Krithi Shetty : నక్కతోక తొక్కిన కన్నడ భామ కృతి శెట్టి.. మరో బంపర్ ఆఫర్..

కృతి శెట్టి Photo : Instagram

Krithi Shetty : కన్నడ భామ కృతి శెట్టి చేసింది ఒక్క సినిమానే.. అదీ కూడా ఇంకా విడదులకాలేదు. కానీ ఈ భామకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి.

  • Share this:
    Krithi Shetty : కన్నడ భామ కృతి శెట్టి చేసింది ఒక్క సినిమానే.. అదీ కూడా ఇంకా విడదులకాలేదు. కానీ ఈ భామకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. తెలుగు ఇండస్ట్రీకి ప్రతీ ఏడాది బోలెడంత మంది కొత్త హీరోయిన్‌లు పరిచయం అవుతూ ఉంటారు. అందులో కొందరు మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంటారు. అందులో కన్నడ భామ కృతి శెట్టి ఒకరు. ఈ భామ మంచి అందగత్తేకాదు. నటీ కూడా. తొలి సినిమా విడుదల కాకుండానే క్రేజ్ తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి తన అందచందాలతో పాటు నటనతో ఇండస్ట్రీని ఊపేయడానికి వచ్చినట్లే ఉంది ఈ అమ్మడు క్రేజ్ చూస్తుంటే.. ఇక ఈ భా ఇప్పటికే నాని సినిమాలో అవకాశం వచ్చింది. 'టాక్సీవాలా' ఫేమ్ దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్, నాని కాంబినేషన్‌లో వస్తోన్న 'శ్యామ్ సింగరాయ్‌' సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది కృతి శెట్టి. నాని.. ట్యాక్సీవాలా' ఫేమ్‌ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో 27వ సినిమాగా శ్యామ్ సింగరాయ్’ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీకి వెంకట్‌ బోయినపల్లి నిర్మాతగా వ్యవహరించనున్నాడు. సాయి పల్లవి ఓ హరోయిన్‌గా నటిస్తుండగా... 'ఉప్పెన' ఫేమ్‌ కృతిశెట్టి మరో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో నాని 70 ఏళ్ల వయసు మళ్లిన వ్యక్తిగా ప్రయోగాత్మక పాత్రలో కనిపించబోతున్నాడు. పిరియాడిక్‌ మూవీగా రూపొందనున్న ఈ చిత్రం మొత్తం కోల్‌కతా నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు సమాచారం అందుతోంది.

    సింగర్ మనీషా ఈరబత్తిని బ్యూటీఫుల్ పిక్స్..

    Krithi Shetty, Uppena fame krithi shetty news, krithi shetty films,krithi shetty twitter,krithi shetty facebook,krithi shetty instagram,krithi shetty movies,krithi shetty actress,krithi shetty age,కృతి శెట్టి,కృతి శెట్టి హాట్,కృతి శెట్టి ఉప్పెన
    Photo : Instagram


    ఇక ఈ సినిమాతో పాటు.. మరో సినిమాలో కూడా అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. యాక్షన్ హీరో గోపీచంద్‌ ప్రస్తుతం సీటీమార్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత గోపి చంద్.. టాలెంటెడ్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా ‘అలిమేలుమంగ వేంకటరమణ’‌లో నటించనున్నాడు. తనకు నటుడిగా లైఫ్ ఇచ్చి ఇండస్ట్రీలో తనను నిలబెట్టినా దర్శకుడు తేజతో గోపీచంద్ హీరోగా చేస్తోన్న మొదటి సినిమా ఇది. తేజ, గోపీచంద్‌ కోసం ఓ యాక్షన్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిత్రబృందం స్క్రిప్ట్ ను కూడా ఫైనల్ చేసిందట. ఈ సినిమాలో గోపీచంద్ పాత్ర చాలా పవర్ ఫుల్‌గా ఉంటుందట. డైరెక్టర్ తేజ దర్శకత్వంలో వచ్చిన ‘జయం, నిజం’ సినిమాలతో ప్రతినాయకుడిగా నిలదొక్కుకున్న గోపీచంద్ ఈ సారి హీరోగా తేజ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకుంటాడని భావిస్తున్నారు ఆయన అభిమానులు. ఇక ఈ సినిమాలో అలిమేలు మంగ పాత్ర కోసం ఇప్పటికే హీరోయిన్ కోసం స్టార్ హీరోయిన్ల పేర్లని తేజ పరిశీలిస్తున్నారని కాజల్‌, అనుష్క ఇద్దరిలో ఒకర్ని హీరోయిన్ గా తీసుకోనున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఏవో కారణాల వల్ల ఆ కాంబినేషన్ కుదరలేదట. దీంతో అలిమేలుమంగ పాత్ర కోసం తాజాగా కృతిశెట్టిను పరిశీలిస్తోందట చిత్రబృందం. అంతేకాదు ప్రస్తుతం కృతిశెట్టితో సంప్రదింపులు జరుగుతున్నాయనీ, ఆమె ఎంపిక కూడా దాదాపు ఓకే అయినట్టేనని తెలుస్తోంది.
    Published by:Suresh Rachamalla
    First published: