Ravi Teja Krack: సంక్రాంతి హీరో అనిపించిన రవితేజ.. పండక్కి మరో బ్లాక్‌బస్టర్..

రవితేజ క్రాక్ కలెక్షన్స్ (Ravi Teja Krack)

Ravi Teja Krack: చాలా అంటే చాలా రోజుల తర్వాత మాస్ రాజా మళ్లీ బాక్సాఫీస్ దగ్గర గర్జిస్తున్నాడు. ఈయన సినిమాలు వచ్చినవి వచ్చినట్లు కొన్నేళ్లుగా అలా వెళ్లిపోతున్నాయి. చివరగా రాజా ది గ్రేట్ మాత్రమే విజయం సాధించింది.

  • Share this:
చాలా అంటే చాలా రోజుల తర్వాత మాస్ రాజా మళ్లీ బాక్సాఫీస్ దగ్గర గర్జిస్తున్నాడు. ఈయన సినిమాలు వచ్చినవి వచ్చినట్లు కొన్నేళ్లుగా అలా వెళ్లిపోతున్నాయి. చివరగా రాజా ది గ్రేట్ మాత్రమే విజయం సాధించింది. ఇన్నేళ్ళ తర్వాత మళ్లీ ఈయన సంచలన విజయం దిశగా అడుగులేస్తున్నాడు. తాజాగా ఈయన నటించిన క్రాక్ సినిమాకు వసూళ్ల వర్షం కురుస్తుంది. కేవలం 50 శాతం ఆక్యుపెన్సీతోనే తొలిరోజు 6.25 కోట్ల షేర్ వసూలు చేసింది క్రాక్. ఒకవేళ ఫుల్ ఆక్యుపెన్సీ ఉండుంటేనా కచ్చితంగా 10 కోట్లకు పైగా షేర్ వసూలు చేసేది క్రాక్. ట్రైలర్‌లోనే చెప్పినట్లు ష్యూర్ షాట్.. నో డౌట్.. బాక్సాఫీస్ పగిలిపోయిందంతే. మాస్ ఆడియన్స్‌తో పాటు రవితేజ ఫ్యాన్స్ కూడా క్రాక్ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే సంక్రాంతి పండగ ముందు నుంచి కూడా రవితేజకు బాగానే కలిసొచ్చింది. అచ్చొచ్చిన పండక్కి వచ్చి రచ్చ చేస్తున్నాడు రవితేజ. 13 ఏళ్ళ కింద ఈయన సంక్రాంతి ప్రయాణం మొదలైంది. వివి వినాయక్ తెరకెక్కించిన కృష్ణ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు రవితేజ. బాలయ్య ఒక్క మగాడు సినిమాకు పోటీగా వచ్చిన కృష్ణ.. ఔట్ రేటెడ్‌గా బాక్సాఫీస్ బాద్ధా అనిపించుకున్నాడు.
ravi teja sankranti hero,krack movie collections,krack movie review,krack movie public talk,krack movie first day collections,krack movie first day box office collections,krack movie collection,krack box office collection,krack 1st day collections,krack box office collections,krack movie 1st day collections,ravi teja krack movie,krack 1st day box office collections,krack first day collections,krack movie box office collection,రవితేజ క్రాక్,క్రాక్ కలెక్షన్స్,రవితేజ సంక్రాంతి హీరో
రవితేజ క్రాక్ కలెక్షన్స్ (Ravi Teja Krack)

యాక్షన్ కామెడీగా వచ్చిన ఈ చిత్రం 22 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఆ తర్వాత 2010లో శంభో శివ శంభో సినిమాతో వచ్చినా కూడా అది వర్కవుట్ కాలేదు. కానీ వెంటనే 2011లో మిరపకాయ్ ఘాటెంతో చూపించి హిట్ కొట్టాడు మాస్ రాజా. హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం 20 కోట్లకు పైగానే వసూలు చేసింది. ఈ రెండుసార్లు కూడా బాలయ్యను ఓడించాడు రవితేజ. కృష్ణకు ఒక్క మగాడు.. మిరపకాయ్ సినిమాకు పరమవీరచక్ర సినిమాలు పోటీగా వచ్చాయి.
ravi teja sankranti hero,krack movie collections,krack movie review,krack movie public talk,krack movie first day collections,krack movie first day box office collections,krack movie collection,krack box office collection,krack 1st day collections,krack box office collections,krack movie 1st day collections,ravi teja krack movie,krack 1st day box office collections,krack first day collections,krack movie box office collection,రవితేజ క్రాక్,క్రాక్ కలెక్షన్స్,రవితేజ సంక్రాంతి హీరో
రవితేజ క్రాక్ కలెక్షన్స్ (Ravi Teja Krack)

ఈ రెండు సార్లు విజయం సాధించాడు రవితేజ. ఇప్పుడు చాలా ఏళ్ళ తర్వాత మళ్లీ సంక్రాంతికి వచ్చి సంచలనం రేపుతున్నాడు రవితేజ. క్రాక్ జోరు చూస్తుంటే కచ్చితంగా 30 కోట్ల వరకు షేర్ వసూలు చేసేలా కనిపిస్తుంది. ఇదే కానీ జరిగితే మిగిలిన దర్శక నిర్మాతలు పండగ చేసుకుంటారు. ఎందుకంటే మునపటి రోజులు మళ్లీ వచ్చినట్లే. ఏదేమైనా కూడా పండక్కి వచ్చి బాక్సాఫీస్ దగ్గర క్రాక్ పుట్టిస్తున్నాడు రవితేజ.
Published by:Praveen Kumar Vadla
First published: