Home /News /movies /

KRISH VAISHNAV TEJ RAKUL PREET SINGHS KONDAPOLAM TWITTER REVIEW TA

Kondapolam Twitter Review : క్రిష్, వైష్ణవ్ తేజ్‌ల ‘కొండపొలం’ ట్విట్టర్ రివ్యూ.. ఎలా ఉందంటే..

‘కొండపొలం’ ట్విట్టర్ రివ్యూ Kondapolam Trailer Photo : Twitter

‘కొండపొలం’ ట్విట్టర్ రివ్యూ Kondapolam Trailer Photo : Twitter

Kondapolam Twitter Review : ఈ యేడాది ‘ఉప్పెన’ సినిమాతో వెండితెరకు పరిచమైన వైష్ణవ్ తేజ్ తొలి సినిమాతోనే భారీ సక్సెస్ అందుకున్నారు. తాజాగా ఈయన క్రిష్ దర్శకత్వంలో చేసిన రెండో సినిమా ‘కొండపొలం’. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందంటే..

ఇంకా చదవండి ...
    Kondapolam Twitter Review : ఈ యేడాది ‘ఉప్పెన’ సినిమాతో వెండితెరకు పరిచమైన వైష్ణవ్ తేజ్ తొలి సినిమాతోనే భారీ సక్సెస్ అందుకున్నారు. మెగా మేనల్లుడుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా.. ఫస్ట్ మూవీతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు కరోనా సమయంలో కూడా  ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దాదాపు రూ. 100 గ్రాస్ వసూళ్లను సాధించి ఔరా అనిపించింది. ఇక   ఆయన నటించిన రెండో సినిమా ’కొండపొలం’. క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను అతనికే చెందిన ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. ఈ  రోజు ‘కొండపొలం’  ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాను చూసి చిత్ర యూనిట్‌ను ప్రత్యేక అభినందించారు. భావోద్వేగాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందని కొనియాడారు.

    ఈ రోజు విడుదలైన ‘కొండపొలం’ సినిమాకు సోషల్ మీడియా వేదికగా మంచి రెస్ఫాన్స్ వచ్చింది. ఇక ‘ఉప్పెన’ సినిమా అనుకున్న దానికంటే 3 రెట్లు ఎక్కువగా  వసూళ్లు సాధించినప్పటికీ ‘కొండపొలం’ సినిమాకు అనుకున్నంత రేంజ్‌లో బిజినెస్ కాలేదు. ఈ సినిమా తెలంగాణ (నైజాం)లో రూ. 3 కోట్ల బిజినెస్ చేసింది. ఆంధ్రలో రూ. 3 కోట్లకు అమ్ముడుపోయింది. సీడెడ్ (రాయలసీమ)లో రూ. 90 లక్షలకు అమ్ముడపోయింది.

    Kondapolam - Chiranjeevi : కొండపొలం సినిమాను చూసిన చిరంజీవి.. క్రిష్, వైష్ణవ్ తేజ్‌కు మెగాస్టార్ అభినందనలు..


    తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రెండు కలిపి రూ. 6. 90 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా .. ఓవర్సీస్, రెస్టాఫ్ ఇండియా కలిపి రూ. 0.85 కోట్ల బిజినెస్ చేసింది. ఓవరాల్‌గా రూ. 7.75 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 8 కోట్లు రాబట్టాలి. ప్రస్తుతం ఈ సినిమాకు అనుకున్నంత రేంజ్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ లేవు. టాక్ బాగుండటంతో ఈ సినిమా పుంజుకుంటుందా లేదా అనేది చూడాలి. ఇక ఈ సినిమాను కుటుంబ సభ్యులతో కలిసి చూసిన మెగాస్టార్ చిరంజీవి.. అద్భుతమైన సినిమా అంటూ మెచ్చుకున్నారు.









    మరోవైపు వరుణ్ తేజ్ ఈ చిత్ర యూనిట్‌కు ప్రత్యేక అభినందనలు తెలియజేసారు. ఇక కొండపొలం కథ విషయానికి వస్తే.. ఈ సినిమా ఓ ఫేమస్ నవల ఆధారంగా తెరకెక్కింది. ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన కొండపొలం అనే నవల ఆధారంగా రూపోందించారు దర్శకుడు క్రిష్. రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించారు. ఈ నవలను సినిమాగా తెరకెక్కించేందుకు కథలో కొన్ని మార్పులను చేసినట్టు క్రిష్ మీడియాకు తెలిపారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Kondapolam, Krish, Rakul Preet Singh, Vaishnav tej

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు