తెలుగు ప్రజల ఆరాధ్యదైవం.. ఆంధ్రుల అన్నగారు.. నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా సినిమా అంటే కచ్చితంగా భయం ఉంటుంది. దర్శకుడు ఎవరైనా కూడా ఇంత బాధ్యత తీసుకోవాలంటే ఆలోచించకంటే ముందే భయపడతారు. కానీ ఈ బాధ్యతను తీసుకుని సమర్ధవంతంగా నిర్వర్తించాడు క్రిష్. ఎన్టీఆర్ జీవితం ఆధారంగా సినిమా అంటేనే రెండేళ్లు పడుతుందేమో అనుకున్నారు.. మిగిలిన దర్శకులు అయితే కచ్చితంగా అదే చేసేవాళ్లేమో కానీ క్రిష్ మాత్రం కేవలం నాలుగు నెలల్లోనే సినిమా పూర్తి చేసాడు.

క్రిష్ బాలయ్య ఎన్టీఆర్ స్టిల్స్
ఇంకా మాట్లాడాలంటే రెండు భాగాలు 89 రోజుల్లోనే పూర్తి చేసి ఔరా అనిపించాడు. ఆ లెక్కన ఒక్కో బయోపిక్ కోసం ఆయన తీసుకున్న సమయం కేవలం 44 రోజులు అన్నమాట. ఒకప్పుడు ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ సినిమాను 43 రోజుల్లోనే తీసాడంటే చరిత్రగా చెప్పుకున్నాం కానీ ఇప్పుడు ఆయన జీవిత చరిత్రలో సగాన్ని కేవలం 44 రోజుల్లోనే తీసి చరిత్ర సృష్టించాడు క్రిష్. రెండేళ్ల కింద గౌతమీపుత్ర శాతకర్ణితోనే తన సత్తా చూపించిన ఈ దర్శకుడు.. ఇప్పుడు కథానాయకుడుతో మరోసారి తన సత్తా చూపించారు.

గుండమ్మ కథను రీ క్రియేట్ చేస్తోన్న క్రిష్
ఈ సినిమా చూసిన తర్వాత అభిమానులు గాల్లో తేలిపోతున్నారు. ఈ సినిమాను క్రిష్ తెరకెక్కించిన విధానం చూసి వాళ్లు మురిసిపోతున్నారు. అన్నగారి జీవితాన్ని అంతబాగా అర్థం చేసుకున్న క్రిష్ కు వాళ్లు మనసారా నమస్కారం చేస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా అంత పెద్ద సినిమాను.. అంత మంది స్టార్ క్యాస్ట్.. ఒకే స్క్రీన్ పై చూపించడం అంటే మాటలు కాదు. కానీ అన్నింటినీ అద్భుతంగా చూపించాడు క్రిష్. ముఖ్యంగా నందమూరి తారకరాముడిలోని రెండో కోణాన్ని క్రిష్ అద్భుతంగా అర్థం చేసుకున్నాడు.

ఎన్టీఆర్ కథానాయకుడులో విభిన్న వేషాల్లో బాలకృప్ణ
మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ తనయుడు చనిపోయిన సన్నివేశం.. దివిసీమ ఎపిసోడ్.. తొలిసారి ఎన్టీఆర్ కృష్ణుడిగా వచ్చే సన్నివేశాలు సినిమాలకు హైలైట్. మొత్తానికి కథానాయకుడు వరకు ఎలాంటి అవాంతరాలు లేకుండా పూర్తి చేసాడు క్రిష్.. కానీ అసలు బాధ్యత ముందుంది. మహానాయకుడు కూడా ఇదే స్థాయిలో బాధ్యత పూర్తి చేస్తే.. ఈయన పేరు చిరస్థాయిగా నిలిచిపోవడం ఖాయం.
ఇవి కూడా చదవండి..