హోమ్ /వార్తలు /సినిమా /

Rangamarthanda Trailer: కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌.. బ్రహ్మానందం డైలాగ్స్ హైలైట్

Rangamarthanda Trailer: కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌.. బ్రహ్మానందం డైలాగ్స్ హైలైట్

Rangamarthanda Trailer (Photo Twitter)

Rangamarthanda Trailer (Photo Twitter)

Krishna Vamsi Rangamarthanda: కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన రంగమార్తాండ సినిమాను ఉగాది కానుకగా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేసిన యూనిట్.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఒకానొక సమయంలో టాలీవుడ్ సూపర్ డూపర్ హిట్స్‌కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కృష్ణవంశీ (Krishna Vamsi).. కొన్నేళ్ల పాటు పరాజయాలతో సతమతమయ్యారు. తిరిగి ఇప్పుడు రీఫ్రెష్ అవుతూ రంగమార్తాండ (Rangamarthanda) అనే ప్రయోగాత్మక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బ్రహ్మానందం (Brahmanandam), ప్రకాష్ రాజ్ (Prakash Raj), రమ్యకృష్ణ (Ramya Krishna), అనసూయ (Anasuya) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేసిన యూనిట్.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.

ఒక నిమిషం 56 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ ట్రైలర్ లో రంగస్థల నటుడి కష్ట సుఖాలను చూపిస్తూ కృష్ణవంశీ మార్క్ చూపించారు. తన కూతురే తనని దొంగ అని ముద్ర వేయడం అందరినీ కంట తడి పెట్టించింది. ట్రైలర్ అంతా కూడా ఎమోషన్స్ తో నింపేశారు. బ్రహ్మానందం డైలాగ్స్ హైలైట్ అయ్యాయి. బ్రహ్మానందం నుండి ఊహించని యాంగిల్ చూడొచ్చని అర్థమవుతోంది. రంగస్థల నటుడిగా కీర్తి సత్కారాలు అందుకున్న రాఘవరావు.. కన్న పిల్లల ఛీత్కారాలు, సమాజం నుండి అవమానాలు ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చింది? రంగమార్తాండ రాఘవరావు కథ ఎలా ముగిసిందనేదే ఈ సినిమా అని ట్రైలర్ స్పష్టం చేసింది. విడుదల చేసిన కాసేపట్లోనే ఈ ట్రైలర్ ట్రెండింగ్ అవుతోంది.

మారాఠీలో విలక్షణ నటుడు నానా పటేకర్ (Nana Patekar) సూపర్ హిట్ 'నట సామ్రాట్' (Nata samrat) మూవీకి తెలుగు రీమేక్ గా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ సినిమా కోసం చిరంజీవి రంగంలోకి దిగి తన కెరీర్ లోనే మొట్టమొదటి సారిగా షాయరీ (Shayari) వినిపించబోతుండటం విశేషం. ఈ (షాయరి) రీసెంట్ గా విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇళయరాజా సంగీతం సారధ్యంలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.' isDesktop="true" id="1675530" youtubeid="X2robYfyCbA" category="movies">

ఈ సినిమాలో సీనియర్ నటులు ప్రకాష్ రాజ్ (Prakash Raj), రమ్యకృష్ణ (Ramyakrishna), బ్రహ్మానందం (Brahmanandam) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శివానీ రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, అనసూయ భరద్వాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. గులాబీ, నిన్నే పెళ్లాడతా, అంతపురం, ఖడ్గం లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు రూపొందించిన కృష్ణ వంశీ.. ఇప్పుడు రంగమార్తాండతో మరో ప్రయోగం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్స్‌ను చూసిన జనాలు సినిమా అదిరిపోయిందని.. కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

First published:

ఉత్తమ కథలు