Kota - Babu Mohan : కోట శ్రీనివాస రావు, బాబు మోహన్ కాంబినేషన్‌లో వచ్చిన ఫస్ట్ మూవీ ఏంటో తెలుసా..

కోట శ్రీనివాస రావు, బాబు మోహన్ (File/Photos)

Kota Srinivasa Rao-Babu Mohan: టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై కోట శ్రీనివాస రావు, బాబు మోహన్ కాంబినేషన్‌కు తిరుగులేదు. వీళ్లిద్దరు తొలిసారి ఏ సినిమాలో జోడిగా నటించారంటే..

  • Share this:
    Kota Srinivasa Rao-Babu Mohan: కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao).. ఈ పేరు విన‌గానే ఆయన పండించే వినోదంలో పెద్దరికం ఉంటుంది. విలనిజంలో రాజసం ఉంటుంది. క్యారెక్టర్లో 24 క్యారెట్ల మేలిమి పనితనం ఉంటుంది. ఫన్నీరు.. కన్నీరు రెండూ పండించగలిగే అరుదైన నటుడు.. కోట శ్రీనివాసరావు. మరోవైపు బాబు మోహన్ (Babu Mohan) విషయానికొస్తే.. ఈయన కామెడీతో పాటు విలనిజాన్ని తనదైన శైలిలో పండించడం ఈయన నైజం. అలాంటి ఈ ఇద్దరు కలిసి చేసిన కామెడీ టైమింగ్‌కు ప్రేక్షకులకు ఫిదా అయ్యారు. వీళ్లిద్దరు కలిసి దాదాపు 60 పైగా సినిమాల్లో జోడిగా నటించారు. ఒకప్పుడు కోట శ్రీనివాస రావు, బాబు మోహన్ జోడి లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. ఇక కోట శ్రీనివాస రావు 1999లో బీజేపీ తరుపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

    అదే సమయంలో బాబు మోహన్ కూడా ఆందోళ్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో పాటు చంద్రబాబు క్యాబినేట్‌లో మంత్రిగా పనిచేసారు. ఆ తర్వాత బాబు మోహన్ మరో రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.  అంతేకాదు వీళ్ల కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమా బి.గోపాల్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ‘బొబ్బిలి రాజా’.

    Bobbili Raja@31 Years: వెంకటేష్ ‘బొబ్బిలి రాజా’కు 31 యేళ్లు పూర్తి.. సాధించిన రికార్డులు ఇవే..

    కోట శ్రీనివాస రావు విషయానికొస్తే.. చిరంజీవి హీరోగా నటించిన ‘ప్రాణం ఖరీదు’తో తొలిసారి వెండితెరపై మెరిసారు. ఆ తర్వాత గ్యాప్ తీసుకొని టి. కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘వందేమాతరం’ సినిమాతో తిరిగి నటుడిగా రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కోట శ్రీనివాసరావు నటుడిగా వెనుదిరిగి చూసుకోలేదు.

    Kota Srinivasa Rao Babu Mohan First Time act In Venkatesh bobbili raja Movie,Kota Srinivasa Rao,Babu Mohan,Kota Srinivasa Rao Babu Mohan,Kota Srinivasa Rao Babu Mohan First Time act In Venkatesh bobbili raja Movie,Kota Srinivasa Rao Babu Mohan combination first Movie,Kota Srinivasa Rao Babu Mohan bobbili raja,tollywod,Telugu cinema,కోట శ్రీనివాస రావు,బాబు మోహన్,కోట శ్రీనివాస రావు బాబు మోహన్,బాబు మోహన్ కోట శ్రీనివాస రావు కాంబినేషన్,కోట శ్రీనివాస రావు బాబు మోహన్ టాలీవుడ్ సూపర్ హిట్ కాంబినేషన్
    కోట శ్రీనివాస రావు, బాబు మోహన్ (File/Photos)


    అటు బాబు మోహన్ విషయానికోస్తే.. ఈయన కోడి రామకృష్ణ దర్శకత్వంలో ‘ఆహుతి’ సినిమాలో తొలిసారి వెండితెరపై కనిపించారు. ఆ తర్వాత ‘అహనా పెళ్లంట’ సినిమాలో నటించినా.. అందులో కోట శ్రీనివాసరావుతో ఈయనకు కాంబినేషన్ సీన్స్ లేవు.

