ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు. కొంత షూటింగ్ చేసాకా.. కరోనా లాక్డౌన్ నిబంధనల కారణంగా ఈసినిమా షూటింగ్ అన్ని సినిమాల వలే ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఇక రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగ్స్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినా.. చిరంజీవి మాత్రం రంగంలోకి దిగలేదు. ఆగష్టు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాలో చిరంజీవి.. దేవాదాయ, ధర్మదాయ శాఖలో పనిచేసే ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం కొరటాల శివ ప్రత్యేకంగా ొక దేవాలయం సెట్‌ను రూపొందించే పనిలో ఉన్నాుడ. మొన్నటి వరకు ఏదైనా పెద్ద దేవాలయంలో ఈ సినిమా షూటింగ్ చేయాలని భావించారు. కానీ కరోనా కారణంగా ప్రభుత్వం నుంచి పర్మిషన్స్ వచ్చే అవకాశాలు కూడా లేకపోవడంతో చిత్ర యూనిట్ హైదరాబాద్ శివారులో ప్రత్యేకంగా ఒక దేవాలయం సెట్‌ను రూపొందించే పనిలో పడింది.

చిరంజీవి, కొరటాల శివ (Chiranjeevi Koratala Siva)
దేవాలయాలను నిర్లక్ష్యం చేయడం వలన సమాజంపై ఎంత చెడు ప్రభావం చూపుతాయనేది ఈ సినిమా కాన్సెప్ట్. ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం రామ్ చరన్ లేదా రానాను అనుకుంటున్నారు. ఇంకోవైపు చిరంజీవి ఈ సినిమాలో డ్యూయల్ రోల్లో యాక్ట్ చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. ఆచార్య పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:July 21, 2020, 08:38 IST