HOME »NEWS »MOVIE »koratala siva to become producer for a good concept film sr

నిర్మాతగా కొరటాల శివ... మనసుకు నచ్చిన కథలతో..

నిర్మాతగా కొరటాల శివ... మనసుకు నచ్చిన కథలతో..
కొరటాల శివ Photo : Twitter

మాటల రచయితగా కెరీర్ ను మొదలుపెట్టిన శివ.. ఆ తర్వాత తన టాలెంట్‌తో స్టార్ దర్శకుడిగా ఎదిగాడు. అంతేకాదు శివ వరుసగా హిట్స్ ఇస్తూ తెలుగు చిత్రసీమలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు.

  • Share this:
    మాటల రచయితగా సినీ జీవితాన్ని మొదలుపెట్టిన శివ.. ఆ తర్వాత తన టాలెంట్‌తో స్టార్ దర్శకుడిగా ఎదిగాడు. శివ వరుసగా హిట్స్ ఇస్తూ తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. అంతేకాదు మంచి కథలతో  సమాజానికి అంతో ఇంతో ఉపయోగపడే మెసేజ్‌లతో సామాజిక సృహ ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ సామాజిక సృహ, సమాజం పట్ల సోయి మనం అందరిలో చూడలేము. ఒక రకంగా చెప్పాలంటే ఓ సోషల్ మెసేజ్‌ను కమర్షియల్ పంథాలో చెప్పి ఆ సినిమాను బ్లాక్ బస్టర్ చేయడంలో కొరటాల శివ నైపుణ్యుడు. ఇంకో విషయం ఏమంటే సినిమాలో ఎటువంటి అశ్లీలతకు చోటు లేకుండా సమకాలీన సమాజ పరిస్థితులను తన కథలలో చర్చిస్తూ సక్సెస్‌లు అందుకోవడం మామూలు విషయం కాదు. ఇది అందరికి సాధ్యం కాదు.  ఇప్పుడు కొరటాల సినిమా అంటే ఓ బ్రాండ్ అనే స్థాయికి వెళ్ళిపోయింది. అందుకే చిన్న హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోలైన ఎన్టీఆర్, మహేష్, మెగాస్టార్ లాంటీ వారు కూడా ఆయనతో సినిమా చెయ్యటానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం కొర‌టాల మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. అది అలా ఉంటే  లాక్‌ డౌన్‌‌ కారణంగా దొరికిన ఖాళీ సమయాన్ని ఒడుపుగా వాడుకుంటూ.. తమ భవిష్యత్ ప్రాజెక్టులను జాగ్రత్తగా ప్లాన్ చేసుకునే పనిలో నిమగ్నమై ఉన్నారు. అంతేకాదు కొత్తగా ఏవైనా చేయాలనీ ఆలోచన చేస్తున్నారు.

    అందులో భాగంగా డైరెక్టర్ కొరటాల శివ నిర్మాతగా మారనున్నాడు. అంతేకాదు లాక్ డౌన్ ముగిసిన వెంటనే శివ నిర్మాతగా ఓ సినిమాని ప్రకటించనున్నారని తెలుస్తోంది. అందులో భాగంగా తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేస్తున్న ఓ వ్యక్తికి దర్శకుడికి అవకాశం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా మరి చిన్న సినిమా కాకుండా.. మరి పెద్దగా కాకుండా మంచి కాన్సెప్ట్‌తో తెరకెక్కించాలనీ చూస్తున్నాడట. ఇక్కడ విషయం ఏమంటే సుకుమార్ వలే శివ కూడా స్వయంగా ఈ చిత్రానికి స్క్రిప్ట్ రాసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు అతి త్వరలో వెల్లడికానున్నాయి.

    Published by:Suresh Rachamalla
    First published:April 14, 2020, 11:48 IST

    टॉप स्टोरीज