హోమ్ /వార్తలు /సినిమా /

Raghavendra Rao: షో రన్నర్‌గా రాఘవేంద్రరావు.. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌లో గ్రీష్మ స్ట్రీమింగ్

Raghavendra Rao: షో రన్నర్‌గా రాఘవేంద్రరావు.. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌లో గ్రీష్మ స్ట్రీమింగ్

K Raghavendra Rao Photo Twitter

K Raghavendra Rao Photo Twitter

వాసుదేవ రావు, హర్షిత, శిరీష, అవోన్ స్కైస్ కీలక పాత్రల్లో నటిస్తున్న వెబ్ సిరీస్ గ్రీష్మ. ఈ షో కు ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు షో రన్నర్ గా వ్యవహరిస్తూ నిర్మాణ బాధ్యతలు వహిస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

వాసుదేవ రావు, హర్షిత, శిరీష, అవోన్ స్కైస్ కీలక పాత్రల్లో నటిస్తున్న వెబ్ సిరీస్ గ్రీష్మ. ఈ షో కు ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు (Kovelamudi Raghavendra Rao) షో రన్నర్ గా వ్యవహరిస్తూ నిర్మాణ బాధ్యతలు వహిస్తున్నారు. పది వారాల ఈ వెబ్ సిరీస్ లో 80 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఓ న్యూస్ ఛానెల్ నేపథ్యంగా ఇద్దరు మహిళల మైండ్ గేమ్ సాగే ఈ కథ ఆద్యంతం ఆసక్తికరంగా సాగనుంది. ఇతర భాషల్లో ఈ ఫార్మాట్ ఇప్పటికే మంచి విజయాన్ని సాధించింది. తొలిసారి ఈ టైప్ షోను తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ఓటీటీ.

ఈ కథ విషయానికొస్తే.. తన తండ్రి మృతికి కారణమయిన గ్రీష్మపై వర్ష ఎలా రివేంజ్ తీర్చుకుంటుంది. ఇద్దరు అమ్మాయిల మధ్య మైండ్ గేమ్ లో తర్వాత ఏం జరిగింది అనేది ఆసక్తికరంగా ఉండనుంది. ఈ వెబ్ సిరీస్ లో ఇతర పాత్రల్లో కాజల్, యుువరాజ్, మేఘన, ఝాన్సీ రాథోడ్, ధర్మ దోనెపూడి, జశ్వంత్, సూరజ్ రెడ్డి మువ్వ, కరుణ భూషన్, వినాయక్ తదితరులు నటిస్తున్నారు.

తెలుగు సినిమాకు కమర్షియల్ సొబగులు అద్దిన దర్శకుడు రాఘవేంద్ర రావు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తెలుగు మూవీని అందమైన దృశ్యకావ్యంగా తీర్చిదిద్దిన ఘనుడు ఈ దర్శకేంద్రుడు. ఆయన స్టైల్ డిఫరెంట్.. ఆప్రోచ్ డిఫరెంట్ .. మేకింగ్లో వెరైటీ. హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో ఆయన రూటే సెపరేటు. ఇక హీరోయిన్ ను గ్లామరస్ గా చూపించడంలో కే.రాఘవేంద్రరావు తర్వాతే ఎవరైనా.

భక్తి చిత్రాలను తీసి ప్రేక్షకులను పరవశింపజేసారు రాఘవేంద్ర రావు. శతాధిక చిత్రాల దర్శకుడిగా తన మార్క్ చూపిస్తూ ఇప్పటికీ ప్రేక్షక మన్ననలు పొందుతున్న ఆయన.. రీసెంట్ గా కెమెరా ముందుకొచ్చి తనలోని మరో టాలెంట్ చూపించారు. ప్రస్తుతం టెక్నాలజీతో పోటీ పడుతూ నవతారాన్ని కూడా ఎంటర్ టైన్ చేసేలా డిఫరెంట్ దారుల్లో వెళుతున్నారు. కాగా..'నేను సినిమాకి రాసుకున్న ప్రేమలేఖ' అనే పేరుతో ఓ బుక్ రాశారు రాఘవేంద్రుడు. తన స్వహస్తాలతో రాసిన ఈ పుస్తకంలో తన సినీ ప్రయాణం తాలూకు జ్ఞాపకాలు, అనుభవాలు పంచుకున్నారు.

Published by:Sunil Boddula
First published:

Tags: Hot star, K. Raghavendra Rao, Tollywood

ఉత్తమ కథలు