హోమ్ /వార్తలు /సినిమా /

Vaishnav tej: రంగరంగ వైభవంగా.. మెగా మేనల్లుడి రొమాంటిక్ సాంగ్ వైరల్

Vaishnav tej: రంగరంగ వైభవంగా.. మెగా మేనల్లుడి రొమాంటిక్ సాంగ్ వైరల్

Ranga Ranga Vaibhavamga (Photo Twitter)

Ranga Ranga Vaibhavamga (Photo Twitter)

Ranga Ranga Vaibhavamga: వైష్ణవ్ మూడో సినిమాగా రంగరంగ వైభవంగా మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ చిత్రం నుంచి ఓ రొమాంటిక్ సాంగ్ వదిలారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఉప్పెన (Uppena) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ (Vaishnav Tej).. ఇప్పుడు రంగరంగ వైభవంగా (Ranga Ranga Vaibhavamga) అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సారి మాస్ రోల్ తో ప్రేక్షకులను టచ్ చేయబోతున్నాడు. వైష్ణవ్ మూడో సినిమాగా ఈ మూవీ రాబోతోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అయిన నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా ఈ చిత్రం నుంచి ఓ రొమాంటిక్ సాంగ్ వదిలారు. ఈ వీడియోలో కేతిక శర్మ రొమాంటిక్ మూమెంట్స్ యువతను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ రాశారు. అర్మాన్ మాలిక్, హరి ప్రియ ఆలపించారు.


అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. రీసెంట్ గానే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి (Ranga Ranga Vaibhavamga Trailer) సినిమాపై హైప్ పెంచేశారు. ఈ ట్రైలర్ లో చూపించిన ప్రతి సన్నివేశం కూడా సినిమా పట్ల ఆతృత పెంచేసింది. ఫన్ అండ్ రొమాంటిక్‌గా సాగిన ఈ ట్రైలర్ లో వైష్ణవ్ తేజ్ డైలాగ్స్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి. నైట్ పాప ఒక్కతే ఉంటది అనే డైలాగ్ సినిమాలో రొమాంటిక్ డోస్ దండిగా ఉంటుందని చెప్పింది.


రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బాపినీడు బి సమర్పణలో బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. గిరీశాయ దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. మరోవైపు ఈ సినిమా ఓటీటీ హక్కులను (Aha )ఆహా స్ట్రీమింగ్ సంస్థ భారీ ధరకు దక్కించుకుందని తెలుస్తోంది. ఇది పోస్ట్- థియేట్రికల్ OTT బిజినెస్. సినిమా థియేటర్‌లో విడుదలైన నాలుగు వారాల తర్వాత OTTలో స్ట్రీమింగ్ కానుంది.


ఈ సినిమాలో నరేష్, ప్రభు, తులసి, శ్రీలక్ష్మి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. యూత్ ఆడియన్స్ నచ్చే, మెచ్చే సన్నివేశాలతో ఈ మూవీ రూపొందించారని ఇప్పటివరకు వదిలిన అన్ని అప్‌డేట్స్ కన్ఫర్మ్ చేశాయి. ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్ కెరీర్ మరో మెట్టు ఎక్కుతుందని బలంగా నమ్ముతున్నారు మెగా అభిమానులు.


Published by:Sunil Boddula
First published:

Tags: Tollywood, Tollywood actor, Vaishnav tej

ఉత్తమ కథలు