హోమ్ /వార్తలు /సినిమా /

Kota-Babu Mohan: కోట శ్రీనివాస రావు, బాబు మోహన్ ఫస్ట్ టైమ్ ఏ చిత్రంలో కలిసి నటించారో తెలుసా..

Kota Srinivasa Rao-Babu Mohan:కోట శ్రీనివాసరావు.. ఈ పేరు విన‌గానే ఆయన పండించే వినోదంలో పెద్దరికం ఉంటుంది. విలనిజంలో రాజసం ఉంటుంది. మరోవైపు బాబు మోహన్ విషయానికొస్తే.. ఈయన కామెడీతో పాటు విలనిజాన్ని తనదైన శైలిలో పండించడం ఈయన నైజం. అలాంటి ఈ ఇద్దరు కలిసి చేసిన కామెడీ టైమింగ్‌కు ప్రేక్షకులకు ఫిదా అయ్యారు. వీళ్లిద్దరు తొలిసారి వెండితెరపై..

ఇంకా చదవండి ...

  Kota Srinivasa Rao-Babu Mohan:కోట శ్రీనివాసరావు.. ఈ పేరు విన‌గానే ఆయన పండించే వినోదంలో పెద్దరికం ఉంటుంది. విలనిజంలో రాజసం ఉంటుంది. క్యారెక్టర్లో 24 క్యారెట్ల మేలిమి పనితనం ఉంటుంది. ఫన్నీరు.. కన్నీరు రెండూ పండించగలిగే అరుదైన నటుడు.. కోట శ్రీనివాసరావు. మరోవైపు బాబు మోహన్ విషయానికొస్తే.. ఈయన కామెడీతో పాటు విలనిజాన్ని తనదైన శైలిలో పండించడం ఈయన నైజం. అలాంటి ఈ ఇద్దరు కలిసి చేసిన కామెడీ టైమింగ్‌కు ప్రేక్షకులకు ఫిదా అయ్యారు. వీళ్లిద్దరు కలిసి దాదాపు 60 పైగా సినిమాల్లో జోడిగా నటించారు. ఒకప్పుడు కోట శ్రీనివాస రావు, బాబు మోహన్ జోడి లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. ఇక కోట శ్రీనివాస రావు 1999లో బీజేపీ తరుపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అదే సమయంలో బాబు మోహన్ కూడా ఆందోళ్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో పాటు చంద్రబాబు క్యాబినేట్‌లో మంత్రిగా పనిచేసారు. ఆ తర్వాత బాబు మోహన్ మరో రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ సంగతి పక్కన పెడితే.. తాజాగా వీళ్లిద్దరు కలిసి ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు.

  ఈ సందర్భంగా వీళ్లిద్దరు తమ సినీ ప్రయాణంలోని మజిలీ గురించి ప్రస్తావించారు. అంతేకాదు వీళ్ల కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమాపై కూడా స్పందించారు. కోట శ్రీనివాస రావు .. చిరంజీవి హీరోగా నటించిన ‘ప్రాణం ఖరీదు’తో తొలిసారి వెండితెరపై మెరిసారు. ఆ తర్వాత గ్యాప్ తీసుకొని టి. కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘వందేమాతరం’ సినిమాతో తిరిగి నటుడిగా రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కోట శ్రీనివాసరావు నటుడిగా వెనుదిరిగి చూసుకోలేదు.

  Kota Srinivasa Rao Babu Mohan First Time act In Venkatesh bobbili raja Movie,Kota Srinivasa Rao,Babu Mohan,Kota Srinivasa Rao Babu Mohan,Kota Srinivasa Rao Babu Mohan First Time act In Venkatesh bobbili raja Movie,Kota Srinivasa Rao Babu Mohan combination first Movie,Kota Srinivasa Rao Babu Mohan bobbili raja,tollywod,Telugu cinema,కోట శ్రీనివాస రావు,బాబు మోహన్,కోట శ్రీనివాస రావు బాబు మోహన్,బాబు మోహన్ కోట శ్రీనివాస రావు కాంబినేషన్,కోట శ్రీనివాస రావు బాబు మోహన్ టాలీవుడ్ సూపర్ హిట్ కాంబినేషన్
  కోట శ్రీనివాస రావు, బాబు మోహన్ (File/Photos)

  అటు బాబు మోహన్ విషయానికోస్తే.. ఈయన కోడి రామకృష్ణ దర్శకత్వంలో ‘ఆహుతి’ సినిమాలో తొలిసారి వెండితెరపై కనిపించారు. ఆ తర్వాత ‘అహనా పెళ్లంట’ సినిమాలో నటించినా.. అందులో కోటతో ఈయనకు కాంబినేషన్ సీన్స్ లేవు. ఆ తర్వాత ‘అంకుశం’ సినిమాలో పొలిటికల్ లీడర్స్‌ను మేనేజ్ చేసే పాత్రలో పాయే అంటూ చేసిన యాక్టింగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత లారీ డ్రైవర్ సినిమా కూడా ఈయనకు మంచి పేరు తీసుకొచ్చింది.

  Kota Srinivasa Rao Babu Mohan First Time act In Venkatesh bobbili raja Movie,Kota Srinivasa Rao,Babu Mohan,Kota Srinivasa Rao Babu Mohan,Kota Srinivasa Rao Babu Mohan First Time act In Venkatesh bobbili raja Movie,Kota Srinivasa Rao Babu Mohan combination first Movie,Kota Srinivasa Rao Babu Mohan bobbili raja,tollywod,Telugu cinema,కోట శ్రీనివాస రావు,బాబు మోహన్,కోట శ్రీనివాస రావు బాబు మోహన్,బాబు మోహన్ కోట శ్రీనివాస రావు కాంబినేషన్,కోట శ్రీనివాస రావు బాబు మోహన్ టాలీవుడ్ సూపర్ హిట్ కాంబినేషన్
  కోట శ్రీనివాస రావు, బాబు మోహన్ (File/Photos)

  ఇక ఈయన కోట శ్రీనివాసరావుతో కలిసి తొలిసారి నటించిన సినిమా వెంకటేష్ హీరోగా నటించిన ‘బొబ్బలి రాజా’. బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తొలిసారి కోట శ్రీనివాస రావు, బాబు మోహన్ కాంబినేషన్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత వీళ్లు ఎక్కువగా ఇవివి సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డి వంటి దర్శకుల చిత్రాల్లో ఎక్కువగా కలిసి నటించారు. మొత్తంగా వెండితెరపై తమ జోడికి తిరుగులేదనిపించారు.

  Kota Srinivasa Rao Babu Mohan First Time act In Venkatesh bobbili raja Movie,Kota Srinivasa Rao,Babu Mohan,Kota Srinivasa Rao Babu Mohan,Kota Srinivasa Rao Babu Mohan First Time act In Venkatesh bobbili raja Movie,Kota Srinivasa Rao Babu Mohan combination first Movie,Kota Srinivasa Rao Babu Mohan bobbili raja,tollywod,Telugu cinema,కోట శ్రీనివాస రావు,బాబు మోహన్,కోట శ్రీనివాస రావు బాబు మోహన్,బాబు మోహన్ కోట శ్రీనివాస రావు కాంబినేషన్,కోట శ్రీనివాస రావు బాబు మోహన్ టాలీవుడ్ సూపర్ హిట్ కాంబినేషన్
  కోట శ్రీనివాస రావు, బాబు మోహన్ (File/Photos)

  వీళ్లిద్దరు తండ్రి కొడుకులుగా.. అన్నదమ్ములుగా.. స్నేహితులుగా..కోట బాస్‌గా నటిస్తే.. అతని అసిస్టెంట్‌గా బాబు మోహన్ ఎన్నో సినిమాల్లో నటించారు. కానీ ఆహ్వానం సినిమాలో మాత్రం కోట శ్రీనివాస రావు .. బాబు మోహన్ అబ్బాయి పాత్రలో నటించడం విశేషం.

  First published:

  Tags: Babu Mohan, Tollywood

  ఉత్తమ కథలు