హోమ్ /వార్తలు /సినిమా /

Krishna Last Rites: స్వగృహానికి భౌతిక కాయం... ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు..

Krishna Last Rites: స్వగృహానికి భౌతిక కాయం... ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు..

కృష్ణ (పాతచిత్రం)

కృష్ణ (పాతచిత్రం)

Krishna: సూపర్ స్టార్ కృష్ణ (79) ఇకలేరు. ఇవాళ తెల్లవారుజామున 4 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో 79 ఏళ్ల వయసులో  కన్నుమూశారు. ఆసుపత్రి నుంచి కృష్ణ పార్థివ దేహాం ఇంటికి చేరుకుంది. మరోవైపు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

సూపర్ స్టార్ కృష్ణ (79) ఇకలేరు. ఇవాళ తెల్లవారుజామున 4 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో 79 ఏళ్ల వయసులో  కన్నుమూశారు. నిన్న గుండెపోటుతో హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో కృష్ణ అడ్మిట్ అయ్యారు. వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ.. ఆయన కోలుకోలేదు. వైద్యానికి శరీరం సరిగ్గా స్పందించలేదు. క‌ృష్ణ ఆరోగ్య విషమంగానే ఉందని డాక్టర్లు కూడా చెప్పారు. 48 గంటలు గడిస్తే గానీ.. ఏమీ చెప్పలేదని తెలిపారు. అంతలోనే ఆయన కన్నుమూశారు. ఇక ఆయన అంత్యక్రియలు రేపు మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీ హిల్స్ మహా ప్రస్థానంలో జరుగనున్నాయి. రమేష్ బాబు కుమారుడు అమెరికా నుంచి రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన భౌతిక కాయం నానక్‌రామగూడలోని తన నివాసంలో ఉంచారు.  సాయంత్రం 5 గంటలకు గచ్చిబౌలి స్టేడియానికి అభిమానుల సందర్శనార్ధం సూపర్ స్టార్ కృష్ణ గారి పార్ధివదేహాన్ని ఉంచనున్నారు. ఇక మరోవైపు కృష్ణ పార్థివ దేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు.

ఇక కృష్ణ మరణంతో ఒక్కసారిగా చిత్రసీమ సోకసంద్రంలోకి మునిగిపోయింది. మహేష్‌కు రాజకీయ నేతలతో పాటు సినీ సెలెబ్రిటీలు సంతాపం తెలుపుతున్నారు. ఇప్పటికే చిరంజీవి , రజనీకాంత్, తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రలు కేసీఆర్ , జగన్ ప్రగాడ సానుభూతి తెలపగా.. ఇక తాజాగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

కృష్ణ 1943, మే 31వ తేదీన గుంటూరు జిల్లాలోని తెనాలి మండలం బుర్రిపాలెంలో జన్మించారు.. 1960లో ఏలూరు సి.ఆర్‌.రెడ్డి. కాలేజీలో బిఎస్సీ పూర్తి చేశారు. కృష్ణ చూసిన తొలి చిత్రం 'పాతాళభైరవి'. బాగా ఆకట్టుకున్న ఈ చిత్రంతో ఎన్టీఆర్‌కి అభిమాని అయ్యారు. దేవదాసు' వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తెనాలికి వచ్చిన ఏఎన్నార్‌, సావిత్రిలను చూడడానికి వేల మంది జనం రావడంతో.. ఒక హీరోను ఇంతగా అభిమానిస్తారా ? అని ఆశ్చర్య పోయారు. హీరోగా మారాలనే ఆలోచనకు నాంది పలికింది ఈ సంఘటనే. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ సూపర్ స్టార్ కృష్ణ. సినిమాలో రాణించాలంటే నాటకాల్లో ఫ్రూవ్‌ చేసుకోవాలని కొంతమంది సినీ ప్రముఖులు ఇచ్చిన సలహాతో నాటకాల్లో వేషాలు వేయడం ప్రారంభించారు. 1960లో కృష్ణ తొలిసారిగా స్టేజ్‌ మీద 'చేసిన పాపం కాశీకెళ్ళినా' అనే నాటకంలో నటించారు. ఇందులో శోభన్‌బాబు కూడా నటించడం విశేషం.ఆ తర్వాత 'భక్త శబరి', 'సీతారామ కళ్యాణం', 'ఛైర్మన్‌' వంటి నాటకాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు.

కృష్ణ తొలిసారి హీరోగా ఎంపికైన చిత్రం 'కొడుకులు కోడళ్ళు'. కొన్ని కారణాల వల్ల ఇది ఆగిపోయింది. 'మూగ మనసులు' చిత్రం విడుదలైన తర్వాత 'తేనె మనసులు' కోసం నూతన నటీనటులు కావాలనే పేపర్‌ యాడ్‌ చూసి ఆడిషన్‌కి వెళ్ళి ఎంపికయ్యారు. హీరోగా ఎంపికైనప్పటికీ బక్కగా ఉన్నావు, నువ్వేం నటిస్తావని చాలా మంది దెప్పిపోడిచారట. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు జడ్జ్‌మెంట్‌ తప్పన్నారు. 'తేనెమనసులు' విడుదలై సంచలన విజయం సాధించాక కృష్ణ ఎంపిక విషయంలో  ఆదుర్తి నిర్ణయం హండ్రెడ్‌ పర్సెంట్‌ కరెక్ట్‌ అని అందరికీ అర్థమైంది. తొలి చిత్రంతోనే నటుడిగా అందరి ప్రశంసలందుకున్నారు కృష్ణ. తొలి చిత్రం సాధించిన విజయంతో కృష్ణ వెను దిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.

1968 నుంచి 74 వరకు ఒక్కో ఏడాది దాదాపు పదికిపైగా చిత్రాలు విడుదలయ్యాయి. ఆ టైమ్‌లో తెనాలిలో ఉన్న ఏడు థియేటర్లలో అన్నీ కృష్ణ సినిమాలే ఆడేవంటే అతిశయోక్తి కాదు. రోజుకి మూడు షిప్ట్‌ల చొప్పున బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాల్లో నటించిన ఘనత కృష్ణదే. నిర్మాతల హీరోగా పేరొందిన కృష్ణని అభిమానులు ముద్దుగా 'సూపర్‌స్టార్‌' అని పిలుచుకుంటారు. 350 పైగా చిత్రాల్లో ఎన్నో సాంఘిక, జానపద, పౌరాణిక,జేమ్స్‌బాండ్, కౌబాయ్ వంటి డిఫరెంట్ చిత్రాల్లో మెప్పించిన సూపర్ స్టార్ కృష్ణ. ఈ రోజుల్లో మనం టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటున్నాం కానీ ఆ రోజుల్లోనే సూపర్ స్టార్ కృష్ణ చేసిన సాహసాలు అన్నీ ఇన్నీ కావు. తెలుగు ఇండస్ట్రీ ఈ రోజు ఈ స్థాయిలో ఉందంటే కారణం కృష్ణ గారు కూడా. ఎందుకంటే ఆయన చేసిన ప్రయోగాలు.. సాహసాలు మరే హీరో చేయలేదేమో..? అందుకే సాహసమే ఆయన ఊపిరి అంటారు.

First published:

Tags: Krishna, Tollywood news