• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • KTR PRAISES NARAINGI SINGER SHRAVANI TALENT AND RECOMMENDED TO DSP AND SS TAMAN NR

KTR - DSP: ఆమె పాటకు ఫిదా అయినా కేటీఆర్.. దేవిశ్రీ అవకాశం.. ఆమె ఎవరంటే?

KTR DSP

KTR - DSP: ఇప్పటికే తెలంగాణ నుండి ఎంతోమంది జానపద గాయకులు పరిచయమయ్యారు. తమ గానాలతో మరిన్ని అవకాశాలు కూడా అందుకుంటున్నారు. అంతే కాకుండా వాళ్లను మరింత ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నారు.

  • Share this:
    KTR - DSP: ఇప్పటికే తెలంగాణ నుండి ఎంతోమంది జానపద గాయకులు పరిచయమయ్యారు. తమ గానాలతో మరిన్ని అవకాశాలు కూడా అందుకుంటున్నారు. అంతే కాకుండా వాళ్లను మరింత ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది పరిచయమైన గాయకులలో మధుప్రియ. తన చిన్నప్పుడు పాడిన ఆడపిల్ల పాటతో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలలో కూడా పాటలు పాడి మంచి క్రేజ్ అందుకొని సింగర్ గా నిలిచింది. ఇక తాజాగా మరో యువ గాయని తన అద్భుతమైన పాటతో ముందుకు వచ్చింది.

    మెదక్ జిల్లా నారైంగి గ్రామానికి చెందిన శ్రావణి అనే ఓ అమ్మాయి. తాజాగా రేలా రే రేలా రే అనే తెలంగాణ పాటను పాడగా.. శ్రావణి పాడిన వీడియోను సురేంద్ర తిప్పరాజు అనే వ్యక్తి తన ట్విట్టర్ వేదికగా తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు పంచుకున్నాడు. అంతేకాకుండా మెదక్ జిల్లాలోని నారైంగి గ్రామంలో ఓ ఆణిముత్యం దొరికిందని, శ్రావణి అనే అమ్మాయి బ్రిలియంట్ సింగర్ అంటూ.. ఆ గాయని స్వరం మైమరిపించేలా ఉందంటూ.. ఆమె టాలెంట్ కు మీ సహకారంతో పాటు మీ ఆశీస్సులు అవసరమని ట్వీట్ చేశాడు.

    ఇక శ్రావణి పాడిన పాటను కేటీఆర్ విని ఆ అమ్మాయికి అద్భుతమైన టాలెంట్ ఉందంటూ ప్రశంసించాడు. అంతేకాకుండా కేటీఆర్ ఈ వీడియోను మ్యూజిక్ డైరెక్టర్లు తమన్, దేవి శ్రీ ప్రసాద్ లకు ట్యాగ్ చేయగా.. శ్రావణి అద్భుతమైన సింగర్ అని తమన్ స్పందించాడు. ఇక దేవిశ్రీ ప్రసాద్ శ్రావణి స్వరానికి ఫిదా అయ్యానని తెలిపాడు. ఇంతటి గొప్ప సింగర్ ని తమ దృష్టికి తీసుకు వచ్చినందుకు కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.



    అంతేకాకుండా తాము భవిష్యత్తులో నిర్వహించే షోలలో కూడా శ్రావణికి తప్పకుండా అవకాశం ఇస్తామని దేవి శ్రీ ప్రసాద్ తన ట్విట్టర్ వేదికగా తెలిపాడు. ప్రస్తుతం శ్రావణి పాడిన పాట సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఇక ఈ పాటను విన్న ప్రతి ఒక్కరు శ్రావణి పాటతో ఫిదా అవుతున్నారు. మంచి స్థాయికి ఎదగాలని దీవిస్తున్నారు.
    Published by:Navya Reddy
    First published: