హోమ్ /వార్తలు /సినిమా /

Mahesh Babu:ఆచార్య సినిమా ఆరంభం మహేష్‌తోనే.. ధర్మస్థలికి తీసుకెళ్లేది ఆయనే

Mahesh Babu:ఆచార్య సినిమా ఆరంభం మహేష్‌తోనే.. ధర్మస్థలికి తీసుకెళ్లేది ఆయనే

ఆచార్యకు మహేష్ వాయిస్ ఓవర్

ఆచార్యకు మహేష్ వాయిస్ ఓవర్

ఆచార్య సినిమాలో మొదటి రెండు నిమిషాల పాటు.. బ్యాక్ స్టోరీ వస్తుందన్నారు మహేష్ బాబు. ఆ స్టోరకి మహేష్ బాబు ఇచ్చిన వాయిస్ టెర్రిఫిక్ అన్నారు కొరటాల శివ.

2019 లో మొదలైన ఆచార్య(Acharya) మొత్తానికి 2022 లో ధియేటర్లోకి రాబోతోంది. ఏప్రిల్ 29న మరో వారం రోజుల్లో సినిమా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. చిరంజీవి, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో కొరటాల డైరెక్షన్లో తెరకెక్కిన ఆచార్య(Acharya Movie) సినిమా అనౌన్స్ చేసిన దగ్గరనుంచే సెన్సేషన్ అయ్యింది. అయితే లేటెస్ట్ గా ఈ సినిమాలో మరో టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ని కూడా చేశారు కొరటాల శివ. చిరంజీవి(Chiranjeevi), చరణ్(Ram charan) తోపాటు .. మహేష్ బాబు(Mahesh Babu) వాయిస్ ఓవర్ ఇవ్వడంతో సినిమా రేంజ్ నెక్ట్స్ లెవల్ కి వెళ్లిపోయింది.మహేష్ వాయిస్ ఓవర్‌కు సంబంధించి విషయం తాజాగా ఆచార్య టీం కన్ ఫర్మ్ చేసింది. దీనిపై డైరెక్టర్ కొరటాల శివ(Koratala Siva) ఓ వీడియో విడుదల చేశారు.

‘సినిమా ప్రారంభంలోనే.. మొదటి రెండు నిమిషాల పాటు ఓ బ్యాక్ స్టోరీ వస్తుంది. ఆడియన్స్‌ను ఆ స్టోరీతో రెండు నిమిషాల్లో తన ప్రపంచంలోకి తీసుకెళ్లాలన్నారు. మా టెంపుల్ టౌన్‌లోకి జనాల్ని తీసుకెళ్లాలి. అమ్మవారు ఆ ఊరిలో ఎలా వెలిసింది? నగరం ఎలా ఆవిర్భవించింది? అనే ఇంట్రస్టింగ్ స్టోరీ ఉంటుంది. దానికి వెరీ హానస్ట్ వాయిస్.. వారు చెబితే జనం ఇంట్రస్టింగ్‌గా వింటారు... అనేంత ఇమేజ్ ఉన్న పర్సనాలిటీ చెబితే.. బావుంటుందని అనిపించింది. సూపర్ స్టార్ మహేష్‌ను అడిగితే ఆయన వెంటనే రండీ.. అలాంటిది ఏమైనాఉంటే చెప్పేస్తాను అన్నారు. ఒకసారి స్క్రిప్ట్ చూస్తారా అని అడిగితే.. నోనో మీరు చేస్తే బెటర్’ అంటూ మహేష్(Mahesh Babu) ఆచార్య సినిమా కోసం వాయిస్ ఇచ్చారన్నారు కొరటాల

మహేష్ బాబు వాయిస్ ఓవర్ చేసిన విధానం అద్భుతమన్నారు. మహేష్ వాయిస్ ఓవర్‌తో ధర్మస్థలి ప్రపంచం కంప్లీంట్‌గా అర్థం అవుతుందన్నారు. మనం అంతా ధర్మస్థలిలోకి వెళ్లేలా మహేష్ బాబు చెప్పిన విధానం టెర్రిఫిక్ అన్నారు కొరటాల(Koratala). మహేష్‌కు హార్ట్ ఫుల్‌గా కృతజ్ఞతలు తెలిపారు. అటు చిరంజీవి కూడా మహేష్ చేసిన సాయం ట్విట్టర్ వేదికగా థాంక్స్ చెప్పారు. ఆచార్యలో ‘పాదఘట్టం’ను మహేష్ వాయిస్‌తో పరిచయం చేశామన్నారు చిరు. చాలా స్పెషల్ వేలో ఆచార్య సినిమాలో భాగమైనందుకు మహేష్ బాబు(Mahesh Babu)కు కృతజ్ఞతలు తెలిపారు మెగాస్టార్. ‘రామ్ చరణ్ నేను.. నిన్ను ఎంత ప్రేమిస్తామో.. నీ వాయిస్ విని జనం కూడా అంతే ఫీల్ అవుతారు’ అంటూ చిరు మహేష్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు.

First published:

Tags: Acharya movie, Koratala siva, Mahesh Babu, Megastar Chiranjeevi, Ram Charan

ఉత్తమ కథలు