్తి హిందీలో కుంకుమ భాగ్య సీరియల్‌తో పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమలో కూడా పనిచేసింది.








    View this post on Instagram





    #uppolice #yogi #spcity #bareilly #delhi


    A post shared by Tripti Shankhdhar (@triptishankhdhar) on






    ఈ ఘటనపై తమకు ఎలాంటి రాతపూర్వక ఫిర్యాదు రాలేదని బరేలి పోలీసులు చెప్పారు. తమకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే తృప్తి శంకధార్ ఫిర్యాదును పరిశీలిస్తామన్నారు. ప్రస్తుతం ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ఆధారంగా విచారణ జరుపుతున్నామన్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Bollywood, Telugu tv serials

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు