హోమ్ /వార్తలు /సినిమా /

K Viswanath Death: విశ్వనాథ్ మృతిపై కృష్ణం రాజు సతీమణి ఎమోషనల్ కామెంట్స్

K Viswanath Death: విశ్వనాథ్ మృతిపై కృష్ణం రాజు సతీమణి ఎమోషనల్ కామెంట్స్

K Vishwanath Shyama Devi

K Vishwanath Shyama Devi

Krishnam Raju Wife Shyamala: ప్రముఖ సినీ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్‌ మరణ వార్త విని టాలీవుడ్ శోక సంద్రంలో మునిగింది. ఆయన మృతి పట్ల అటు రాజకీయ నాయకులతో పాటు సినీ ప్రముఖులు ప్రగాడ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

టాలీవుడ్ లెజండరీ డైరెక్టర్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె.విశ్వనాథ్ (K Viswanath passes away) అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 92 ఏళ్లు. గత కొంత కాలంగా వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలో బాధపడుతున్న ఆయన గురువారం కూడా తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో హుటాహుటిన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ కన్నుమూశారు. విశ్వనాథ్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా దివంగత కృష్ణం రాజు సతీమణి శ్యామల (Krishnam Raju Wife Shyamala) కే. విశ్వనాథ్ కి నివాళులు అర్పిస్తూ అప్పటి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు.

''టాలీవుడ్ మరో పెద్ద దిక్కును కోల్పోయింది. కళాతపస్వి కె విశ్వనాథ్ కన్నుమూసిన విషయం తెలిసి ఎలా స్పందించాలో కూడా నాకు అర్థం కాలేదు. కృష్ణం రాజు గారు మరణించిన సమయంలో కూడా ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయన శివైక్యం చెందారని తెలిసి మేమంతా చాలా బాధపడుతున్నాం. కె. విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించిన శివమెత్తిన సత్యం, కళ్యాణ చక్రవర్తి, అల్లుడు పట్టిన భారతం వంటి చిత్రాల్లో కృష్ణం రాజు గారు నటించారు.

హీరో కావాలని చెన్నైకి వెళ్లిన కృష్ణంరాజు గారు ప్రముఖ దర్శకుడు ఆదూర్తి సుబ్బారావు వద్దకు వెళ్లారు. ఆ సమయంలో కృష్ణంరాజు గారి నటనా ప్రావీణ్యాన్ని పరిశీలించాలని తన అసిస్టెంట్ అయిన కె.విశ్వనాథ్ గారికి సుబ్బారావు చెప్పారట. అప్పుడు ప్యాథటిక్ డైలాగ్స్ ఇచ్చి వాటిని చెప్పాలని కృష్ణం రాజును కె.విశ్వనాథ్ అడగగా ఆ డైలాగ్స్ చెప్తున్న క్రమంలోనే తన కళ్ల వెంట నీళ్లు వచ్చాయని, అది గమనించిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె.విశ్వనాథ్ గారు కృష్ణంరాజు గారిని హీరోగా ఫైనల్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఎన్నో సార్లు కృష్ణంరాజు గారు చెబుతూ ఉండేవారు. ఒకరకంగా కృష్ణంరాజు గారు విశ్వనాథ్ గారిని తన గురు సమానంగా భావించేవారు. విశ్వనాథ్ గారి మరణంతో ఒక శకం ముగిసినట్లయింది. విశ్వనాథ్ గారి కుటుంబ సభ్యులకు ఈ బాధను కోలుకునే విధంగా భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను'' అని శ్యామల అన్నారు.

తెలుగు చిత్రపరిశ్రమకు గొప్ప గౌరవాన్ని, గుర్తింపు తీసుకొచ్చిన విశ్వనాథ్ (RIP Viswanath).. 50కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. భారతీయ సంస్కృతికి చిహ్నమైన శాస్త్రీయ కళలను కథలుగా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఆత్మ గౌరవం సినిమాతో దర్శకుడిగా మారారు. శంకరాభరణం సినిమా తెలుగు చిత్రసీమలో చరిత్ర సృష్టించింది. జాతీయ పురస్కారం గెలుచుకుంది. సాగరసంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం ఆయకు కీర్తి ప్రతిష్ఠతలు తెచ్చిపెట్టాయి. సామాజిక సమస్యలను ప్రస్తావిస్తూ.. ఆయన తీసిన సప్తపది, స్వాతిముత్యం, స్వయంకృషి, శుభోదయం, శుభలేఖ, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం అందరినీ ఆలోజింపజేశాయి.

First published:

Tags: Kasi vishwanath, Tollywood, Tollywood actor