యంగ్ టైగర్ ఎన్టీఆర్ (N. T. Rama Rao Jr.) హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. నందమూరి వారసుడిగా ప్రేక్షక మన్ననలు పొందుతున్న ఎన్టీఆర్.. రీసెంట్‌గా RRR రూపంలో భారీ సక్సెస్ ఖాతాలో వేసుకొని ఇప్పుడు కొరటాల ప్రాజెక్టుతో బిజీ అయ్యారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమా హీరోయిన్ విషయమై రోజుకో పేరు బయటకొస్తోంది. హీరోతో పాటు హీరోయిన్ పార్ట్ కూడా బలంగా ఉండాలని ప్లాన్ చేసిన కొరటాల శివ అందుకోసం వేట మొదలుపెట్టి చివరకు ఇద్దరు బ్యూటీలను ఫైనల్ చేశారని తెలుస్తోంది.
గతంలో ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన 'జనతా గ్యారేజ్' మూవీ సూపర్ సక్సెస్ కావడంతో మరోసారి అదే కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు నందమూరి ఫ్యాన్స్. ఎప్పుడైతే ఈ సినిమా అనౌన్స్ చేశారో అప్పటినుంచి అప్‌డేట్స్ వేట మొదలుపెట్టారు. అయితే ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ విషయమై పలు పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి.
మొదట బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ కన్ఫర్మ్ అయిందని అంతా అనుకున్నారు కానీ ఊహించని విధంగా ఆమె డేట్స్ అడ్జస్ట్ కాక ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుందని తెలిసింది. దీంతో మరో హీరోయిన్ వేట మొదలుపెట్టిన కొరటాల శ్రద్దా కపూర్ నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారని విన్నాం. ఇంతలోనే ఇప్పుడు కియారా సహా సాయి పల్లవి పేర్లు తెరపైకి వచ్చాయి. కథ ప్రకారం ఇద్దరు హీరోయిన్లకు స్కోప్ ఉందని, ఈ రెండు రోల్స్ చాలా ముఖ్యమైనవి కావడంతో ఇందుకోసం కొరటాల అంతా పక్కాగా స్కెచ్ రెడీ చేశారనే టాక్ నడుస్తోంది. ఎన్టీఆర్- సాయి పల్లవి కాంబోలో ఓ సాంగ్ కూడా ప్లాన్ చేశారని, ఇద్దరి స్క్రీన్ ప్రెజెన్స్, స్టెప్పులతో థియేటర్స్ హోరెత్తిపోయేలా కొరటాల ప్లాన్ రెడీ చేశారని తెలుస్తోంది.
మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ పుట్టిన రోజు (మే 20)న సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ ఇచ్చి నందమూరి అభిమానులను ఖుషీ చేశారు. ఓ పల్లెటూరు యువకుడు దేశ రాజకీయాలను శాసించే స్థాయికి ఎలా ఎదుగుతాడనే లైన్‌తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారట. నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్త సమర్పణలో రూపొందనున్న ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ కావాలనేది కొరటాల కోరికట. సో.. చూడాలి మరి యంగ్ టైగర్‌తో ఆయన మ్యాజిక్ ఎలా ఉంటుందనేది!.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jr ntr, Koratala siva, NTR30, Sai Pallavi