హోమ్ /వార్తలు /సినిమా /

Ravi Teja Krack 1st Week collections: ‘క్రాక్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. మోత మోగించిన రవితేజ..

Ravi Teja Krack 1st Week collections: ‘క్రాక్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. మోత మోగించిన రవితేజ..

రవితేజ క్రాక్ సినిమా (Ravi Teja Krack)

రవితేజ క్రాక్ సినిమా (Ravi Teja Krack)

Ravi Teja Krack 1st Week collections: రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ సినిమా కలెక్షన్స్ విషయంలో కిరాక్ పుట్టిస్తుంది. ఈ చిత్రంతో చాలా ఏళ్ళ తర్వాత బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేస్తున్నాడు మాస్ రాజా. సంక్రాంతి సీజన్‌లో పర్ఫెక్ట్ మాస్ సినిమా వస్తే కలెక్షన్స్ ఎలా వస్తాయో ఈ సినిమా నిరూపిస్తుంది.

ఇంకా చదవండి ...

రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ సినిమా కలెక్షన్స్ విషయంలో కిరాక్ పుట్టిస్తుంది. ఈ చిత్రంతో చాలా ఏళ్ళ తర్వాత బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేస్తున్నాడు మాస్ రాజా. సంక్రాంతి సీజన్‌లో పర్ఫెక్ట్ మాస్ సినిమా వస్తే కలెక్షన్స్ ఎలా వస్తాయో ఈ సినిమా నిరూపిస్తుంది. క్రాక్ వచ్చిన రోజు నుంచి కలెక్షన్స్ కిరాక్ పుట్టిస్తుంది. ప్యాండమిక్ కారణంగా 50 శాతం ఆక్యుపెన్సీతోనే ఓపెన్ అయిన క్రాక్ రెండో రోజే 6.25 కోట్ల షేర్.. 10 కోట్లకు పైగా గ్రాస్ (తొలి రోజు నైట్ షోస్ మాత్రమే పడ్డాయి) వసూలు చేసింది. ఇదిలా ఉంటే ఆ తర్వాత కూడా వరసగా దూకుడు చూపిస్తూనే ఉన్నాడు మాస్ రాజా. ఇప్పటి వరకు వారం రోజుల్లోనే ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 21 కోట్ల షేర్ వసూలు చేసింది. కరోనా టైమ్ కదా కాస్త తక్కువగా వస్తాయేమో వసూళ్లు అనుకుంటే.. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ట్రేడ్‌కు కూడా షాక్ ఇస్తూ దూసుకుపోతుంది. పండగ సీజన్ కావడం.. పాజిటివ్ టాక్ రావడంతో పిచ్చెక్కిస్తున్నాడు రవితేజ. కిరాక్ మాస్ పర్ఫార్మెన్స్‌తో క్రాక్ రేపుతున్నాడు. వింటేజ్ రవితేజ ఈజ్ బ్యాక్ అంటూ పండగ చేసుకుంటున్నారు ఆయన డై హార్డ్ ఫ్యాన్స్. డాన్ శీను, బలుపు సినిమాల తర్వాత గోపీచంద్ మలినేని ఈ సినిమాతో హ్యాట్రిక్ పూర్తి చేసాడు. ముందు నుంచి చెప్తున్నట్లుగానే రవితేజతో తన స్టామినా చూపించాడు గోపీచంద్. ఈ సినిమాకు రామ్ లక్ష్మణ్ డిజైన్ చేసిన ఫైట్స్ కూడా కారణమే. విడుదలైన 7వ రోజు కూడా ఈ చిత్రం 2.03 కోట్లు షేర్ తీసుకొచ్చిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

ravi teja krack movie,krack movie first week collections,krack movie 1st week collections,krack movie 7 days collections,krack movie box office collection,krack movie 7th day collections,krack box office collection,krack box office collections,క్రాక్,క్రాక్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్,రవితేజ క్రాక్ 7 డేస్ కలెక్షన్స్
రవితేజ క్రాక్ (Ravi Teja Krack)

కేవలం 50 శాతం ఆక్యుపెన్సీతోనే అనే విషయం గుర్తు పెట్టుకోవాలి. థియేటర్స్ ఎక్కువ ఉండటంతో కలెక్షన్స్ కూడా భారీగానే వస్తున్నాయి. అదే కానీ 100 శాతం ఆక్యుపెన్సీ కానీ ఉండుంటే క్రాక్ కలెక్షన్స్‌లో రవితేజ కెరీర్‌లోనే కిరాక్ పుట్టించేది. వారం రోజుల వసూళ్లు ఇలా ఉన్నాయి..

2వ రోజు (తొలి రోజు నైట్ షోస్ కలిపి): 6.25 కోట్లు

3వ రోజు: 3.15 కోట్లు

4వ రోజు: 2.86 కోట్లు

5వ రోజు: 2.65 కోట్లు

6వ రోజు: 2.17 కోట్లు

7వ రోజు: 2.01 కోట్లు

వారం రోజుల కలెక్షన్స్: దాదాపు 21 కోట్లు షేర్

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Box Office Collections, Krack, Ravi Teja, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు