Krack Movie First Day Collections:రవితేజ ’క్రాక్’ ఫస్ట్ డే కలెక్షన్స్.. బాక్సాఫీస్ దగ్గర మాస్ మహారాజ్ మేనియా..

రవితేజ క్రాక్ పోస్టర్ (Ravi Teja Krack poster)

Krack Movie First Day Collections:  మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ లేటెస్ట్ మూవీ ‘క్రాక్’. ఈ చిత్రంలో రవి తేజ మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఇరగదీసాడు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఫస్ట్ డే ఎంత మేరకు వసూళ్లను రాబట్టిందంటే..

  • Share this:
    Krack Movie First Day Collections:  మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ లేటెస్ట్ మూవీ ‘క్రాక్’. ఈ చిత్రంలో రవి తేజ మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఇరగదీసాడు. కరోనా తర్వాత ప్రభుత్వం థియేటర్స్‌ తెరుచుకోవడానికి పర్మిషన్స్ ఇచ్చిన దాదాపు అందరు హీరోలు వేచి చూద్దామనే ధోరిణిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో దాదాపు  9 నెలల తర్వాత ఒక బడా హీరో నటించిన సినిమా డైరెక్ట్‌గా థియేటర్స్‌లో విడుదలైంది. మరోవైపు కొత్త యేడాదిలో సంక్రాంతి బరిలో ప్రేక్షకుల మందుకు వస్తోన్న మొదటి చిత్రం రవితేజ ‘క్రాక్’. వరస ఫ్లాపులతో ఉన్న రవితేజ కెరీర్‌కు ఈ చిత్రం డూ ఆర్ డై గా మారిపోయింది. అప్పట్లో వరస డిజాస్టర్స్‌తో పూర్తిగా ఇమేజ్ పడిపోతున్న సమయంలో రవితేజతో బలుపు సినిమా చేసి హిట్ ఇచ్చాడు గోపీచంద్ మలినేని. ఐతే.. మొదటి రోజు ఈ సినిమా కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లెమ్స్‌తో విడుదల కాలేకపోయింది. ఐతే.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినా.. చాలా చోట్ల ఫస్ట్ షో నుంచి తెరపై బొమ్మపడింది. ఇక ఆదివారం పూర్తి స్థాయిలో విడుదలైన ఈ చిత్రానికి మంచి వసూళ్లనే రాబట్టినట్టు బాక్సాఫీస్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. పూర్తి స్థాయి రిపోర్ట్స్ రావాల్సి ఉంది. 

    ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 8 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్ అన్ని కలిసి దాదాపు రూ. 10 కోట్ల వరకు డీసెంట్ కలెక్షన్స్‌ను శనివారం, ఆదివారం కలిపి వచ్చాయి. మొత్తంగా ఈ సినిమా 50 శాతం ఆక్యుపెన్షీతో ఈ స్థాయి వసూళ్లు రాబట్టం చూసి సినీ ట్రేడ్ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. మారుమూల గ్రామాల్లో విలేజ్‌లలో బయట 50 శాతం సీటింగ్ అని చెబుతున్నా.. మిగతా 50 శాతం కలెక్షన్స్‌ను తమ జేబులో వేసుకుంటున్నారనే టాక్ వినబడుతోంది. మొత్తంగా రవితేజ... సంక్రాంతి బరిలో ముందు వరుసలో నిలిచి మిగతా హీరోలకు ప్రేరణగా నిలిచారు. మొత్తంగా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మొత్తంగా సంక్రాంతి సీజన్‌లో ఎంత మేరకు రాబడుతుందో చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: