హోమ్ /వార్తలు /సినిమా /

Krack Movie: మరో వివాదంలో క్రాక్.. రచ్చకెక్కిన డైరెక్టర్ గోపీచంద్.. సూపర్ హిట్ ఇచ్చినా..

Krack Movie: మరో వివాదంలో క్రాక్.. రచ్చకెక్కిన డైరెక్టర్ గోపీచంద్.. సూపర్ హిట్ ఇచ్చినా..

Krack Movie: సూపర్ హిట్ మూవీ అనిపించుకున్నా.. క్రాక్ మూవీని ఆర్థిక పరమైన ఇబ్బందులు వదలడం లేదని తెలుస్తోంది.

Krack Movie: సూపర్ హిట్ మూవీ అనిపించుకున్నా.. క్రాక్ మూవీని ఆర్థిక పరమైన ఇబ్బందులు వదలడం లేదని తెలుస్తోంది.

Krack Movie: సూపర్ హిట్ మూవీ అనిపించుకున్నా.. క్రాక్ మూవీని ఆర్థిక పరమైన ఇబ్బందులు వదలడం లేదని తెలుస్తోంది.

  సినిమాకు సంబంధించి ఎన్ని వివాదాలు ఉన్నా.. హిట్ వస్తే అవన్నీ మాయమైపోతాయనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. అయితే రవితేజ క్రాక్ మూవీ విషయంలో మాత్రం ఇలా జరగడం లేదు. సంక్రాంతి బరిలో నిలిచి సూపర్ హిట్ అనిపించుకున్న ఈ సినిమా మంచి వసూళ్లు సాధించింది. అన్నింటికి మించి మంచి సినిమా వస్తే.. కరోనాను లెక్కచేయకుండా ఆడియెన్స్ ధియేటర్‌కు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని క్రాక్ మూవీ నిరూపించింది. అయితే నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య నెలకొన్న ఆర్థికపరమైన వివాదాల కారణంగా ఈ సినిమా విడుదలలో జాప్యం జరిగింది. దీంతో చిత్ర నిర్మాత తీరుపై హీరో రవితేజ ఆగ్రహం వ్యక్తం చేశారని.. త్వరగా సినిమా ఆడియెన్స్ ముందుకు వచ్చేలా చూడాలని చెప్పారని వార్తలు వచ్చాయి. ఎలాగోలా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్ హిట్ అనిపించుకుంది. ఓటీటీలోనూ రిలీజ్‌కు రెడీ అయ్యింది. అయితే ఇంతవరకు వచ్చినా.. ఈ సినిమాను వివాదాలు వదలడం లేదు. తాజాగా ఈ సినిమా నిర్మాత ఠాగూర్ మధు మరో వివాదంలో చిక్కుకున్నారు.

  క్రాక్ సినిమాకు సంబంధించి తనకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ రెమ్యూనరేషన్‌ను ఠాగూర్ మధు ఇవ్వలేదంటూ క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్‌కి ఫిర్యాదు చేయడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై చర్యలు తీసుకుని తనకు రావాల్సిన బ్యాలెన్స్ రెమ్యూనరేషన్ ఇప్పించేలా చూడాలని దర్శకుడు గోపీచంద్ మలినేని తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ అసోసియేషన్‌ను కోరాడు.

  గోపీచంద్ మలినేని

  గోపీచంద్ మలినేని ఫిర్యాదు తీసుకున్న డైరెక్టర్స్ అసోసియేషన్.. దీనిపై చర్యలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. సాధ్యమైనంత తొందరగా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ఆలోచనలో తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్‌ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

  First published:

  Tags: Gopichand malineni, Krack, Raviteja

  ఉత్తమ కథలు