Krack Twitter Review: రవితేజ ‘క్రాక్’ మూవీ ట్విట్టర్ రివ్యూ.. ఇంతకీ ఎలా ఉందంటే..

రవితేజ ‘క్రాక్’ మూవీ ట్విట్టర్ రివ్యూ (Twitter/Photo)

Krack Twitter Review: మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం క్రాక్‌. సంక్రాంతి కానుకగా విడదలైన క్రాక్ సినిమా విడుదలైంది. మరి ఈ సినిమా ఫస్ట్ ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే..

  • Share this:
    Krack Twitter Review: మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం క్రాక్‌. డాన్‌ శీను, బ‌లుపు లాంటి సినిమాల తర్వాత మరోసారి ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న హాట్రిక్ సినిమా ఇది. కరోనా లాక్‌డౌన్ అనంతరం దాదాపు 9 నెలల తర్వాత ఒక బడా హీరో నటించిన సినిమా డైరెక్ట్‌గా థియేటర్స్‌లో విడుదలైంది. మరోవైపు కొత్త యేడాదిలో సంక్రాంతి బరిలో ప్రేక్షకుల మందుకు వస్తోన్న మొదటి చిత్రం రవితేజ ‘క్రాక్’. రవితేజ మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.  వరస ఫ్లాపులతో ఉన్న రవితేజ కెరీర్‌కు ఈ చిత్రం డూ ఆర్ డై గా మారిపోయింది. అప్పట్లో వరస డిజాస్టర్స్‌తో పూర్తిగా ఇమేజ్ పడిపోతున్న సమయంలో రవితేజతో బలుపు సినిమా చేసి హిట్ ఇచ్చాడు గోపీచంద్ మలినేని.

    మరోసారి ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు రవితేజ. దాంతో ఇప్పుడు కూడా ఇదే చేస్తాడని నమ్ముతున్నారు రవితేజ అభిమానులు. కొత్త యేడాది కానుకగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రవితేజ పోతరాజు వీర శంకర్‌గా అదరగొట్టాడు. ఇక ఇతర పాత్రల్లో సీనియర్ నటులు సముద్ర ఖని, వరలక్ష్మి శరత్ నటించారు. ఈ సినిమా యూఎస్ సహా పలు ప్రాంతాల్లో రిలీజై మంచి టాక్‌నే సొంతం చేసుకున్నట్టు ట్విట్టర్‌ రివ్యూలో పేర్కొన్నారు.




    విక్రమార్కుడు తర్వాత మరోసారి పోలీస్ ఆఫీసర్‌గా తన మార్క్ చూపించినట్టు ఆడియన్స్ పేర్కొంటున్నారు.


    చాలా యేళ్ల తర్వాత రవితేజ నటించిన సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.


    సినిమాలో రవితేజ విలన్స్ మధ్య సన్నివేశాలు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయట. విలన్స్‌తో ఇంట్రాక్షన్..పోరాటాలు హైలెట్ అని పేర్కొంటున్నారు.


    రవితేజ, శృతి హాసన్‌తో పాటు మిగతా హీరోయిన్స్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు బాగున్నాయట.



    మొత్తంగా ట్విట్టర్‌లో ఎక్కువగా రవితేజ .. క్రాక్ మూవీకి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. అసలు టాక్ ఏంటో తెలియాంటే ఇంకొన్ని గంటల వరకు వెయిట్ చేయాల్సిందే. మరికొన్ని గంటల్లో అసలు రివ్యూతో మీ ముందుకు వస్తాం.


    కరోనా లాక్‌డౌన్ థియేటర్స్ రీ ఓపెన్ తర్వాత రంగంలోకి రవితేజకు క్రాక్ సినిమాతో ఎలాంటి మాయ చేస్తాడో చూడాాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: