HOME »NEWS »MOVIE »krish turns down rakul preet request for pawan kalyan movie mnj

Rakul Preet: ర‌కుల్ ప్రీత్‌కి షాక్ ఇచ్చిన క్రిష్.. ఢిల్లీ బ్యూటీ రిక్వెస్ట్‌కి 'నో' చెప్పిన ద‌ర్శ‌కుడు

Rakul Preet: ర‌కుల్ ప్రీత్‌కి షాక్ ఇచ్చిన క్రిష్.. ఢిల్లీ బ్యూటీ రిక్వెస్ట్‌కి 'నో' చెప్పిన ద‌ర్శ‌కుడు
రకుల్ ప్రీత్, క్రిష్

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌(Pawan Kalyan)తో వైవిధ్య ద‌ర్శ‌కుడు క్రిష్‌(Krish) ఓ సినిమాను చేస్తోన్న విష‌యం తెలిసిందే. పౌరాణిక‌ క‌థా నేప‌థ్యంలో ఈ మూవీ తెర‌కెక్కనుంది. ఏఎమ్ ర‌త్నం ఈ మూవీని నిర్మిస్తుండ‌గా.. కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు.

  • Share this:
    Rakul Preet Singh: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో వైవిధ్య ద‌ర్శ‌కుడు క్రిష్‌ ఓ సినిమాను చేస్తోన్న విష‌యం తెలిసిందే. పౌరాణిక‌ క‌థా నేప‌థ్యంలో ఈ మూవీ తెర‌కెక్కనుంది. ఏఎమ్ ర‌త్నం ఈ మూవీని నిర్మిస్తుండ‌గా.. కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ కోసం ఆ మ‌ధ్యన మూవీ యూనిట్ ఒక సెట్ కూడా వేసింది. అయితే భారీ వ‌ర్షాల‌కు ఆ సెట్ కూలిపోగా.. ఇప్పుడు మ‌ళ్లీ దాన్ని నిర్మించే పనిలో ప‌డ్డారు. ఈ ప‌నులు పూర్త‌య్యాక ప‌వ‌న్.. ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొన‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీలో హీరోయిన్‌గా ఎప్ప‌టినుంచో ప‌లువురి పేర్లు వినిపించాయి. ప్ర‌గ్యా జైశ్వాల్‌, నిధి అగ‌ర్వాల్, అనుష్క ఇలా ప‌లు భామ‌ల పేర్లు వినిపించాయి. అంతేకాదు ఈ మూవీ కోసం బాలీవుడ్ బ్యూటీ జాక్వ‌లిన్ ఫెర్నాండెజ్ దాదాపుగా ఫైన‌ల్ అయిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. కానీ దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న ఇంత‌వ‌ర‌కు రాలేదు.

    అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఇందులో హీరోయిన్‌గా చేసేందుకు ర‌కుల్ ప్రీత్ ఆస‌క్తిని చూపార‌ట‌. క్రిష్ తెర‌కెక్కించిన ఎన్టీఆర్ క‌థానాయ‌కుడులో శ్రీదేవి పాత్ర‌లో మెరిసింది ర‌కుల్ ప్రీత్ సింగ్. ఇక ఇప్పుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా క్రిష్ తెర‌కెక్కిస్తోన్న మూవీలో ర‌కుల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ క్ర‌మంలో ప‌వ‌న్ మూవీలో న‌టించేందుకు కూడా ఇంట్ర‌స్ట్ చూపించింద‌ట‌. అయితే కాస్టింగ్ విష‌యంలో ఎప్పుడూ ప‌ర్‌ఫెక్ట్‌గా ఆలోచించే క్రిష్ మాత్రం.. ఆ ఆఫ‌ర్‌కి నో చెప్పార‌ట‌. ఈ క‌థ‌కు సెట్ అయ్యే వారి క్రిష్ సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఈ మూవీలో హీరోయిన్‌గా ఎవ‌రు ఖ‌రారు అయితారో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు ఆగాల్సిందే.



    కాగా మ‌రోవైపు ఈ మూవీ ఆగిపోయిన‌ట్లు ఆ మ‌ధ్య‌న వార్త‌లు వ‌చ్చాయి. సాంకేతిక కార‌ణాల వ‌ల‌న ప‌వ‌న్-క్రిష్ ప్రాజెక్ట్ ఆగిపోయిన‌ట్లు ఫిలింన‌గ‌ర్‌లో టాక్ న‌డిచింది. దానికి తోడు క్రిష్‌- వైష్ణ‌వ్ తేజ్‌తో సినిమా తీస్తుండగా.. ఆ ప్రాజెక్ట్ పూర్తిగా అట‌కెక్కిన‌ట్లు పుకార్లు వినిపించాయి. కానీ ఆ వార్త‌ల‌ను మూవీ యూనిట్ ఖండించింది. వైష్ణ‌వ్ తేజ్‌తో మూవీ పూర్తి కాగానే.. ప‌వ‌న్‌తో క్రిష్ సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్న‌ట్లు స‌మాచారం.
    Published by:Manjula S
    First published:December 28, 2020, 08:07 IST

    टॉप स्टोरीज