Home /News /movies /

KRITHI SHETTY UPPENA FAME TO ROMANCE WITH HERO POSANI INDRAGANTI MOHANA KRISHNA DIRECTION TA

Krithi Shetty: పోసానితో ‘ఉప్పెన’ భామ కృతి శెట్టి రొమాన్స్.. అఫీషియల్ ప్రకటన..

‘ఉప్పెన’ ఫేమ్ కృతి శెట్టి (Twitter/Photo)

‘ఉప్పెన’ ఫేమ్ కృతి శెట్టి (Twitter/Photo)

Krithi Shetty : కన్నడ భామ కృతి శెట్టి చేసింది ఒకే ఒక్క సినిమా ఉప్పెన. ఈ సినిమా విడుదలై సంచలన విజయం సాధించింది. దీంతో  ఈ భామకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. తాజాగా ఈ భామ పోసానితో రొమాన్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

    Krithi Shetty : కన్నడ భామ కృతి శెట్టి చేసింది ఒకే ఒక్క సినిమా ఉప్పెన. ఈ సినిమా విడుదలై సంచలన విజయం సాధించింది. దీంతో  ఈ భామకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. తెలుగు ఇండస్ట్రీకి ప్రతీ ఏడాది బోలెడంత మంది కొత్త హీరోయిన్‌లు పరిచయం అవుతూ ఉంటారు. అందులో కొందరు మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంటారు. అందులో కన్నడ భామ కృతి శెట్టి ఒకరు. ఉప్పెనలో  ఈ భామ తన నటనతో పాటు అందంతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ భామకు తెలుగులో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. తెలుగు హీరోలందరి చూపు ఈ భామపైనే ఉంది. ఇప్పటికే ఈ భామ.. నాని హీరోగా నటిస్తోన్న ‘శ్యామ్ సింగరాయ్’లో ఓ కథానాయికగా నటిస్తోంది.

    నాని 70 ఏళ్ల వయసు మళ్లిన వ్యక్తిగా ప్రయోగాత్మక పాత్రలో కనిపించబోతున్నాడు. పిరియాడిక్‌ మూవీగా రూపొందనున్న ఈ చిత్రం మొత్తం కోల్‌కతా నేపథ్యంలో తెరకెక్కుతోంది. దాంతో పాటు పలు రామ్ పోతినేని, లింగుసామి కాంబినేషన్‌లో తెరకెక్కతోన్న చిత్రంలో ఈ భామకు అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది.


    ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు వంటి హీరోలు కూడా కృతి శెట్టిని తమ తర్వాత ప్రాజెక్టుల్లో హీరోయిన్‌గా తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అంతేకాదు గోపీచంద్, తేజ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘అలివేలు మంగతాయరు’ సినిమాలో ఈ భామ పేరునే పరిశీలిస్తున్నారు. తాజాగా ఈ భామ.. పోసాని సుధీర్ బాబు, ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమాలో కథానాయికగా నటించబోతున్నట్టు ఈ భామనే ట్వీట్ చేసింది.

    కృతి శెట్టి విషయానికొస్తే.. ఈమె  వయసు ప్రస్తుతం 17 ఏళ్లు మాత్రమే. ప్లస్ టూలోనే ఉంది ఈ బ్యూటీ. ఉప్పెన సినిమా పిచ్చెక్కించిన తీరు చూసిన తర్వాత ఈమెకు ఎంతైనా ఇవ్వొచ్చులే అనుకుంటున్నారు నిర్మాతలు. అందాలు ఆరబోయకపోయినా కూడా నటన పరంగా కృతి సత్తా చూపిస్తుందని నమ్ముతున్నారు. ఉప్పెన సినిమా కోసం రూ. 6 లక్షల పారితోషకం తీసుకున్న  ఈ భామ.. ఇపుడు తర్వాత సినిమాల కోసం ఏకంగా రూ. 60 లక్షలు డిమాండ్ చేస్తుందట.  ఏది ఏమైనా ప్రస్తుతం తెలుగులో ఉప్పెన భామ కృతి శెట్టి హవా నడుస్తోందనే చెప్పాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Krithi shetty, Nani, Shyam Singha Roy Movie, Sudheer Babu, Uppena

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు