Kriti Sanon : పెళ్లి కాకుండానే తల్లైనా ప్రభాస్ హీరోయిన్.. ఆ తర్వాత పడరాని పాట్లు.. వీడియో వైరల్..

ప్రభాస్ Photo : Twitter

Kriti Sanon: మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ థ్రిల్లర్ వ‌న్..నేనొక్క‌డినే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కృతిస‌న‌న్ పెళ్లికాకుండానే తల్లైంది.

  • Share this:
    Kriti Sanon: మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ థ్రిల్లర్ వ‌న్..నేనొక్క‌డినే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కృతిస‌న‌న్ పెళ్లికాకుండానే తల్లైంది. అయితే ఇదంతా ఓ సినిమా కోసమే.. పెళ్లి కాకుండానే తల్లైన కృతి సనన్ జీవితంలో.. ఇక ఆ తర్వాత ఎం జరిగిందనేది కథ. కృతి సనన్ ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం మిమీ. పంకజ్ త్రిపాఠి మరో కీలకపాత్రలో కనిపించున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ సినిమాలో కృతి సనన్ సరోగసి ద్వారా పెళ్లి కాకుండానే తల్లి అవుతుంది. ఓ అమెరికన్ కపుల్ కోసం తన గర్భాన్ని అద్దెకు ఇస్తుంది. దీనికిగాను ఆమె రెండు మిలియన్ల రూపాయలు వసూలు చేస్తుంది. ఇక్కడ ట్విస్ట్ ఏమంటే.. డెలివరీ మరో కొద్ది రోజులు ఉండగా.. ఆ అమెరికన్ కపుల్ తమకు బేబి వద్దంటారు. ఈ క్రమంలో మిమీ పడిన కష్టాలను కొంత ఫన్నీగా.. కొన్ని బాధలతో ఏమోషన్‌లగా చూపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్రైలర్ వైరల్ అవుతోంది. దర్శకుడు లక్ష్మణ్‌ ఉటేకర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈసినిమా ఈ నెల 30న నెట్‌ఫ్లిక్స్‌ ద్వారా ఈ చిత్రం విడుదలకానుంది. కృతిసనన్‌ నటిస్తున్న తొలి మహిళా ప్రధాన చిత్రమిదే.

    ఇక కృతి సనన్ తెలుగు సినిమాల విషయానికి వస్తే.. వన్ నేనొక్కడినే తర్వాత నాగ‌చైత‌న్య‌తో క‌లిసి దోచెయ్ సినిమాలో న‌టించింది. ఆ త‌ర్వాత తెలుగులో సరైనా అవకాశాలు లేక బాలీవుడ్ కు చెక్కేసి..అక్ష‌య్ కుమార్‌, షారుక్ ఖాన్ వంటి స్టార్ హీరోల చిత్రాల‌తోపాటు ప‌లు సినిమాల్లో న‌టిస్తూ బిజీ అయిపోయింది. కృతి ప్రభాస్ సరసన ఆదిపురుష్‌లోను నటిస్తుంది.

    ఈ సినిమాలో కృతి సనన్ సీత పాత్రలో కనిపించనుంది. ప్రభాస్ రాముడిగా కనిపించనున్నారు. ఓమ్ రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రలో హిందీ సూపర్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. కొంత షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. తాజాగా మరోసారి కరోనా కేసులు తగ్గడంతో షూటింగ్‌ను పున: ప్రారంభించింది.
    Published by:Suresh Rachamalla
    First published: