ఒకానొక సమయంలో టాలీవుడ్ సూపర్ డూపర్ హిట్స్‌కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కృష్ణవంశీ (Krishna Vamsi).. కొన్నేళ్ల పాటు పరాజయాలతో సతమతమయ్యారు. తిరిగి ఇప్పుడు రీఫ్రెష్ అవుతూ రంగమార్తాండ (Rangamarthanda) అనే ప్రయోగాత్మక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఎప్పుడో షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమా మార్చి 22న విడుదలవుతున్నట్లు చిత్రంబృందం అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ గురించిన ఓ వార్త బయటకొచ్చింది. ‘రంగమార్తాండ’ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ తీసుకున్నారట. డీసెంట్ రేటుకు ఈ సినిమా హక్కులను పొందినట్లు సమాచారం. థియేటర్స్ లో ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ ఆధారంగా ఈ మూవీని ఎప్పుడు ఓటీటీలోకి తీసుకురావాలో డిసైడ్ చేస్తారట.
మారాఠీలో విలక్షణ నటుడు నానా పటేకర్ (Nana Patekar) సూపర్ హిట్ 'నట సామ్రాట్' (Nata samrat) మూవీకి తెలుగు రీమేక్ గా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ సినిమా కోసం చిరంజీవి రంగంలోకి దిగి తన కెరీర్ లోనే మొట్టమొదటి సారిగా షాయరీ (Shayari) వినిపించబోతుండటం విశేషం. ఈ (షాయరి) రీసెంట్ గా విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇళయరాజా సంగీతం సారధ్యంలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సినిమాలో సీనియర్ నటులు ప్రకాష్ రాజ్ (Prakash Raj), రమ్యకృష్ణ (Ramyakrishna), బ్రహ్మానందం (Brahmanandam) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శివానీ రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, అనసూయ భరద్వాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. గులాబీ, నిన్నే పెళ్లాడతా, అంతపురం, ఖడ్గం లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు రూపొందించిన కృష్ణ వంశీ.. ఇప్పుడు రంగమార్తాండతో మరో ప్రయోగం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్స్‌ను చూసిన జనాలు సినిమా అదిరిపోయిందని.. కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Krishna vamsi, Tollywood, Tollywood actor