    Tollywood Thatha Manavallu : ఎన్టీఆర్ టూ నాగ చైతన్య వయా అల్లు అర్జున్, రానా వరకు టాలీవుడ్‌లో సత్తా చూపెడుతోన్న మనవళ్లు..

    ఆ తర్వాత ‘అంకుశం’ సినిమాలో పొలిటికల్ లీడర్స్‌ను మేనేజ్ చేసే పాత్రలో పాయే అంటూ చేసిన యాక్టింగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత  ‘లారీ డ్రైవర్’ సినిమా కూడా బాబు మోహన్ మంచి పేరు తీసుకొచ్చింది.

    Kota Srinivasa Rao Babu Mohan First Time act In Venkatesh bobbili raja Movie,Kota Srinivasa Rao,Babu Mohan,Kota Srinivasa Rao Babu Mohan,Kota Srinivasa Rao Babu Mohan First Time act In Venkatesh bobbili raja Movie,Kota Srinivasa Rao Babu Mohan combination first Movie,Kota Srinivasa Rao Babu Mohan bobbili raja,tollywod,Telugu cinema,కోట శ్రీనివాస రావు,బాబు మోహన్,కోట శ్రీనివాస రావు బాబు మోహన్,బాబు మోహన్ కోట శ్రీనివాస రావు కాంబినేషన్,కోట శ్రీనివాస రావు బాబు మోహన్ టాలీవుడ్ సూపర్ హిట్ కాంబినేషన్
    కోట శ్రీనివాస రావు, బాబు మోహన్ (File/Photos)


    బొబ్బలి రాజా సినిమాలో  తొలిసారి కోట శ్రీనివాస రావు, బాబు మోహన్ కాంబినేషన్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత వీళ్లు ఎక్కువగా ఇవివి సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డి వంటి దర్శకుల చిత్రాల్లో ఎక్కువగా కలిసి నటించారు. మొత్తంగా వెండితెరపై తమ జోడికి తిరుగులేదనిపించారు. ఇక వీళ్లిద్దరు కుమారులు కూడా యాదృచ్ఛికంగా  యాక్సిడెంట్‌లో కన్నుమూయడం విషాదకరం.

    Kota Srinivasa Rao Babu Mohan First Time act In Venkatesh bobbili raja Movie,Kota Srinivasa Rao,Babu Mohan,Kota Srinivasa Rao Babu Mohan,Kota Srinivasa Rao Babu Mohan First Time act In Venkatesh bobbili raja Movie,Kota Srinivasa Rao Babu Mohan combination first Movie,Kota Srinivasa Rao Babu Mohan bobbili raja,tollywod,Telugu cinema,కోట శ్రీనివాస రావు,బాబు మోహన్,కోట శ్రీనివాస రావు బాబు మోహన్,బాబు మోహన్ కోట శ్రీనివాస రావు కాంబినేషన్,కోట శ్రీనివాస రావు బాబు మోహన్ టాలీవుడ్ సూపర్ హిట్ కాంబినేషన్
    కోట శ్రీనివాస రావు, బాబు మోహన్ (File/Photos)


    కోట, బాబు మోహన్ వీళ్లిద్దరు తండ్రి కొడుకులుగా.. అన్నదమ్ములుగా.. స్నేహితులుగా నటించారు. ముఖ్యంగా కోట బాస్‌గా నటిస్తే.. అతని అసిస్టెంట్‌గా బాబు మోహన్ ఎన్నో సినిమాల్లో నటించారు. కానీ ఆహ్వానం సినిమాలో మాత్రం కోట శ్రీనివాస రావు .. బాబు మోహన్ అబ్బాయి పాత్రలో నటించడం విశేషం. చివరగా బాబు మోహన్ గత సార్వత్రిక ఎన్నికల ముందు  కోట శ్రీనివాస రావు ప్రాతినిధ్యం వహించిన బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే కదా.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: