Kota Srinivasa Rao - Naga Babu : చిరంజీవి, పవన్ లేకపోతే నాగబాబు నథింగ్.. మెగా బ్రదర్ పై కోట శ్రీనివాస రావు సంచలన వ్యాఖ్యలు..

కోట శ్రీనివాస రావు, నాగబాబు (File/Photo)

Kota Srinivasa Rao - Naga Babu : చిరంజీవి (Chiranjeevi), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లేకపోతే నాగబాబు నథింగ్.. మెగా బ్రదర్ నాగబాబు పై కోట శ్రీనివాస రావు సంచలన వ్యాఖ్యలు చేసారు.

  • Share this:
    Kota Srinivasa Rao - Naga Babu : చిరంజీవి (Chiranjeevi), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లేకపోతే నాగబాబు నథింగ్.. మెగా బ్రదర్ నాగబాబు పై కోట శ్రీనివాస రావు సంచలన వ్యాఖ్యలు చేసారు. రీసెంట్‌గా కోట శ్రీనివాస రావుయూట్యూబ్‌ ఛానెల్‌కు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ పలువురు నటీనటులపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. కోట శ్రీనివాస రావు విషయానికొస్తే.. చిరంజీవి హీరోగా నటించిన తొలి మూవీ ‘ప్రాణం ఖరీదు’తో ఫస్ట్ టైమ్ వెండితెరపై మెరిసారు కోట. ఆ తర్వాత గ్యాప్ తీసుకొని టి. కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘వందేమాతరం’ సినిమాతో తిరిగి నటుడిగా రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కోట శ్రీనివాసరావు నటుడిగా వెనుదిరిగి చూసుకోలేదు. అంతేకాదు తెలుగులో ఎలాంటి విలక్షణ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోవడం కోట స్పెషాలిటీ.

    గత కొన్ని రోజులుగా కోట శ్రీనివాస రావు చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. అంతేకాదు జబర్ధస్త్ కామెడీ షో యాంకర్ అనసూయ డ్రెస్సింగ్ పై  కామెంట్స్ చేయడం సంచలనం రేపింది.  అంతేకాదు మొన్నటి మొన్న ‘మా’ ఎన్నికల నేపథ్యంలో ప్రకాష్ రాజ్ .. ఏ రోజు షూటింగ్‌కు టైమ్‌కు రాలేదంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. అంతేకాదు తెలుగు వాళ్లకు మాత్రమే మా అసోసియేషన్ పీఠంపై కూర్చునే హక్కు ఉందంటూ ఆయన చేసిన కామెంట్స్‌పై నాగబాబు లాంటి వాళ్లు విరుచుకుపడ్డారు.

    Chiranjeevi Old Titles: ’రాజా విక్రమార్క’ సహా చిరంజీవి ఓల్డ్ టైటిల్స్‌తో వచ్చిన సినిమాలు ఇవే..

    ఆ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ..   కోటకు రోజు రోజుకు ఏజ్ పెరుగుతోంది. కానీ బుద్ధి మాత్రం పెరగడం లేదు. రేపో మాపో పోయే కోట శ్రీనివాస రావు ఎపుడు మారాతాడంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఈ సందర్భంగా  కోట శ్రీనివాస రావు ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో  నాగబాబు పై విరుచుకుపడ్డారు.

    67th National Film Awards: ధనుశ్, మనోజ్ బాజ్‌పేయ్ సహా ఇప్పటి వరకు జాతీయ అవార్డు అందుకున్న నటులు వీళ్లే..

    నాగబాబు అన్నయ్య చిరంజీవి.. తమ్ముడు పవన్ కళ్యాణ్ లేకపోతే.. ఆయన నథింగ్. ఆయన ఓ నటుడు మాత్రమే అన్నారు. ఒక్క మెగా బ్రదర్ అనే గుర్తింపు తప్ప ఆయన కంటూ ఓ స్థానమే లేదన్నారు. ఈ ఎన్నికల్లో కోట శ్రీనివాస రావు .. మోహన్ బాబు తనయుడు మంచు విష్ణుకు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే కదా. ఈ ఎన్నికల్లో ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు.. ప్రకాష్ రాజ్ పై గెలిచిన సంగతి తెలిసిందే కదా.

    Nagababu-Chiranjeevi: చిరంజీవి హీరోగా నాగబాబు ప్రొడ్యూస్ చేసిన సినిమాలు ఏమిటో తెలుసా..


    కోట శ్రీనివాస రావు విషయానికొస్తే.. ఈయన తెలుగులో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా, విలన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర అంతు చూడటం కోట స్పెషాలిటీ. గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఈయన ఇపుడు వరుసగా పలు యూట్యూబ్ ఛానెల్స్‌కు ఇంటర్వ్యూలు ఇస్తూ పలువురు నటీనటులకు సంబంధించిన అసలు బండారం బయట పెడుతున్నారు. మొత్తంగా కోట శ్రీనివాసరావు చేస్తోన్న వ్యాఖ్యలు ఇండస్ట్రీలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: