కొరటాల శివ చేసిన ఆ త్యాగం తెలిస్తే చేతులెత్తి దండం పెడతారు..

Koratala Siva: కొరటాల శివ సినిమా అంటే కమర్షియల్ అంశాలతో పాటు సామాజిక స్పృహ కూడా ఉంటుంది. సినిమా అంటే కచ్చితంగా ఏదో మంచి చెప్పాలనే తపన ఈయనలో కనిపిస్తుంటుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 28, 2020, 6:36 PM IST
కొరటాల శివ చేసిన ఆ త్యాగం తెలిస్తే చేతులెత్తి దండం పెడతారు..
కొరటాల శివ రిటైర్మెంట్ ప్లాన్స్ (koratala siva retirement)
  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు కొరటాల శివ. అప్పుడెప్పుడో భద్ర సినిమాతో రైటర్‌గా తన ప్రస్థానం మొదలుపెట్టి ఆ తర్వాత కొన్నేళ్ళ పాటు రచయితగా బిజీగా ఉండి మిర్చి సినిమాతో దర్శకుడిగా మారాడు ఈయన. కొరటాల శివ సినిమా అంటే కమర్షియల్ అంశాలతో పాటు సామాజిక స్పృహ కూడా ఉంటుంది. సినిమా అంటే కచ్చితంగా ఏదో ఒక మంచి చెప్పాలనే ఉద్ధేశ్యం కూడా ఈయన సినిమాల్లో కనిపిస్తుంటుంది. ఆ తపన లేకుండా సినిమా చేయలేనని చెప్తుంటాడు ఈయన. ప్రస్తుతం చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్నాడు కొరటాల. ఈ చిత్రంలోనూ పర్యావరణ పరిరక్షకుడిగా తన హీరోను చూపిస్తున్నాడు కొరటాల.

చిరంజీవి, కొరటాల శివ (Chiranjeevi Koratala Siva)
చిరంజీవి, కొరటాల శివ (Chiranjeevi Koratala Siva)


ఇదిలా ఉంటే ఈయన గురించి చిరంజీవి ఈయన గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటికి చెప్పాడు. పెళ్లై ఇన్నేళ్లైనా కూడా మీరెందుకు పిల్లల్నెందుకు కనలేదని చాలా మంది సోషల్ మీడియాలో ప్రశ్నలు సంధించారు. దానికి కొరటాల కూడా మౌనంగానే ఉన్నాడు. ఏ రోజు సమాధానం అయితే చెప్పలేదు. అయితే దీనికి చిరు ఆన్సర్ ఇచ్చాడు. కొరటాలను తాను దర్శకుడిగా కంటే కూడా వ్యక్తిగా చాలా గౌరవిస్తానని చెప్పాడు మెగాస్టార్. అలాంటి వ్యక్తిని తన జీవితంలో మళ్లీ చూస్తానని కూడా అనుకోవడం లేదని చెప్పాడు ఈయన.

చిరంజీవి,కొరటాల శివ (Chiranjeevi Koratala Siva)
చిరంజీవి,కొరటాల శివ (Chiranjeevi Koratala Siva)


సామాజిక బాధ్యత ఉన్న వ్యక్తిగా కొరటాలకు తాను నూటికి నూరు మార్కులు వేస్తానంటున్నాడు. అంతేకాదు.. తనతో పాటు తన భార్య సంపాదించే దానిలో సగం సమాజం కోసమే ఖర్చు చేయడం అనేది అభినందనీయం అని చెప్పాడు ఈయన. ఇక సమాజం కోసమే పిల్లలను కూడా వద్దనుకున్న మహా మనిషి కొరటాల శివ అంటూ చెప్పుకొచ్చాడు చిరంజీవి. మెగాస్టార్ చెప్పింది విన్న తర్వాత కొరటాలపై గౌరవం ఒక్కసారిగా పదింతలు పెరిగిపోయింది. సమాజమే తనకు పిల్లలు అనుకునే వాళ్లు ఈ రోజుల్లో ఎంతమంది ఉంటారు మరి..? ఈ విషయంలో కొరటాల మాత్రం నిజంగానే అందరికీ ఆదర్శప్రాయుడు.
First published: May 28, 2020, 6:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading