హోమ్ /వార్తలు /సినిమా /

Kondapolam Review : కొండపొలం రివ్యూ.. బతుకు కోసం చేసే పోరాటం..

Kondapolam Review : కొండపొలం రివ్యూ.. బతుకు కోసం చేసే పోరాటం..

Kondapolam Review Photo : Twitter

Kondapolam Review Photo : Twitter

Kondapolam Review :మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej ) బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆయన తన రెండో సినిమాను క్రిష్ దర్శకత్వంలో చేశారు.

ఇంకా చదవండి ...

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej ) బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆయన తన తొలి సినిమా ఉప్పెన రిలీజ్ కాకముందే తన నెక్స్ట్ సినిమాను కూడా పూర్తి చేశారు. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఈ కొండపొలం (Kondapolam) ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని అక్టోబర్ 8న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉంది.. కథేంటీ.. కథనం ఎలా సాగింది.. ఈ సినిమా తెలగువారిని ఎంతవరకు ఆకట్టుకోలదు.. మొదలగు అంశాలను రివ్యూలో చూద్దాం..

నటీనటులు: పంజా వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్

సినిమాటోగ్రఫీ: జ్ఞాన శేఖర్

సంగీత దర్శకుడు: ఎంఎం కీరవాణి

ఎడిటర్: శ్రావన్ కటికనేని

నిర్మాతలు: సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి

దర్శకుడు: క్రిష్ జాగర్లమూడి

కథ:

కొంతమంది దర్శకులు కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటారు. క్రిష్ జాగర్లమూడి కూడా ఇదే జాబితాలోకి వస్తాడు. రొటీన్ కి భిన్నంగా ఉండేలా తన సినిమాలు ప్లాన్ చేసుకుంటాడు క్రిష్. ఇప్పుడు కొండపొలం కూడా ఇలాంటి సినిమానే. నవలను సినిమాగా తీయాలంటే అంత చిన్న విషయం కాదు. ఏ మాత్రం గాడి తప్పినా సినిమా ఫలితమే మారిపోతుంది. కొండపొలం సినిమా విషయంలో ఇదే జరిగిందేమో అనిపించింది. బహుశా ఇది కథగా చదివినప్పుడు చాలా అద్భుతంగా అనిపిస్తుందేమో. గొర్రెలు కాసుకునే కుటుంబం నుంచి వచ్చిన కుర్రాడు.. ఎన్నో కష్టాలు ఎదుర్కొని జీవితంలో అత్యున్నత స్థాయికి చేరడం పుస్తకంలో బాగుంటుంది. కానీ తెరపై విజువల్ గా చూడడంలో మాత్రం అంత ఆసక్తికరంగా అనిపించలేదు. రెండు గంటలు అడవిలోనే ఉండిపోవడం.. గొర్రెల కాపరులు వాటిని కాపాడుకోవడానికి పడే ఆరాటం.. మధ్యలో వాళ్ల బతుకు కోసం చేసే పోరాటం..

కథనం:

ఇవన్నీ బాగున్నాయి కానీ.. సినిమాలో ఉండాల్సిన ఇంకేదో సోల్ మిస్సయింది అనిపిస్తుంది. అక్కడ చెప్పడానికి కథ చిన్నగా ఉండడంతో క్రిష్ కూడా ఏం చేయలేకపోయాడు. పైగా స్లో నేరేషన్ సినిమాకు మైనస్ అయ్యింది. అక్కడక్కడా ఆసక్తికరమైన సన్నివేశాలున్నాయి కానీ అవి సినిమాను నిలబెట్టేలా లేవు. ఇంటర్వెల్ ఫైట్ సీన్.. పులితో వచ్చే సన్నివేశాలు విజువల్ గా ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్, సెకండాఫ్ అని తేడా లేకుండా సినిమా అంతా నెమ్మదిగా సాగుతుంది.

నటీనటులు:

ఉప్పెన మాదిరే వైష్ణవ్ తేజ్ మరోసారి సైలెంట్ యాక్టింగ్ తో పర్వాలేదనిపించాడు. ఓబులమ్మగా రకుల్ ప్రీత్ సింగ్ ఆకట్టుకుంటుంది. హీరో తండ్రి పాత్రలో సాయి చంద్ చాలా బాగా నటించాడు.

టెక్నికల్ టీమ్:

ఎం ఎం కీరవాణి సంగీతం ఆకట్టుకుంటుంది కానీ ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా సినిమాలను గుర్తుకు తెస్తుంది. ఓ మంచి నవలను సినిమాగా తెరకెక్కించడానికి క్రిష్ చాలా కష్టపడ్డాడు. ఇది సినిమా కంటే నవలగానే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే పుస్తకంలో చదివి ప్రతి విషయం తెరపై చూపించడం అనేది సాధ్యం కాదు. అలా ఒక నవల చదువుతున్నప్పుడు మన మనసులో ఎన్నో ఊహలు రంగుల అద్దుకుంటాయి. అంతే విజువల్ వెండి తెరపై కనిపించడం కొన్ని సార్లు జరగదు. కొండపొలం సినిమా కూడా దీనికి మినహాయింపు కాదు. శక్తివంచన లేకుండా కృషి ఎంతో కష్టపడ్డాడు కానీ ఒక సినిమాకు ఉండాల్సిన పూర్తి కమర్షియల్ అంశాలు ఈ కథలో లేవు. అందుకే చదవడానికి మాత్రం అద్భుతంగా అనిపించే కథ.. తెరపై చూడ్డానికి అంత ఆసక్తికరంగా అనిపించలేదు. ఓవరాల్ గా.. కొండపొలం అడవిలో నెమ్మదిగా సాగే బతుకు పోరాటం.

రేటింగ్: 2.75

First published:

Tags: Kondapolam, Rakul Preet Singh, Tollywood news, Vaishnav tej