హోమ్ /వార్తలు /సినిమా /

KV21: చిరంజీవి పేరుతో క్యూరియాసిటీ పెంచేసిన కృష్ణవంశీ

KV21: చిరంజీవి పేరుతో క్యూరియాసిటీ పెంచేసిన కృష్ణవంశీ

Photo Twitter

Photo Twitter

Chiranjeevi in Rangamarthanda: రంగమార్తాండ అనే ప్రయోగాత్మక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు కృష్ణవంశీ. చాలా కాలంగా షూటింగ్ జరుగుపుట్టుకుంటున్న ఈ సినిమాను అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టి ఎప్పటికప్పుడు ఆసక్తి రేకెత్తించే అప్ డేట్స్ రిలీజ్ చేస్తున్నారు.

ఇంకా చదవండి ...

ఒకానొక సమయంలో టాలీవుడ్ సూపర్ డూపర్ హిట్స్‌కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కృష్ణవంశీ (Krishna Vamsi).. కొన్నేళ్ల పాటు పరాజయాలతో సతమతమయ్యారు. తిరిగి ఇప్పుడు రీఫ్రెష్ అవుతూ రంగమార్తాండ అనే ప్రయోగాత్మక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చాలా కాలంగా షూటింగ్ జరుగుపుట్టుకుంటున్న ఈ సినిమాను అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టి ఎప్పటికప్పుడు ఆసక్తి రేకెత్తించే అప్ డేట్స్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా నుంచి ఓ వీడియోను రిలీజ్ చేసి జనాల్లో క్యూరియాసిటీ పెంచేశారు.

దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తరువాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న చిత్రం 'రంగమార్తాండ' (Rangamarthanda). మారాఠీలో విలక్షణ నటుడు నానా పటేకర్ (Nana Patekar) సూపర్ హిట్ 'నట సామ్రాట్' (Nata samrat) మూవీకి తెలుగు రీమేక్ గా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ సినిమా కోసం చిరంజీవి రంగంలోకి దిగి తన కెరీర్ లోనే మొట్టమొదటి సారిగా షాయరీ (Shayari) వినిపించబోతుండటం విశేషం.

ఈ మేరకు తాజాగా వదిలిన వీడియోలో చిరంజీవి పేరు ప్రస్తావించి జనాల్లో ఆతృతను పెంచేశారు కృష్ణవంశీ. 'ఇది మన అమ్మానాన్నల కథ' అంటూ టైటిల్ లోగో లేకుండా ఓ వీడియో వదిలారు. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం ఫొటోల పైభాగంలో కుడి ఎడమ చూస్తుండగా మధ్యలో టైటిల్ ప్లేస్‌లో క్వోశ్చన్ మార్క్ సింబల్ పెట్టడం, చివరలో చిరంజీవి పేరును కూడా ప్రదర్శించడం హైలైట్ అయింది. అయితే ఇలా చిరంజీవి పేరు కూడా వేశారంటే ఆయన వాయిస్ ఓవర్‌కి సినిమాలో ఎంత ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు.

హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై కాలిపు మధు, ఎస్. వెంకటరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటులు ప్రకాష్ రాజ్ (Prakash Raj), రమ్యకృష్ణ (Ramyakrishna), బ్రహ్మానందం (Brahmanandam) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శివానీ రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, అనసూయ భరద్వాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తుండటం విశేషం. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. కృష్ణవంశీ కెరీర్ లో 21వ సినిమాగా ఈ మూవీ విడుదల కానుంది.

Published by:Sunil Boddula
First published:

Tags: Chiranjeevi, Krishna vamsi, Tollywood

ఉత్తమ కథలు