ఓ బయోపిక్ చేస్తున్నపుడు అందులోని లెజెండరీ పాత్రలను మళ్లీ రీ ప్లేస్ చేయడం అనేది చిన్న విషయం కాదు. చిన్న తేడా వచ్చినా కూడా చివాట్లు తప్పవు. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు క్రిష్. ఈ దర్శకుడు చాలా తెలివిగా తన సినిమా క్యాస్టింగ్‌ను తీసుకుంటున్నాడు. ముఖ్యంగా తనకు కావాల్సిన లెజెండరీ పాత్రల కోసం ఎక్కడెక్కడో వెతుక్కుండా అదే కుటుంబంలోని వారసులను తీసుకుని ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ పాత్రలో ఆయన తనయుడు బాలయ్య నటిస్తున్నాడు.
ఇక మరో తనయుడు హరికృష్ణ పాత్రలో ఆయన తనయుడు కళ్యాణ్ రామ్ నటిస్తున్నాడు. అక్కినేని నాగేశ్వరరావ్ పాత్రలో ఆయన మనవడు సుమంత్ నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో ముఖ్య పాత్రలో ఇంకో వారసుడు కనిపించబోతున్నాడు. దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావ్ పాత్రలో ఆయన తనయుడు కేఎస్ ప్రకాశ్ నటించబోతున్నాడు. ఇప్పుడు ఈ పాత్ర కోసం క్రిష్ ఆయన్ని ఒప్పించాడు. అప్పుడెప్పుడో 20 ఏళ్ల కింద "నీతో" సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు ప్రకాశ్.
ఆ తర్వాత నటుడిగా దూరం అయిపోయి.. దర్శకుడిగా మారాడు. "అనగనగా ఓ ధీరుడు".. "సైజ్ జీరో" లాంటి సినిమాలు కూడా చేసాడు. అయితే సక్సెస్ రాలేదు. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ లో తండ్రి పాత్రలోనే నటించనున్నాడు ప్రకాశ్. మొత్తానికి "ఎన్టీఆర్ బయోపిక్"లో దాదాపు అంతా వారసులే తమ పెద్ద వాళ్ల పాత్రల్లో నటిస్తుండటంతో ఆయా కారెక్టర్స్‌పై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ "కథానాయకుడు" షూటింగ్ పూర్తయింది.. "మహానాయకుడు" షూటింగ్ జరుగుతుంది. జనవరి 9న "కథానాయకుడు".. 24న "మహానాయకుడు" విడుదల కానున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Balakrishna, Kalyan Ram Nandamuri, NTR, NTR Biopic, Telugu Cinema