KRISHNAM RAJU MANCHU VISHNU WHAT HAPPEND TO PRABHAS UNCLE KRISHNAM RAJU HEALTH REBEL STAR FANS WORRIED ABOUT HIS HEALTH CONDITION TA
Krishnam Raju - Manchu Vishnu: కృష్ణంరాజుకు ఏమైంది.. ఇలా అయిపోయాడేమిటి.. ? ఆందోళనలో రెబల్ స్టార్ ఫ్యాన్స్..
రెబల్ స్టార్ కృష్ణంరాజు దంపతులతో మంచు విష్ణు (Twitter/Photo)
Krishnam Raju - Manchu Vishnu - MAA Elections : టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజుకు ఏమైంది.. ఇలా అయిపోయాడేమిటి.. అని ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Krishnam Raju - Manchu Vishnu - MAA Elections: టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజుకు ఏమైంది.. ఇలా అయిపోయాడేమిటి.. అని ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మా ఎలక్షన్స్ నేపథ్యంలో తనకు మద్దతు ఇవ్వాలని కోరుతూ.. రెబల్ స్టార్ కృష్ణంరాజును ఆయన ఇంట్లో కలిసారు. ఈ సందర్భంగా ఆయనతో దిగిన ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా మంచు విష్ణుతో ఉన్న కృష్ణంరాజును చూసి అభిమానులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఎపుడు ఎంతో యాక్టివ్‌గా ఉండే కృష్ణంరాజు.. ఇలా నీరసంగా కృంగి, కృశించి పోయినట్టు చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏదో జ్వరం లాంటిది వచ్చి ఇలా అయిపోయారా.. రెబల్ స్టార్‌కు ఏమైనా అయిందా అని అనుమానాలు మొదలయ్యాయి.
రీసెంట్గా కృష్ణంరాజు ఆయన తన ఇంటిలో అనుకోకుండా జారీ పడిపోవడంతో కాలుకు ఫ్యాక్చర్ అయినట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఆయన్ని వెంటనే అపోలో (Apollo) హాస్పిటల్లో జాయిన్ చేసారు. డాక్టర్లు ఆయన తుంటికి శస్త్ర చికిత్స నిర్వహించినట్టు చెబుతున్నారు. అయితే కృష్ణంరాజు పీఆర్ టీమ్ మాత్రం రొటిన్ చెకప్ కోసమే అపోలో హాస్పిటల్‌కు వెళ్లారని చెప్పారు. నిజంగానే తుంటికి చికిత్స తీసుకొని ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారా అనేది తెలియాల్సి ఉంది. రీసెంట్గా ఈయన హీరో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితితో పాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించడానికే ఆయన అపోలో హాస్పిటల్‌కు వెళ్లినట్టు చెబుతున్నారు.
అంతేకాదు ఈయన త్వరలో తన ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి లండన్ టూర్‌కు వెళ్లనున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా రొటీన్ చెకప్ కోసమే ఆయన హాస్పిటల్‌కి వెళ్లినట్టు చెప్పారు. తీరా ఇపుడు కృష్ణంరాజు చూసి నిజంగానే ఆయనకు అభిమానులు షాక్ అవుతున్నారు. ఒక రంగా మంచు విష్ణు.. తమ హీరోను కలిసి ఈ ఫోటో దిగకపోతే.. ఆయన ఎలా ఉండేవారనే విషయం తమకు తెలిసేది కాదంటున్నారు రెబల్ స్టార్ అభిమానులు.
కృష్ణంరాజు విషయానికొస్తే.. గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఈయన ఇపుడు తన తమ్ముడు తనయుడు ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ‘రాధే శ్యామ్’లో ఓ ముఖ్యపాత్రను చేస్తున్నట్టు సమాచారం. దాంతో పాటు ‘ఆదిపురుష్’ సినిమాలో కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ చేయనున్నట్టు సమాచారం.
ఇక కృష్ణంరాజు 1990లో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన ఈయన.. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరారు.అంతేకాదు 1999-2004 మధ్యలో కేంద్ర సహాయ మంత్రిగా వాజ్‌పేయ్ మంత్రి వర్గంలో పనిచేసారు. ఆ తర్వాత ఈయన చిరంజీవి స్థాపించిన ప్రజా రాజ్యం పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ ఎన్నికల్లో పీఆర్పీ తరుపున రాజమండ్రి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత తిరిగి ఈయన బీజేపీ గూటికి చేరారు. ప్రస్తుతం ఆ పార్టీ సభ్యుడిగా కొనసాగతున్నారు.
రెబల్ స్టార్ కృష్ణంరాజు సినీ కెరీర్ విషయానికొస్తే... ప్రత్యేకమైన మాడ్యులేషన్,డైలాగ్ డెలివరీలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను, అభిమానులను సంపాదించుకున్సారు. సీనియర్ హీరోలలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు, స్థానం ఉన్న కృష్ణంరాజు.. తన కెరీర్‌ను హీరోగా మొదలు పెట్టి.. ఆ తర్వాత విలన్‌గా మారి.. ఆపై రెబల్ స్టార్‌గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
‘చిలుక గోరింక’ సినిమాతో నటుడిగా ప్రస్థానం మొదలు పెట్టిన కృష్ణంరాజు.. చిరవగా అనుష్క, అల్లు అర్జున్, రానా ప్రధాన పాత్రలో నటించిన ‘రుద్రమదేవి’లో గణపతి దేవుడిగా కనిపించి అలరించారు. ప్రస్తుతం ఈయన ‘మా’ కమిటీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడిగా ఉన్న సంగతి తెలిసిందే కదా.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.