Prabhas- Krishnam Raju: ప్రభాస్ ఆ మూవీలో నేను న‌టిస్తున్నా.. ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పిన కృష్ణంరాజు

కృష్ణంరాజు, ప్రభాస్ (ఫైల్ ఫోటో)

రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజు(Krishnam Raju) ఇవాళ త‌న 81వ పుట్టినరోజును జ‌రుపుకుంటున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న ఇంట్లో బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ కూడా ఘ‌నంగా జ‌రిగాయి. కాగా ఈ పుట్టిన రోజు సంద‌ర్భంగా ప్ర‌భాస్ అభిమానుల‌కు గుడ్‌న్యూస్‌ని ప్ర‌క‌టించారు కృష్ణం రాజు. ప్ర‌భాస్ న‌టిస్తోన్న ఓ మూవీలో తాను న‌టిస్తున్న‌ట్లు రెబ‌ల్ స్టార్ ప్రక‌టించారు

  • Share this:
    Prabhas- Krishnam Raju: రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజు ఇవాళ త‌న 81వ పుట్టినరోజును జ‌రుపుకుంటున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న ఇంట్లో బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ కూడా ఘ‌నంగా జ‌రిగాయి. కాగా ఈ పుట్టిన రోజు సంద‌ర్భంగా ప్ర‌భాస్ అభిమానుల‌కు గుడ్‌న్యూస్‌ని ప్ర‌క‌టించారు కృష్ణం రాజు. ప్ర‌భాస్ న‌టిస్తోన్న ఓ మూవీలో తాను న‌టిస్తున్న‌ట్లు రెబ‌ల్ స్టార్ ప్రక‌టించారు. బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న కృష్ణం రాజు ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకున్నారు. ఈ క్ర‌మంలో మాట్లాడుతూ.. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ న‌టిస్తోన్న రాధే శ్యామ్‌లో తాను న‌టిస్తున్న‌ట్లు కృష్ణం రాజు తెలిపారు. ఇందులో తాను గొప్ప ఆధ్యాత్మిక గురువు ప‌ర‌మ‌హంస పాత్ర‌లో న‌టిస్తున్నాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఈ పాత్ర‌కు సంబంధించి కాస్త షూటింగ్ మిగిలి ఉంద‌ని కృష్ణం రాజు వెల్ల‌డించారు. అలాగే ఈ మూవీ ఏప్రిల్‌లో విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న‌ట్లు ఆయ‌న ఒక స్ప‌ష్ట‌తను ఇచ్చారు.

    కాగా ప్ర‌భాస్ న‌టించిన బిల్లా, రెబ‌ల్ చిత్రాల్లో కృష్ణం రాజు మెరిసిన విష‌యం తెలిసిందే. ఇక ఈ కాంబోలో మ‌రిన్ని సినిమాలు రావాల‌ని అభిమానులు ఎప్ప‌టినుంచో ఎదురుచూస్తున్నారు. ఈ క్ర‌మంలో ఓమ్ రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ హీరోగా తెర‌కెక్క‌నున్న ఆదిపురుష్‌లో ఓ కీల‌క పాత్ర‌లో కృష్ణం రాజు న‌టించ‌బోతున్న‌ట్లు ఆ మ‌ధ్య‌న వార్త‌లు వ‌చ్చాయి. అయితే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రాక‌పోయినా.. ఇప్పుడు రాధే శ్యామ్‌పై మాత్రం ఒక క్లారిటీ వ‌చ్చింది. ఇక కృష్ణంరాజు చెప్పిన ఈ మాట‌తో ప్ర‌భాస్ ఫ్యాన్స్ మ‌రింత సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

    ఇదిలా ఉంటే రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రాధే శ్యామ్ తెర‌కెక్కుతోంది. ఇందులో ప్రభాస్ స‌ర‌సన పూజా హెగ్డే న‌టిస్తోంది. భాగ్య‌శ్రీ, స‌చిన్ కేడ్క‌ర్, ప్రియ‌ద‌ర్శి, ముర‌ళీ శ‌ర్మ‌, కునాల్ క‌పూర్, షాషా ఛెత్రీ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. గోపికృష్ణ బ్యాన‌ర్, యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ సంగీతం అందిస్తున్నారు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెర‌కెక్కిస్తోన్న ఈ మూవీపై అభిమానుల్లో చాలా అంచ‌నాలు ఉన్నాయి.
    Published by:Manjula S
    First published: