HOME » NEWS » movies » KRISH JAGARLAMUDI STARTED NEW MOVIE AND WHAT ABOUT PAWAN KALYAN MOVIE PK

పవన్ కళ్యాణ్‌ను పక్కనబెట్టి క్రిష్ మరో కొత్త సినిమా..

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ కూడా ఓ షెడ్యూల్ అయిన తర్వాత కరోనా కారణంగా..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 14, 2020, 2:42 PM IST
పవన్ కళ్యాణ్‌ను పక్కనబెట్టి క్రిష్ మరో కొత్త సినిమా..
క్రిష్ పవన్ కళ్యాణ్ (krish pawan kalyan)
  • Share this:
పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ కూడా ఓ షెడ్యూల్ అయిన తర్వాత కరోనా కారణంగా ఆగిపోయింది. ఇప్పుడు పవన్ మరో నాలుగు నెలల వరకు షూటింగ్‌కు రాడు. అందుకే ఆయన సినిమాను కాదని మరో సినిమాను పట్టాలెక్కించే పనిలో పడ్డాడు క్రిష్. ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్‌లు కూడా చేస్తున్నాడు ఈ దర్శకుడు. ఎన్టీఆర్ లాంటి డిజాస్టర్ తర్వాత కూడా వరసగా సినిమాలు చేస్తున్నాడు క్రిష్.
క్రిష్ పవన్ కళ్యాణ్ (krish pawan kalyan)
క్రిష్ పవన్ కళ్యాణ్ (krish pawan kalyan)


ఈయనకు మంచి అవకాశాలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ సినిమా వచ్చింది. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో పవన్ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో కోహినూర్ వజ్రం నేపథ్యం ఉండబోతుందని తెలుస్తుంది. ఏఎం రత్నం ఈ సినిమాను దాదాపు 100 కోట్లతో నిర్మిస్తున్నాడు. తెలుగుతో పాటు మిగిలిన భాషల్లోనూ ఈ చిత్రం విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు.
క్రిష్ వైష్ణవ్ తేజ్ (krish vaishnav tej)
క్రిష్ వైష్ణవ్ తేజ్ (krish vaishnav tej)

ఇదిలా ఉంటే కరోనా కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడటంతో మరో సినిమాను కూడా మొదలు పెట్టేసాడు ఈ దర్శకుడు. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో కొత్త సినిమా మొదలైంది. ఫారెస్ట్ నేపథ్యంలో ఈ చిత్ర షూటింగ్ జరగనుంది. నాన్ స్టాప్ షెడ్యూల్ మొదలు పెట్టబోతున్నాడు క్రిష్. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించబోతుంది. నవంబర్ నుంచి పవన్ కళ్యాణ్‌ సినిమాతో మళ్లీ బిజీ కానున్నాడు క్రిష్.
Published by: Praveen Kumar Vadla
First published: August 14, 2020, 2:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading