హోమ్ /వార్తలు /సినిమా /

Prabhas Adipurush: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభాస్ ఆదిపురుష్ టీమ్.. అయినా నిరాశ‌లో ఫ్యాన్స్

Prabhas Adipurush: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభాస్ ఆదిపురుష్ టీమ్.. అయినా నిరాశ‌లో ఫ్యాన్స్

Prabhas Adi purush first look date going to release on this precious day

Prabhas Adi purush first look date going to release on this precious day

Prabhas Adipurush: బాహుబ‌లితో దేశ‌వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్. ఈ మూవీ త‌రువాత ప్ర‌భాస్ రేంజ్ మారిపోయింది. ఇప్పుడు ప్ర‌భాస్ అన్నీ పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నారు. బాహు

  Prabhas Adipurush: బాహుబ‌లితో దేశ‌వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్. ఈ మూవీ త‌రువాత ప్ర‌భాస్ రేంజ్ మారిపోయింది. ఇప్పుడు ప్ర‌భాస్ అన్నీ పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నారు. బాహుబ‌లి త‌రువాత వ‌చ్చిన సాహో అంద‌రి అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయినా ప్ర‌భాస్ రేంజ్ మాత్రం త‌గ్గ‌లేదు. ద‌క్షిణాది స్టార్ డైరెక్ట‌ర్లు మాత్ర‌మే కాదు బాలీవుడ్ ద‌ర్శ‌కులు కూడా ప్ర‌భాస్ కోసం క్యూ క‌ట్టారు. ఈ క్ర‌మంలో ప‌ర‌ భాషా ద‌ర్శ‌కులైన‌ ప్ర‌శాంత్ నీల్, ఓమ్ రౌత్ ప్ర‌భాస్‌ని డైరెక్ట్ చేసే అవ‌కాశాన్ని సొంతం చేసుకున్నారు. ఇక తెలుగు డైర‌క్ట‌ర్ నాగ్ అశ్విన్ తెర‌కెక్కించే ఓ మూవీలో న‌టిస్తున్నారు ప్ర‌భాస్. అయితే ప్ర‌భాస్ పాన్ ఇండియా స్టార్ అయినందుకు ఓ వైపు అభిమానులు సంతోష‌ప‌డుతున్నా.. ఆయన సినిమాల విష‌యంలో మాత్రం వారు నిరాశ‌కు గురి అవుతున్నారు.

  వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌భాస్‌తో ఓమ్ రౌత్ ఆదిపురుష్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ మూవీలో ప్ర‌భాస్ రాముడిగా క‌నిపించ‌నున్నాడు. అలాగే సైఫ్ అలీ ఖాన్ రావ‌ణాసురుడిగా న‌టిస్తున్నారు. ఇక ఈ మూవీకి సంబంధించి తాజాగా మ‌రో అప్‌డేట్‌ని ఇచ్చారు. బాలీవుడ్ న‌టులైన కృతి స‌న‌న్, స‌న్నీ సింగ్‌ల‌ను ఆదిపురుష్‌లోకి ఆహ్వానిస్తూ అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. సీత పాత్ర‌లో కృతి, ల‌క్ష్మ‌ణుడిగా స‌న్నీ సింగ్ క‌నిపించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

  కాగా ప్ర‌భాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిన‌ప్ప‌టికీ ఒక‌ప్పుడు ద‌క్షిణాది, ఇంకా చెప్పాలంటే తెలుగు న‌టుడు. అయితే ఇప్పుడు ఆయ‌న న‌టించే చిత్రాలు ఇండియా వైడ్‌గా విడుద‌ల అవుతుండ‌టంతో.. అందులో ఎక్కువ‌గా బాలీవుడ్ వారిని భాగం చేస్తున్నారు. సాహోలో కూడా ద‌క్షిణాది వారి కంటే బాలీవుడ్ న‌టీన‌టులే ఎక్కువ‌గా ఉన్నారు. వారిలో కొంత‌మంది పేర్లు కూడా ఇక్క‌డ చాలా మంది ప్రేక్ష‌కుల‌కు తెలియవు. అప్పట్లో ఆ చిత్రం మైన‌స్‌ల‌లో అది కూడా ఒకటి.

  ఇక ఇప్పుడు భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తోన్న ఆదిపురుష్‌లోనైనా ద‌క్షిణాది వారిని తీసుకుంటార‌ని అభిమానులు అనుకున్నారు. ముఖ్యంగా సీత‌గా కీర్తి సురేష్ పేరు వినిపించింది. అలాగే ల‌క్ష్మ‌ణుడి పాత్ర‌కు కూడా త‌మిళ న‌టుడిని తీసుకుంటార‌న్న టాక్ న‌డిచింది. కానీ ఇప్పుడు ఆ రెండు పాత్ర‌ల‌కు కూడా బాలీవుడ్ వారినే తీసుకున్నారు. రామాయ‌ణం క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో రాముడు, రావ‌ణాసురుడు, సీత‌, ల‌క్ష్మ‌ణుడి పాత్ర‌లు చాలా కీల‌కమైన‌వి. ఇప్పుడు అందులో ప్ర‌భాస్ మిన‌హాయించి మిగిలిన అంద‌రూ బాలీవుడ్ వారే ఉండ‌టంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ‌కు లోన‌వుతున్నారు. ఎంత పాన్ ఇండియా చిత్రం అయిప్పటికీ.. దక్షిణాదిన కూడా పేరు మోసిన నటీనటులు చాలా మందే ఉన్నారు. ఇక్కడ చాలా మందికి బాలీవుడ్ లోనూ క్రేజ్ ఉంది. వారినైనా  ఈ ప్రాజెక్ట్ లో భాగం చేసి ఉంటే బావుండు అని వారు భావిస్తున్నారు. ఇది ప‌క్క‌న‌పెడితే మ‌రోవైపు ప్ర‌శాంత్ నీల్ మాత్రం ఎక్కువ‌గా ప్ర‌భాస్ స‌లార్ కోసం ఎక్కువ‌గా ద‌క్షిణాది న‌టులనే తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

  Published by:Manjula S
  First published:

  Tags: Adipurush movie, Prabhas

  ఉత్తమ కథలు